‘బిగ్ బాస్’లో సోమవారం నామినేషన్స్ వాడీ వేడిగా సాగున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో కుంపటి పెట్టి మరీ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. కంటెస్టెంట్లు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారి ఫొటోలను మంటల్లో వేయాలి. శివాజీ.. శోభాశెట్టిని నామినేట్ చేశాడు. భోలే బూతులు మాట్లాడటం తప్పు అంటూనే.. ఆయన క్షమాపణలు కోరినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబడుతూ శివాజీ ఆమెను నామినేట్ చేశాడు. అయితే, శోభా కూడా శివాజీతో గట్టిగానే వాదించింది. క్షమించాలా, వద్దా అనేది తన నిర్ణయమని పేర్కొంది.
శివాజీని నామినేట్ చేసిన శోభా
శివాజీని శోభా శెట్టి నామినేట్ చేస్తూ.. ‘‘నామినేషన్స్ రోజు ఆ పాయింట్ రైజ్ చేయడం నాకు ఎలా అనిపిస్తోందంటే.. నన్ను నెగటివ్‌గా చూపించేందుకు మంచి అవకాశం మీకు’’ అని తెలిపింది. ‘‘నిన్ను ఇక్కడ నుంచి పంపించాలంటే నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపలేడు’’ అని శివాజీ అన్నాడు. ‘‘నీకు ఈ ఇంట్లో అర్హత లేదనే కారణంతో నామినేట్ చేస్తున్నారు’’ అని శోభా శెట్టి అనడంతో.. శివాజీ స్పందిస్తూ ‘‘అర్హత అనే పదం పెట్టడానే కానీ, ఇక్కడ శివాజీతో సహా ఎవరికీ ఉండే అర్హత లేదు’’ అని అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని అశ్విని శ్రీ నామినేట్ చేస్తూ.. ‘‘ఒక మనిషికి మర్యాద అనేది ఎవరి పేరెంట్స్ అయినా నేర్పిస్తారు’’ అని అంది. ‘‘పేరెంట్స్ గురించి తీయొద్దు. మా పేరెంట్స్ గురించి తీయొద్దు’’ అని శోభాశెట్టి అరిచింది. ఈ వారం కూడా భోలేగాకు గట్టిగానే నామినేషన్లు పడినట్లు తెలుస్తోంది. శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్‌లు భోలేను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.
శోభను నామినేట్ చేసిన శివాజీ
తాజాగా విడుదలైన బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇంట్లో ఉండడానికి ఏ ఇద్దరు అనర్హులో వారి ఫోటోలను మంటలో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ప్రోమోలో భాగంగా ముందుగా శివాజీ ఇద్దరిని నామినేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. భోలే విషయమై శివాజీ.. శోభను నామినేట్ చేశారు. "తను తప్పు మాట్లాడాడు 100%. రెండు వందల పర్సెంట్ తప్పే. కానీ వెంటనే ఆ విషయంపై సారీ కూడా చెప్పాడు. మన తోటి మనిషే కదా. క్షమిస్తే ఏమిపోద్ది అని నా అభిప్రాయం" అని శివాజీ అనగా.. "మీకు దేవుడు క్షమించే మనసు ఇచ్చాడు. నాకు క్షమించే మనసు ఇవ్వలేదు" అంటూ శోభ బదులు చెప్పింది.
"నిన్ను మార్చే హక్కు కానీ, నిన్ను మారమని ప్రెజర్ చేసే రైట్ కానీ నాకు లేవు" అంటూ శోభ ఫోటోను శివాజీ మంటల్లో వేశారు. "కామన్ సెన్స్ కూడా ఉండదు నామినేషన్స్ వేస్తారు" అంటూ శోభ తన ఫీలింగ్ వెల్లడించింది. శివాజీ నామినేషన్స్ తర్వాత గౌతమ్ నామినేషన్స్ ప్రక్రియ చేశాడు. ప్రశాంత్‌ని తను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.