‘బిగ్ బాస్’ హౌస్‌లో అమర్‌దీప్‌పై ఇప్పటివరకు ఎంత నెగిటివిటీ వచ్చిందో తెలిసిందే. అమర్‌దీప్.. హౌస్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీలతో వ్యతిరేకంగా మాట్లాడిన దగ్గర నుంచి కొంతమంది ప్రేక్షకులకు టార్గెట్ అయ్యాడు. ఇంట్లో కూడా ఎలా ఉండాలో తెలియక, టాస్కుల్లో తడబడుతూ.. తనని తాను నిందించుకుంటూ.. అరుస్తూ.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చాలా గందరగోళంతో గడిపేశాడు. దీంతో అమర్‌దీప్ బయటకు వెళ్లిపోతాడనే పరిస్థితి వచ్చింది. పైగా గుండు టాస్కులో అమర్‌దీప్ వెనకడుగు వేయడం కూడా మైనస్‌గా మారింది. ఈ కారణంతో తోటి కంటెస్టెంట్స్ పదే పదే అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తూ వచ్చారు. దీంతో అమర్‌దీప్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం గ్యారెంటీ అనిపించేలా పరిస్థితి నెలకొంది. 


తనని తాను మార్చుకున్న అమర్‌దీప్


హోస్ట్ నాగార్జున సైతం అమర్‌దీప్‌లో మార్పురావాలని కొన్ని వారాలుగా చెబుతూ వచ్చారు. దీంతో అమర్‌దీప్ దాన్ని సీరియస్‌గా తీసుకుని తనని తాను మార్చుకోడానికి ప్రయత్నించాడు. టాస్కుల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ప్రయత్నించాడు. అయితే, తనపై తనకు నమ్మకం పోవడంతో హౌస్‌లో ఉండటానికి తాను అర్హుడిని కాదని, ప్రేక్షకులు తనని బయటకు పంపేస్తారని ఆందోళన చెందాడు. రియల్ అమర్‌దీప్ అమాయకుడని గుర్తించిన ప్రేక్షకులు అనుకూలంగా ఓట్లు వేసి.. అతడిని స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా నిలబెట్టారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచాడు బిగ్ బాస్. అయితే, బిగ్ బాస్‌లో అమర్‌దీప్ ఎదుర్కొంటున్న నెగిటివిటీ గురించి అతడి భార్య తేజస్విని గౌడ స్పందించింది. అభిమానుల నుంచి వచ్చిన ప్రశ్నలకు, సందేహాలకు ‘యూట్యూబ్’ ద్వారా సమాధానం ఇచ్చింది. 


బూతులతో వేధించారు, అందుకే స్పందించలేదు: తేజస్విని


‘‘లాస్ట్ 5 వారాలు చాలా ఇబ్బంది పడ్డాడు. చాలామంది అడిగారు.. మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని. పెయిడ్ పీఆర్ బ్యాచ్ వేధించారు. నెగిటివీ, బూతులు తిడుతుంటే.. బయటకు వచ్చి ఎలా మాట్లాడారు. ఆర్టిస్టుగా నాకు పని ఉంటుంది. నా వర్క్‌తోపాటు అమర్‌దీప్ విషయాలను కూడా చూసుకుంటున్నా. ఏం స్పందించినా.. పెయిడ్ పీఆర్ వాళ్లు బూతులు తిడుతూ కామెంట్లు చేయిస్తున్నారు. అందుకే, ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. కానీ, ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చారు. జెన్యూన్ ఫ్యాన్స్ అమర్ ఆశించిన స్థాయిలో లేరని చెప్పారు. దానికి ఫీలు కాలేదు. కానీ బూతులు తిట్టేవారి వల్లే ఇబ్బంది. ఇకపై అమర్ గురించి స్టాండ్ తీసుకుంటా. ఇది చెప్పిన తర్వాత కూడా పీఆర్ బ్యాచ్ నెగటివ్ కామెంట్ చేస్తే నేను ఏం చేయలేను. నేను కూడా ఆడపిల్లనే. మీ ఇంటి ఆడపిల్లను కూడా ఇలాగే నెగటివ్ కామెంట్లతో తిడితే ఎలా ఉంటుంది. మూడు నెలల గేమ్ షో ‘బిగ్ బాస్’. ఒక్కోసారి కొట్టుకుంటారు. ఒకసారి కలిసి ఉంటారు. దాని గురించి మీరు వారి ఫ్యామిలీలను, లేడీస్‌ను తిట్టడం ఏమిటీ? మీ ఇంటి ఆడవారిని కూడా గుర్తు తెచ్చుకోండి’’ అని తెలిపారు. 


అమర్ ఎప్పుడూ శివాజీని పొగడాలని అనుకుంటాడు? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అమర్ ఎప్పుడూ బిగ్ బాస్‌లో ఉన్న పరిస్థితిని లైఫ్‌లో ఎదుర్కొలేదు. ఫ్రెండ్ అని బ్యాక్ స్టాబ్ చేసినవారి గురించి కూడా నేను చెబితే కానీ అర్థం కాదు అతడికి. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్‌లా చూస్తాడు. లోపల మంచి కోరేవారు ఎవరు.. చెడు కోరేవారు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నాడు. నన్ను కూడా మంచివాడిలా చూడొచ్చు కదా అనేది శివాజీ నుంచి కోరుతున్నాడు. అమర్.. పల్లవి ప్రశాంత్‌ను చిన్న చూపు చూడటం లేదు. వాస్తవానికి అమర్ రైతుల గురించి మాట్లాడలేదు. రైతులను అమర్ కూడా చిన్న చూపు చూడలేదు. నువ్వు రైతు బిడ్డ అనే ట్యాగ్‌తో ఉన్నావు అనేసరికి.. అదే విషయాన్ని అమర్ దీప్ ప్రస్తావించాడు. అది రాంగ్‌గా వెళ్లింది. ప్రశాంత్‌తో ఇప్పుడు అమర్ బాగానే ఉన్నాడు. నేను చూసిన ప్రకారం.. ఎప్పుడూ ప్రశాంత్‌కే సపోర్ట్ చేస్తారు. మాకు కూడా సపోర్ట్ చేస్తే మేం కూడా గెలుస్తాం ఏమో అనే తపనతోనే అలా అడిగేవాడు. ఆ ప్రాసెస్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్‌లను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. నా పని ఏమిటి అనేదానిపై ఫోకస్ పెట్టాడు’’ అని తెలిపింది. 


Also Read: శోభా వెంటపడటం బాగాలేదు - తేజాకు శివాజీ క్లాస్, నొప్పితో నవ్వుతున్నాని వెల్లడి, కెప్టెన్సీ టాస్క్‌ విజేత అతడే!