‘బిగ్ బాస్’ సీజన్-7లో శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ నడిచింది. ఇందులో భాగంగా ఎక్కువ టాస్కులు గెలిచిన జిలేబీపురం టీమ్‌‌కు కెప్టెన్సీ కోసం పోటీపడే అవకాశం వచ్చింది. అయితే, గులాబీపురంలో సభ్యులను ఎంపిక చేసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా బిగ్ బాస్.. జిలేబీపురం సభ్యుల ఫొటోలను ఇచ్చి కెప్టెన్‌గా అర్హత లేనివారి పిక్స్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలని బిగ్ బాస్ తెలిపాడు. అయితే, శివాజీ జిలేబీపురంలో ఒకరిని స్వాప్ చేసుకోవాలని బిగ్ బాస్ అన్నాడు. అంతా పల్లవి ప్రశాంత్ స్థానంలో శివాజీ వస్తాడని భావించేలోపు భోలే ట్విస్ట్ ఇచ్చాడు. తన స్థానానికి శివాజీ ఇచ్చాడు. 


‘కెప్టెన్’ అర్హతపై లొల్లి


ముందుగా శోభాశెట్టి.. అశ్వినీకి కెప్టెన్‌గా అర్హత లేదని ఆమె ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో పడేసింది. ఆ తర్వాత పూజా మూర్తి.. పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. ఈ సందర్బంగా ప్రశాంత్.. పూజాతో వాదించాడు. ‘‘నీకు వచ్చింది అవసరం లేదని నన్ను తీసేస్తున్నావు. నాకు నీ రీజన్ నచ్చలేదు. ప్రాణం పోయేవరకు ఆడుతూనే ఉంటా’’ అని అన్నాడు ప్రశాంత్. ఆ తర్వాత అమర్ దీప్.. శివాజీ ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో వేశాడు. ఈ సందర్భంగా శివాజీ వాదనకు దిగాడు. ‘‘త్యాగం చేసిన వ్యక్తి (భోలే) ప్లేసులో వచ్చాను. ఆయన త్యాగానికి విలువ ఏముంది?’’ అని శివాజీ అన్నాడు. ‘‘ఆయన మీతో ఎక్స్‌ఛేంజ్ చేసుకోడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోయాడు’’ అని అన్నాడు. దీంతో శివాజీ తన నోటికి పని చెప్పారు. ‘‘నేను వేస్ట్ క్యాండిటేట్‌లా కనిపిస్తున్నా. నువ్వు ఫెయిర్ గేమ్ ఆడలేదు’’ అని శివాజీ అన్నాడు. ‘‘మీరు చెప్పిన తర్వాత నుంచి నేను ఫెయిర్ గేమ్ ఆడుతున్నా’’ అని అమర్ దీప్ అన్నాడు. ‘‘నువ్వు ఫెయిర్ గేమ్ ఆడానని చెప్పకు. నవ్వుతారు’’ అని అమర్‌దీప్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ‘‘నేను ఈ హౌస్‌లో పనికి రాను’’ అంటూ మైకును తీసి పక్కన పెట్టేశాడు. ‘‘నాకు చెయ్యి బాగోకపోయినా వారితో, వీరితో గొడవపడి పరిగెట్టాను. అది కాదా ఫిజికల్. మీరు ఆడే ఆటలే ఫిజికలా? ఆదిలోనే నన్ను తొక్కేస్తున్నారు. నేను పల్లవి ప్రశాంత్, యావర్‌లను కెప్టెన్ చేశా. అంటూ అలిగాడు శివాజీ. ఆ తర్వాత అమర్‌దీప్.. శివాజీ, యావర్, ప్రశాంత్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీకు మీవాళ్లు ఎంత ఇంపార్టెంట్‌ అనిపించారో. నాకు నా వాళ్లు అంత ఇంపార్టెంట్’’ అనిపిస్తుంది కదా అని అమర్‌దీప్ అన్నాడు. చివరికి కెప్టెన్సీ పోటీదాలుగా సందీప్, అర్జున్ ఎంపికయ్యారు. 


శోభాశెట్టితో తిరగడం బాగోలేదు: తేజాకు శివాజీ క్లాస్


శోభాశెట్టికి, తేజాకు మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన కంటెస్టెంట్ల విషయంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా శోభా.. తేజాపై అరిచింది. ఆ తర్వాత తేజా బయటకు వెళ్లి బాల్కానీలో శివాజీతో కూర్చున్నాడు. దీంతో శివాజీ తేజాకు హితబోధ చేశాడు. ‘‘నువ్వు శోభాశెట్టి వెంటపడి తిరగడం బాగోలేదు. ఆమె కంటెంట్ కోసం రెచ్చిపోతుంది’’ అని తెలిపాడు. కాస్త ఆమెకు దూరంగా ఉంటూ ఇతరులతో కూడా కలిసి ఉండు. అప్పుడు కంటెంట్ దొరకదన్నట్లుగా తేజాకు చెప్పాడు. అయితే, తేజా అవేవీ బుర్రకు ఎక్కించుకోలేదు. కొద్ది సేపు ఆమెతో చిర్రుబుర్రులాడుతూ.. చివరికి శోభా వెంటే తిరిగాడు. 


నొప్పిని భరించి నవ్వుతున్నా: శివాజీ


చెయ్యి నొప్పితో బాధపడుతున్న శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘చెయ్యి నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నా. నేను ఎవరికీ భయపడను. ఉంటే ఉంటా.. పోతే పోతా. పిల్లలతో మాటలు పడటం ఇబ్బందిగా ఉంది. అన్నీ ఉన్నాయి కానీ, ఆటకు న్యాయం చేయలేకపోతున్నా. నేను చాలా ఆశలతో వచ్చా ఇక్కడికి. టైమ్ పడుతుంది. నా బాడీ కోఆపరేట్ చేయడం లేదు. నాకు గొంతు ఉంది. దానితో కూడా భయపెట్టగలను. కానీ, అది న్యాయం కాదు. నాకు మీరు ఇచ్చిన సంచాలక్‌కు కూడా నూరు శాతం న్యాయం చేశా. వాళ్ల అందరి ముందు ఏడ్వలేకపోతున్నా. బరువుగా ఉంది లోపల. నేను లక్ష మందికి సమాధానం ఇస్తా. నేను ఉంటే కప్పు కొడతా అని తెలుసు. చాలా బాగా స్టార్ట్ చేశా. నొప్పిని భరించి నవ్వుతున్నా’’ అని  దనువ్వు ఆడలేదు అని పరోక్షంగా అన్నారు. డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం అని బిగ్ బాస్ తెలిపాడు. 


కెప్టెన్‌గా అర్జున్


‘బిగ్ బాస్’ లైవ్ ప్రకారం.. అర్జున్ అంబాటీ కెప్టెన్‌గా నిలిచాడు. టాస్క్‌లో భాగంగా సందీప్, అర్జున్ కళ్లకు గంతలు కట్టి.. CAPTAIN స్పెల్లింగ్‌కు అక్షరాలను కరెక్టుగా అమర్చాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఇద్దరూ పోటాపోటీగా ఈ టాస్క్‌లో పోటీపడ్డారు. చివరికి అర్జు్న్ పైచేయి సాధించి ఇంటికి కెప్టెన్ అయ్యాడు.