బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అడుగు పెట్టాక మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అనుకుంటే అది కేవలం నామినేషన్లకు మాత్రమే పరిమితమైంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ ప్రేక్షకులకు బోర్ కొట్టించే విధంగా ఉంది. ఎప్పటిలాగే బిగ్ బాస్ ఈసారి కూడా బీబీ హోటల్ అంటూ మరో రొటీన్ టాస్క్ ను ఇచ్చాడు. కానీ ఆ టాస్క్ లో హౌస్ మేట్స్ అందరూ కలిసి చేసిన వింత చేష్టలు ప్రేక్షకులను తికమకకు గురి చేసాయి. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఉన్న హైలెట్స్ ఏంటో చూసేద్దాం పదండి. 


బిగ్ బాస్ పై మళ్లీ సెటైర్లు 


తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ 'నవ్వకుండా ఉండడానికి ప్రయత్నించు' అంటూ ఒక ఫన్నీ టాస్క్ ని ఇచ్చారు. హౌస్ మేట్స్ లో అమ్మాయిలందరినీ ఒక గ్రూప్ గా, అబ్బాయిలందరినీ ఒక గ్రూపుగా విభజించి.. అమ్మాయిల గ్రూప్ కి లీడర్ గా అవినాష్ ను, అబ్బాయిల గ్రూప్ కి రోహిణిని నియమించారు. అవినాష్, రోహిణి నోట్లో నీళ్లు వేసుకుని నిలబడిన ఆపోజిట్ టీమ్స్ ని నవ్వించాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో అవినాష్ టీం గెలిచింది. కానీ టాస్క్ లో భాగంగా 'అశ్వద్ధామ 2.0 వచ్చాడు' అంటూ అవినాష్ చేసిన కామెడీకి గౌతం ఏడుస్తూ కూర్చున్నాడు. గత సీజన్ లో 'అశ్వద్ధామ 2.0' అంటూ గౌతమ్ ఓ రేంజ్ లో ట్రోల్ అయ్యాడు. 'అది సీజన్ 7 లోనే అయిపోయింది. దాన్ని మళ్ళీ మళ్ళీ తీసి నాకు ఇరిటేషన్ తీసుకురావద్దు. నన్ను వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను' అంటూ మైక్ విసిరి కొట్టి కన్నీళ్లు పెట్టుకున్నాడు గౌతమ్. ఆ తర్వాత తనకు అసలు విషయం ఏంటో తెలియదు అంటూ అవినాష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత రోహిణి, అవినాష్ బిగ్ బాస్ పై కామెడీ పంచులు వేసి గిఫ్ట్ గా సాల్ట్ ను పొందారు. 


మరోవైపు విష్ణుప్రియ చేయి తెగింది అంటూ పృథ్వీతో సేవలు చేయించుకుంది. ఇక ఆ తర్వాత గంగవ్వ హంగామా చూడాలి. ఆమె విష్ణు ప్రియ, హరితేజలతో కలిసి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల పాటకి డాన్స్ లేసి అదరగొట్టింది. అంతేకాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ విష్ణు ప్రియ ధ్యానం చేసుకుంటుండగా వెళ్లి చెడగొట్టడానికి ట్రై చేసింది. ఇక ఈ టాస్క్ లో పాల్గొన్న రోజు నైట్ నువ్వు నోరు జారుతున్నావు అంటూ నిఖిల్ కు హింట్ విష్ణు ప్రియ ఆ మాట తన దగ్గర ఎవరు అన్నారు అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేసింది. మరోవైపు హరితేజ 'నీ ఏజ్ ఏంటి ? వయసు ఎంత?' అంటూ తనను మణికంఠ ఏదో అన్నాడు అంటూ కంప్లైంట్ చేసింది. 


Read Also : Akkineni Naga Chaitanya : నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి.. 


విలాసవంతమైన హోటల్ టాస్క్..


ఈ ఎపిసోడ్ లో భాగంగానే బిగ్ బాస్ 'విలాసవంతమైన హోటల్ టాస్క్' అంటూ ఓజి క్లాన్ ని హోటల్ సభ్యులుగా, రాయల్ క్లాన్ ను అతిథులుగా విభజించారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా అతిథులను మెప్పించి, ఎవరు ఎక్కువ మనీ సంపాదిస్తే వాళ్లు చీఫ్ కంటెండర్ అవ్వొచ్చని, అలాగే తమ పర్ఫామెన్స్ తో మెప్పించి స్టార్స్ ను గెలుచుకున్న వారికి స్పెషల్ పవర్ కూడా దక్కుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. నబిల్ హోటల్ ఓనర్, నిఖిల్ హెడ్ చెఫ్, ప్రేరణ మతిమరుపు మేనేజర్, సీత అసిస్టెంట్ చెఫ్, పృథ్వి గార్డ్, విష్ణు ప్రియ అతిథుల పర్సనల్ మేనేజర్, యశ్మీ గౌడ, మణికంఠ హౌస్ కీపింగ్ పాత్రలు చేశారు. మరోవైపు రాయల్ క్లాన్ లో గంగవ్వ రాజవంశానికి చెందిన మహారాణి, ఆమె అసిస్టెంట్ గా నయని, సూపర్ స్టార్ గా అవినాష్, అతని గర్ల్ ఫ్రెండ్ పొగరుబోతు డబ్బున్న అమ్మాయిగా రోహిణి, స్పైగా మెహబూబ్ మెహబూబ్, అతని అసిస్టెంట్ గా హరితేజ, హాండ్సం క్రిమినల్ గా గౌతమ్ నటించారు. కానీ ఈ టాస్క్ లో భాగంగా వీరు చేసిన పనులన్ని తికమక పెట్టే విధంగా ఉన్నాయి. ఒకానొక టైమ్ లో మణికంఠపై రోహిణి ఫైర్ అయినట్టుగా చేసిన కామెడీ పేలలేదు.