Bigg Boss Season 7 Promo : బిగ్ బాస్ సీజన్ 7లో ప్రజెంట్ ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. ఇప్పటికే ఓ ఎపిసోడ్ పూర్తయింది. ఈ ఎపిసోడ్ లో శివాజీ కొడుకు, అర్జున్ భార్య, అశ్విని తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఎంతగానో ఎమోషనల్ చేశారు. ముఖ్యంగా అర్జున్ వైఫ్ నిండు గర్బిణీ కావడంతో ఆమెకు హౌస్ మేట్స్ ఇంట్లోనే సీమంతం చేశారు. ఇది ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత అశ్విని మదర్ రావడంతో తల్లీకూతుర్లు ఎంతో ఎమోషనల్ అయిపోయారు. అలా ఫ్యామిలీ వీక్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్ గా సాగింది. ఇక ఇదే ఎమోషన్ ని రెండో రోజు కూడా కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెండో రోజు ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదలవగా, ఈ ప్రోమోలో గౌతమ్ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లోకి వచ్చిన గౌతమ్ అమ్మ హౌస్ మేట్స్ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ‘‘మా అబ్బాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ఫాలో అవుతున్నారు’’ అంటూ తెగ మురిసిపోతూ కొడుకు గురించి హౌస్ మేట్స్ కి చెప్పింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ అన్నం ముద్దలు కలిపి తినిపించింది. అలా ఫస్ట్ ప్రోమో ఎమోషనల్ గా సాగగా తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ప్రియాంక కాబోయే భర్త శివ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శివ్ రావడంతో ప్రియాంక ఎంతో ఎమోషనల్ అయింది.
తాజాగా విడుదలైన ప్రోమోని గమనిస్తే.. బిగ్ బాస్ ఓ లవ్ సాంగ్ ప్లే చేయడంతో హౌస్ మేట్స్ అందరు యాక్టివిటీ ఏరియాకి వస్తారు. ప్రియాంక కాబోయే భర్త శివ్ హౌస్ లోకి వెనక్కి తిరిగి వస్తాడు. అయినా కూడా ప్రియాంక తన శివ్ ని గుర్తు పడుతుంది. శివ్ వచ్చి రావడంతోనే ప్రియాంకని గట్టిగా చేసుకొని మోకాళ్లపై నిలబడి ప్రియాంకకు ఫ్లవర్ ఇచ్చి చేతిని ముద్దాడుతాడు. దాంతో ప్రియాంక ఎమోషనల్ అవుతూ శివ్ ని హగ్ చేసుకుంటున్న ఆ సమయంలో ‘‘ఎవరు చూడకుండా ఏమైనా అడ్డుపెట్టనా?’’ అంటూ అర్జున్ సరదాగా అంటాడు. ఆ తర్వాత ప్రియాంక ఏడుస్తూ.. "ఎలా ఉన్నావు. నిన్ను చాలా మిస్ అయ్యాను" అంటూ చెబుతుంది.
దానికి శివ్.. "నేను ఇలా ఉన్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను" అని చెబుతూ నుదుటిపై ముద్దాడతాడు. అనంతరం పెళ్లెప్పుడు అని ప్రియాంక అడిగితే, "నువ్వు బయటకు రాగానే చేసుకుందాం సరేనా?" అని అంటాడు. దానికి ప్రియాంక, "లేదు ఇప్పుడే చేసుకుందాం" అని చెబుతుంది. అలా ఇద్దరు సరదాగా గడిపిన తర్వాత శోభ వాళ్ల దగ్గరికి వస్తూ.. "టైం దగ్గర వచ్చింది" అని అంటుంది. దాంతో ప్రియాంక.. "ఐదు నిమిషాలు అయినట్లే ఉంది వాళ్ళు చెప్పినట్టు" అని అంటుంది. దాంతో శోభ, "ఉండమని చెప్పొచ్చు కదా ఈ రోజు నైట్. బిగ్ బాస్ ఈరోజు ఉండొచ్చా బిగ్ బాస్" అని బిగ్ బాస్ ని అడుగుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్.. "శివ బిగ్ బాస్.. ఇంటిని మీరు వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్ళండి?" అని ఆదేశిస్తారు. దాంతో శివ్ వెళ్తూ వెళ్తూ ప్రియాంకని హగ్ చేసుకుని తనివితీరా ముద్దులు పెట్టడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.
Also Read : హౌజ్మేట్స్కి ముద్దలు తినిపించిన గౌతమ్ మదర్.. మా అబ్బాయికి ఫాలోయింగ్ పెరిగిదంటూ మురిసిపోయిన తల్లి