Bigg Boss Telugu Season 8 :  బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో శేఖర్ భాష ఒకరు. ఆయన హౌస్ లో బాగానే యాక్టివ్ గా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఓటింగ్ పరంగా మాత్రం వెనకబడిపోయాడు. ఆయన ఈ పరిస్థితుల్లోకి రావడానికి కచ్చితంగా నాగ మణికంఠతో జరిగిన గొడవే కారణం అని చెప్పాలి. వెనుకబడిన శేఖర్ భాష హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతున్నాడు. కొన్ని కుళ్లిపోయిన జోకులు వేసి నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. పైగా శేఖర్ భాషను ఎవరికైనా చూపించండి అయ్యా బిగ్ బాసూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు నెటిజెన్లు. అయితే ఆట సంగతి, ఆయన చేసే కామెడీ సంగతి ఎలా ఉన్నప్పటికీ శేఖర్ రైజ్ చేసే పాయింట్ మాత్రం బెటర్ అనే చెప్పాలి. తను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పే శేఖర్ భాషకు ఓటింగ్ల లో దెబ్బ పడడానికి కారణం కచ్చితంగా మణికంఠతో జరిగిన గొడవే. 


Read Also: Bigg Boss 8 Prerana: బాబోయ్... తొక్కింగ్ ఎంటక్కా?


నామినేషన్ టైంలో మణికంఠ తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొని ఎమోషనల్ అయితే, శేఖర్ భాష మాత్రం ఆ బ్యాగేజీ అంతా తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం దేనికి? అందరికీ బాధలున్నాయి అంటూ ఒకరకమైన బాడీ లాంగ్వేజ్ తో సమాధానం ఇవ్వడం, ఆ తర్వాత హౌస్ లో దీని గురించి ఇతర సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధం కోసం బాణం తీయగా, అవతలి వ్యక్తి నా బ్యాగ్రౌండ్ తెలుసా నీకు? అది కనుక్కొని అప్పుడు దాడి చెయ్ అని అంటే ఎలా ఉంటుంది అంటూ సెటైర్లు వేయడం కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు ప్రేక్షకులు. అసలు అతను తన ఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకులను కూడా కన్నీళ్ళు పెట్టుకునేలా చేశాడు. ఇదే ఇప్పుడు శేఖర్ భాషకు మైనస్ గా మారింది. బయట ఉన్నప్పుడు తనకు సంబంధం లేని వివాదంతో జనాల నోళ్ళల్లో నానిన శేఖర్ భాష హౌస్ లో మాత్రం ఈ వివాదం కారణంగా ఓటింగ్ లో వెనకబడిపోవడం అంటే డేంజర్ జోన్ లో పడ్డట్టే. 


Read Also: Bigg Boss Telugu 8 Day 4: ఎమోషనల్ లో దొరికిపోయిన మణికంఠ,


బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిలో శేఖర్ భాష, మణికంఠ ఇద్దరూ బాగానే ఆడుతున్నారు. అయితే మణికంఠ సింపతి కార్డు ప్లే చేస్తుంటే, శేఖర్ భాష మాత్రం తనకు నచ్చిన విధంగా ఆడుతున్నాడు. ఇక వీళ్ళ ప్లస్ లు, మైనస్ లు పక్కన పెడితే హౌస్ లో ఉన్న వారంతా అతన్ని టార్గెట్ చేయడం నచ్చకపోవడం వల్లే ప్రేక్షక దేవుళ్ళు మణికంఠకు భారీ సంఖ్యలో ఓట్లు వేసి టాప్ 2 లో కూర్చోబెట్టారు. జనాల మైండ్లలోకి త్వరగా ఎక్కేది ఎమోషన్. హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో మణికంఠలో ఏం నచ్చలేదో ఆడియన్స్ కు అదే నచ్చింది. కాబట్టి అలా సింపతి అనేది మణికంఠకు ప్లస్ అయితే అతన్ని టార్గెట్ చేసిన శేఖర్ భాషకు ఇది మైనస్ అయింది. మిగతా వాళ్ళు నామినేషన్లలో లేరు కాబట్టి సేఫ్ అయ్యారు.