శనివారం బిగ్ బాస్ షో హాట్ హాట్‌గా సాగనుంది. కుండబద్దలు కొట్టి మరీ కింగ్ నాగార్జున కంటెస్టెంట్స్‌లో ఉన్న లోపాలు చెప్పారు. ‘కొన్ని నిజాలు చెప్పాలి’ అంటూ ప్రారంభించి మొదట అశ్వినిని పిలిచారు. ఆమె ముఖం ఉన్న కుండను బద్దలు కొట్టి తను మిగతా కంటెస్టెంట్స్‌తో మాట్లాడే పద్ధతి అస్సలు బాలేదని తెలిపారు. అనంతరం భోలే షావలిని పిలిచి మనకు వాడుకలో ఉన్న పదాలు కొన్ని ఉండచ్చు, ఎర్రగడ్డ అనడం ఏ ఫ్లోలో వచ్చింది అని ప్రశ్నించారు. అప్పుడు భోలే ‘ఆమె సెన్స్‌లెస్ అనే పదం వాడింది.’ అని రిప్లై ఇచ్చాడు. వెంటనే నాగార్జున ‘సెన్స్‌లెస్‌కు, మెంటల్‌కు చాలా తేడా ఉంది. అది మీకు తెలీదా?’ అని తిరిగి ప్రశ్నించారు.


అనంతరం ప్రియాంకను ‘మాట జారిన తర్వాత క్షమాపణ అడిగినా అది వర్కవుట్ అవ్వదు.’ అన్నారు. వెంటనే శోభను కూడా లేపి ‘బిగ్ బాస్ పంపించిన కేక్ తినేటప్పుడు అమర్ అలా తినేటప్పుడు బిగ్‌బాస్‌కు ఎందుకు కంప్లయింట్ చేయలేదు? మీది గ్రూపిజమా?’ అని ప్రశ్నించారు. అమర్‌దీప్‌ను ‘కేక్ విషయంలో కూడా మళ్లీ అదే తొందర. దాని వల్ల ఎంత ప్రమాదంలో పడ్డావో తెలుసా?’ అని అడిగారు.


తేజతో మాట్లాడుతూ... ‘నీ నుంచి ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకరిని రెచ్చగొట్టడం, ఇదంతా నాకు శాడిజంలాగా ఉంది.’ అన్నారు. పల్లవి ప్రశాంత్‌కు స్ట్రయిట్‌గా ఒకే ప్రశ్న వేశారు. ‘నామినేషన్ సమయంలో సందీప్ ఒట్టు వేసినప్పుడు నువ్వు ఎందుకు ఒట్టు వేయలేదు?’ అని అడిగారు. వెంటనే ప్రశాంత్ ‘అన్న అలా అన్నాడనే ఉద్దేశం కాదు సార్’ అని కవర్ చేయడానికి ప్రయత్నించగా... నాగార్జున వెంటనే ‘ప్రశాంత్, ప్రశాంత్’ అంటూ హెచ్చరించారు.  ‘ఒకరి మీద నింద వేస్తే అది నిజం అయి ఉండాలి. ఊరోడు అనడం తప్పా’ అని తిరిగి ప్రశ్నించారు. ‘మా నాన్న ఊరోడే అని నేను గర్వంగా చెప్పుకుంటా. దాంట్లో తప్పే లేదు.’ అన్నారు.


ఇక తర్వాత విడుదల అయిన రెండో ప్రోమో సరదాగా సాగింది. ‘సందీప్ కత్తిలో టాటూ వేయించేద్దామా?’ అని తేజను నాగార్జున టీజ్ చేశారు. వెంటనే తేజ మాట్లాడుతూ ‘శోభ పేరు తెలుగులో రెండక్షరాలే కాబట్టి ఆ తొడ మీద ఒక అక్షరం, ఈ తొడ మీద ఒక అక్షరం వేయించుకుంటే సరిపోతుంది సార్.’ అన్నాడు. వెంటనే శివాజీ ‘టాటూ అంత లేదండీ’ అన్నాడు. వెంటనే నాగార్జున ‘ఇంత బ్రిలియంట్ ఐడియా’ ఎవరిది అనగానే హౌస్‌మేట్స్ అందరూ ఒక్కసారిగా అర్జున్ పేరు చెప్తారు.


ఆ తర్వాత పాము, నిచ్చెన ఆట ఆడారు. మొదట అశ్వినిని పిలిచి నీకు ఆటలో నిచ్చెన ఎవరు? పాము ఎవరు? అని అడిగితే నిచ్చెన గౌతమ్ అని, పాము శోభ అని చెప్తుంది. గౌతమ్ వచ్చేసి నిచ్చెనగా అర్జున్‌ని, పాముగా శివాజీని ఎంచుకున్నాడు. శివాజీ కామెడీగా వదిలేసిన కొన్ని మాటలకు తాను హర్టయ్యానని చెప్పాడు. శివాజీని పిలిచినప్పుడు నిచ్చెనగా యావర్‌ను, పాముగా అమర్‌దీప్‌ని సెలక్ట్ చేశాడు. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అమర్‌దీప్ మైండ్‌లో నెగిటివిటీనే ఉందని చెప్పాడు. దానికి అమర్‌దీప్ రిప్లై ఇస్తూ... నా ప్లేస్‌లో ఆయన ఉన్నా అదే చేసేవాడని చెప్పాడు. వెంటనే శివాజీ ‘నేను చచ్చినా అలా చేయను.’ అని సమాధానం ఇచ్చాడు. అమర్‌దీప్‌కు అవకాశం వచ్చినప్పుడు నిచ్చెనగా అర్జున్, పాముగా తేజను ఎంచుకున్నాడు. ‘మనకు అవసరం వచ్చినప్పుడు మనోడు కదా మనకు సాయం చేస్తాడు అనుకుంటే పక్కనోళ్లకి వేసేశాడు.’ అని రీజన్ చెప్పాడు. నాగార్జున తేజను ‘నువ్వెప్పుడైనా తేజకు నిచ్చెనలా నిలిచావా?’ అని అడిగినప్పుడు తేజ సీరియస్‌గా ఫేస్ పెట్టి ‘చాలా సార్లు ఉన్నాను సార్. నా గుడ్లలో నుంచి రెండు వాడికిచ్చాను సార్.’ అని ఫన్నీగా రిప్లై ఇస్తాడు. అప్పుడు హౌస్‌లో ఉన్న వాళ్లందరూ నవ్వుతారు. ‘నిన్ను సెలక్ట్ చేయడంలో తప్పే లేదు తేజ.’ అని నాగార్జున నవ్వుతూ అన్నాడు. ప్రోమోలను బట్టి శనివారం ఎపిసోడ్ వాడి వేడిగా సాగనుందని అర్థం అవుతోంది.