BiggBoss winner Revanth: శ్రీహాన్ తీసుకున్న నిర్ణయంతో రేవంత్ విజేత అయ్యాడు. లేకుంటే రన్నరప్ గా మిగిలేవాడు. శ్రీహాన్ గోల్డెన్ బ్రీఫ్‌కేసులో నాగార్జున ఇచ్చిన నలభై లక్షల రూపాయలకు టెంప్ట్ అయి రెండోస్థానంలో నిలిచాడు. దీంతో మిగిలిన రేవంత్  విజేత అయ్యాడు. రేవంత్ ట్రోఫీని అందుకున్నాక నాగార్జున అసలు విషయం చెప్పారు. అత్యధిక ఓట్లు పడింది శ్రీహాన్‌కేనని చెప్పారు. ఏది ఏమైనా ఈ సీజన్లో ఇద్దరు విన్నర్లు అయ్యారు. రేవంత్ ఆడకుండా ట్రోఫీ అందుకున్నాడని చెప్పలేము. శ్రీహాన్‌కి అధిక ఓట్లు పడినప్పటికీ ఆటలో రేవంత్ తక్కువేమీ కాదు.  అతను ఎలా ఆడినా, ఆడకపోయినా, పక్కవాళ్లని తిట్టినా, అరిచినా, గొడవలు పడినా... ఏం చేసినా ఓట్లు మాత్రం కొన్ని వారాల పాటూ గుద్ది పడేశారు ప్రేక్షకులు. కొన్ని వారాల తరువాత మధ్యలో ఇనాయ, తరువాత రోహిత్ అతనికి కాస్త పోటీ ఇచ్చారు, కానీ అది స్వల్పకాలమే. మళ్లీ రేవంత్ ఓటింగ్లో శిఖరానికి చేరాడు. అతని ఆటకు ముగ్ధులయ్యారో, లేక పాటకు పడిపోయారో కానీ ప్రేక్షకులు ఓట్లు మాత్రం వెల్లువలా వేశారు.కానీ చివర్లో మాత్రం ట్విస్టు ఇచ్చారు ప్రేక్షకులు. శ్రీహాన్‌కు ఓట్లు గుద్దేశారు. కానీ శ్రీహాన్ తీసుకున్న నిర్ణయంతో రేవంత్ విజేత అయ్యాడు. అప్పుడు ఇండియన్ ఐడల్ గెలిచిన రేవంత్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అయ్యాడు.  


అప్పుడు ఐడల్
2017లో సోనీ మ్యూజిక్ ఛానెల్‌లో నిర్వహించిన ప్రముఖ పాటల పోటీ ‘ఇండియన్ ఐడెల్ 9’లో రేవంత్ పాల్గొన్నాడు. అక్కడ తన గాత్రంతో జడ్జిలను మెప్పింది విజేతగా నిలిచాడు. పాటలోనే కాదు, డ్యాన్సులోనూ గ్రేస్ ఉండడంతో అతనికి యువత ఎంతో మంటి ఆకర్షితులయ్యారు, అభిమానులయ్యారు. 


నాన్న లేరు...
రేవంత్‌ది శ్రీకాకుళం. పెరిగింది మాత్రం విశాఖపట్నంలో. అతను తల్లి కడుపులో ఉండగానే తండ్రి మరణించారు. దీంతో అతనికి నాన్న ప్రేమ తెలియదు. అతని కుటుంబంలో సంగీత విద్వాంసులు ఎవరు లేరు. అయినా ఇతనికి మంచి గాత్రం వచ్చింది. ఎక్కడా సంప్రదాయ సంగీతం నేర్చుకోలేదు. చదువును కూడా మధ్యలోనే వదిలేసి హైదరాబాద్ వచ్చి సినిమాల్లో పాటలు పాడేందుకు ప్రయత్నాలు చేశారు. అవకాశాలు చేజిక్కించుకుని 2008 నుంచి పాటలు పాడడం మొదలుపెట్టారు. బాహుబలిలో ‘మనోహరి’ పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సుప్రీమ్ సినిమాలో రీమిక్స పాట ‘అందం హిందోళం’ పాటూ కూడా స్టార్ సింగర్ హోదా తెచ్చింది. 






Also read: రన్నర్‌గా మారిన విన్నర్ శ్రీహాన్, అత్యధిక ఓట్లు ఆయనకే, కానీ - ప్రైజ్ మనీ ఎంతొచ్చిందంటే