Bigg Boss Prerana Funny Words: నటి మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు మోహన్ బాబు ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె, పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సినిమాల కంటే ఆమె ఆమె మాట్లాడే మాటలు, చేసే చేష్టలతోనే బాగా పాపులర్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఆమె ఏం మాట్లాడినా సోషల్ మీడియాకు కావాల్సిన స్టఫ్ అందిస్తుంటుంది. ఆమె మాట్లాడే టెంగ్లీష్ విని ఫుల్ గా నవ్వేస్తారు. ‘నిలదీసిఫై’ ‘కిందపడి దొర్లాలి’ లాంటి ఆణిముత్యాలను విని ప్రేక్షకులను పడీపడీ నవ్వేశారు. లక్ష్మీ మంచు టెంగ్లిష్ కు సఫరేట్ గా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోనూ కంటెస్టెంట్ ప్రేరణ మాట్లాడిన ఓ మాట అచ్చం మంచు లక్ష్మిని గుర్తు చేసింది.


తొక్కింగ్ హర్..


పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె కీచు గొంతుతో మాట్లాడే మాటలు భలే క్యూట్ గా అనిపిస్తున్నాయి. అమ్మాయి చూడ్డానికి సన్నగా ఉన్నా నోరు మాత్రం పెద్దదే. తాజాగా ఈమె హౌస్ లో మాట్లాడిన ఓ వింత పదం నెటిజన్లకు ఫుల్ ఫన్ అందిస్తోంది. నామినేషన్స్ లో భాగంగా ‘తొక్కింగ్ హర్’ అంటూ కొత్త పదాన్ని క్రియేట్ చేసింది ప్రేరణ. ఆమె కాలు తొక్కిందని చెప్పేందుకు ప్రేరణ మాట్లాడిన ఈ మాట అందరినీ నవ్విస్తోంది. చివరకు ప్రేరణ కూడా తన మాటను తలచుకుని నవ్వేసింది. ప్రస్తుతం ప్రేరణ క్లిప్ నెట్టింట వైరల్ అవుతోంది.






ఆయిల్ తాగాలట!


అటు మరో బిస్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకులకు ప్రేరణ చెప్పిన టిప్ చూసి అందరూ ఫుల్ గా నవ్వుకుంటున్నారు. సోనియా తనకు గొంతులో డ్రైగా ఉందని... ఏమైనా తినాలన్నా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్తుంది. అది విన్న ప్రేరణ గొంతులో డ్రై తగ్గాలంటే ఆయిల్ తాగాలని చెప్తుంది. ఆయిల్ తాగితే గొంతులో డ్రెస్ నెస్ పోయి లూబ్రికేట్ అవుతుందంటూ కొత్త టిప్ ఇస్తుంది. ఈ మాట విని తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు. ఈ క్లిప్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.   







ఇంతకీ ఎవరీ ప్రేరణ?


కన్నడ బుల్లితెరపై నటిగా ప్రేరణ మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ‘రంగనాయకి’ షోతో బాగా పాపులర్ అయ్యింది. తెలుగులోనూ పలు సీరియల్స్ లో నటిస్తున్నది. ప్రేరణ, నటి రష్మిక మందన్న మంచి ఫ్రెండ్స్. ఇక ఈ షోలో పాల్గొన్న ప్రేరణకు వారినికి  2.5 లక్షలు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.  



Read Also: ఎమోషనల్ లో దొరికిపోయిన మణికంఠ, అమ్మ బిగ్ బాస్ ఇదంతా నీ ప్లానేనా?