Bigg Boss Telugu Season 8 day 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. హౌస్ మేట్స్ గొడవల కారణంగా ఉడికిపోతూ, ఆ కోపాన్ని నాగ్ ఇచ్చిన కత్తుల టాస్క్ తో చల్లార్చుకున్నారు. ఎపిసోడ్ మొదట్లోనే నాగార్జున మీ జడ్జిమెంట్ తోనే మొదలవుతుందని ప్రకటించారు. ఆ తర్వాత ఐదు రకాల డాగర్స్ ఉంటాయని చెప్పి, వెయిస్ట్ కి తాము ఇచ్చిన బెల్ట్ కట్టుకోవాలని సూచించారు. నల్ల కత్తి నెగెటివిటీ ఉన్నవారికి, తన మాటలతో ఎదుటివారిని గాయపరిచే వారికి చుర కత్తి, ఇరువైపులా పదునున్న కత్తిని మనిషి ఉన్నప్పుడు మంచిగా లేనప్పుడు చెడుగా మాట్లాడే వ్యక్తికి, తుప్పు పట్టిన కత్తినీ ఏ పనుల్లోను, మాటల్లోను కనిపించని వ్యక్తికి, తోలు తీసిన కత్తినీ మాస్క్ తీయాల్సిన అవసరం ఉంది అని అనిపించే కంటెస్టెంట్ కు గుచ్ఛాలని బిగ్ బాస్ సూచించారు.
Read Also: ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
టాస్క్ లోకి వెళ్తే శేఖర్ భాష తనకు మణికంఠ వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తున్నట్లుగా అనిపించిందని నల్లకత్తిని దింపాడు. నామినేషన్స్ లో ఆయన అలా ఎందుకు ఉంటున్నాడో చెప్పాడు కదా అని నాగ్ ప్రశ్నించగా తనకది కన్విన్సింగ్ గా అనిపించలేదు, అతను చెప్పిన స్టోరీ నిజం కాదనుకుంటున్నట్టు చెప్పాడు శేఖర్. ఇక నైనిక యష్మికి డబుల్ సైడెడ్, సీత నల్ల కత్తి, మణికంఠ కత్తిని గుచ్చారు. సోనియా తనకు బేబక్కతో కుక్కర్ తో మొదలై ఇంకా కుక్ అవుతూనే ఉంది అంటూ ఫుడ్ లేట్ అవుతుందని, కుకింగ్ చేసేటప్పుడు, ఆమె చూసేటప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ తనకు నచ్చలేదని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఆమ్లెట్ గొడవను తీసుకొచ్చి నల్ల కత్తి గుచ్చింది. ఇక ప్రేరణ, పృథ్వీ తుప్పు పట్టిన కత్తిని గుచ్చి హౌజ్ లో ఏదైనా గొడవ జరిగితే ఒపీనియన్ చెప్పాలి అని ఆదిత్య నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నారు. యష్మి మణికంఠకు మాట మీద నిలబడట్లేదని డబుల్ సైడెడ్ కత్తి గుచ్చింది. ఫుడ్ విషయంలో బేబక్క ఫ్లిప్ అవుతోందని నిఖిల్ కంప్లైంట్ చేయగా, బేబక్క మాత్రం నిఖిల్ ఎక్కువగా సోనియాకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడంటూ వాదించింది. అంతేకాకుండా అతని టీం నుంచి వెళ్ళిపోయింది. చివరగా ఆదిత్య శేఖర్ కి తుప్పు పట్టిన కత్తి గుచ్చి నేను 20 % రస్ట్ ఉంటే శేఖర్ 120% ఉంటాడు. ఈ జోంబీ లాంటి ఇంట్లో శేఖర్ నిద్రలో తిరుగుతున్నాడని, మెంటల్ గా హౌస్ లో ఉన్నట్లేదని కంప్లైంట్ చేశాడు. నాగార్జున కూడా శేఖర్ కుళ్లు జోకులకు తుప్పు పట్టిన కత్తితో అతన్ని గుచ్చడం కరెక్ట్ అంటూ ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.
Read Also: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
విష్ణు ప్రియ కత్తిని సోనియాకు గుచ్చి కోపం వచ్చినప్పుడు ఆమె వాడే పదాలు హర్టింగ్ గా ఉంటాయని చెప్పుకొచ్చింది. అయితే తను జోక్ గా అలా అడిగానని ముందు చెప్పిన విష్ణు ప్రియ ఆ తర్వాత క్యాజువల్ గా అడిగాను అంటూ నాగ్ ముందే మాట మార్చింది. దీంతో నాగార్జున నువ్వు క్యాజువల్ గా మాట్లాడావు సరే ఆమె బాధపడితే అలాగే గుచ్చుతావా? నువ్వు కూడా అమ్మాయివి కదా ? నువ్వు చాలా క్యాజువల్ గా అడిగినప్పటికీ అవతలి వాళ్ళు అపార్థం చేసుకుంటే దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అని చెప్పారు నాగ్. నువ్వు ఎటువంటి పర్సనాలిటీనో నాకు తెలుసు, పదేపదే నువ్వు పుణ్య స్త్రీ అంటుంటే ఇద్దరి మధ్య కోపాన్ని ఇంకా పెంచుకోవడమే అవుతుంది అంటూ విష్ణు ప్రియకు గట్టిగానే క్లాస్ పీకారు నాగార్జున.