Bigg Boss Telugu Season 7 : బిగ్‌బాస్ సీజన్ 7..  నామినేషన్ల ప్రోమో లేటెస్ట్‌గా రిలీజ్ అయ్యింది. నామినేషన్లలో భాగంగా నరకం అనే కాన్సెప్ట్‌ పెట్టారు బిగ్‌బాస్. ఇందులో హౌస్‌మేట్స్ తాము నామినేట్ చేయాలి అనుకునే ఇద్దరి బుగ్గలపై రెడ్ కలర్ పూసి నామినేట్ చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఏదైతే జరగకూడదో అనుకున్నానో అదే జరిగింది అంటూ అర్జున్‌ శివాజీపై అసహనం వ్యక్తం చేశాడు. ఇక శివాజీ కూడా అర్జున్‌పై ఫైర్ అయ్యారు. ఇంత చెప్పాక ఫ్రెండ్‌గా నువ్వు వేస్ట్ అంటూ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ తీసేశాడు. గౌతమ్, శివాజీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. వీరి మధ్య ఎన్నో వారాల నుంచి వార్ నడుస్తుంది. నాగార్జున కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చినా సరే.. గౌతమ్ శివాజీ మీద తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేక పోతున్నాడు. ఇక ప్రియాంక అయితే శివాజీ తనని సపోర్ట్ చేస్తూనే.. అంతకంటే ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు చెప్పి నామినేట్ చేసింది. ఇక శోభ కూడా ఎప్పటిలాగే తన యాటిట్యూడ్ చూపించింది. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే ఎక్కువ మంది హౌస్‌ మేట్స్ శివాజికి నామినేట్ చేశారని అర్థమవుతోంది.  ఇక మొత్తానికి ఈ వారం ప్రశాంత్ తప్ప అందరూ నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ల నుంచి సేవ్ అయిన వారు టికెట్‌ టూ ఫినాలే ఆడుతారు.


ఇక శనివారం అశ్విని ఎలిమినేట్‌ అయి బిగ్‌బాస్ ఇంటిని వీడింది. నిన్న రతిక ఎలిమినేట్ అయింది. ప్రశాంత్‌కి లభించిన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ రతిక కోసం ఉపయోగిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ ప్రశాంత్ ఉపయోగించలేదు. 14వ వారంలో ఎవరికి ఆ పాస్ అవసరమో వారికోసమే యూజ్ చేస్తా అని ప్రశాంత్ నాగ్‌కి చెప్పేశాడు. ప్రశాంత్ ఆ పాస్‌ను రతిక కోసం ఉపయోగించనందకు రతికకు సారీ చెప్పాడు. మరోవైపు శివాజీ రతికకు కాఫీ ఇద్దామనుకున్నానని కానీ ఇలా ఎలిమినేట్ అవ్వడం షాకింగ్‌గా ఉందని చెప్పాడు.   


రెండో సారి బిగ్‌బాస్ ఇంటిలోకి  అడుగుపెట్టిన రతికి బయట గేమ్ చేసి వచ్చింది కాబట్టి టఫ్ ఫైట్ ఇస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ రతిక రీ ఎంట్రీలో గేమ్ పూర్తిగా పోయిందని ఆడియన్స్ భావించారు. అసలు తనెందుకు వచ్చిందా అని తలలు పట్టుకున్నారు. రెండో సారి ఎంట్రీ ఇచ్చినప్పటికి రతికకు నెగిటివిటీ బాగా వచ్చింది. మరోవైపు రతిక బిగ్‌బాస్ బజ్‌లోనూ పాల్గొంది. బయట నుంచి గేమ్ చూసి వెళ్లి కూడా ఎందుకు సరిగా ఆడలేదని గీతూ ప్రశ్నించింది. అసలు గేమ్ ఆడకుండా ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావ్ అని అడిగేసింది. అసలు హౌస్‌లో తనెందుకు సరిగా ఆడలేకపోయిందో రీజన్ చెప్తూ బోరున ఏడ్చేసింది రతిక. కొన్ని విషయాలకు తాను ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయానని అవే తనని గేమ్‌లో ముందుకు వెళ్లకుండా కట్టిపడేశాయని చెప్తూ రతిక ఎమోషనల్ అయింది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply