Bigg Boss Telugu Season 7 Latest Promo : బిగ్ బాస్ సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ చివరి అంకానికి చేరుకుంది. దాదాపు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, బోలే, శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక, యావర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హౌస్ లోకి వచ్చి ఆడియన్స్ ని ఎమోషనల్ చేశారు. ఇక నవంబర్ 10న ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్, రతికా ఫ్యామిలీ మెంబర్స్ హాజరు కావలసి ఉండగా ఇప్పటికే విడుదలైన ప్రోమోలో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తండ్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరోసారి కంటెస్టెంట్స్ అందరినీ ఎమోషనల్ చేశాడు.


అది చూసిన ఆడియన్స్ సైతం కంటతడి పెట్టారు. తన తండ్రి హౌస్ లోకి రావడంతో దుఃఖాన్ని ఆపుకోలేక తండ్రి కాళ్ళలో పడ్డాడు ప్రశాంత్. ఆ తర్వాత తండ్రిని ఎత్తుకొని సంతోషంగా తిప్పాడు. కొడుకును కౌగిలించుకొని "నిన్ను చూడక ఎన్ని దినాలు అయింది బిడ్డ", " నేను చచ్చినా, బతికినా వీనితోనే" అంటూ ప్రశాంత్ తండ్రి హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపించాడు.


తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో కూడా అందరూ ఊహించినట్లుగానే ఎమోషనల్ గా సాగింది. ఒకసారి ప్రోమోని గమనిస్తే.. రతికా రోజ్ (Rathika Rose) తండ్రి హౌస్ లోకి వచ్చారు. తండ్రిని చూసి అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నని కౌగిలించుకుని ఏడ్చేసింది రతికా. దాంతో రతిక తండ్రి కూతురుని ఓదార్చాడు. రతిక తండ్రికి బోలె స్వయంగా అన్నం తినిపించాడు. ఆ తర్వాత రతికా తండ్రి తన కూతురికి ప్రేమగా అన్నం తినిపించడం చూసి కంటెస్టెంట్స్ అంతా ఆనందించారు. అనంతరం బిగ్ బాస్ రతిక కోసం ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ ని అమర్ దీప్ రతికాకి ఇచ్చాడు. దాంతో రతికా ఆ గిఫ్ట్ ని తెరిచి చూడగానే అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ కావడంతో ఆ గిఫ్ట్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత హౌస్ మేట్స్ తో ముచ్చటిస్తూ "నువ్వు డాక్టర్ కదా. ఎట్లుండాలి డాక్టర్ అంటే, పేషెంట్స్ చూడగానే గుర్తుపట్టాలి" అంటూ గౌతమ్ తో సరదాగా చెప్పాడు.


ఆ సమయంలో ప్రశాంత్ రాగానే ప్రశాంత్ దగ్గరికి వెళ్లి.. "హాయ్ ప్రశాంత్ బాగున్నావా? మంచిగ ఆడుతున్నావ్" అని చెబుతాడు. "గేమ్ అన్నప్పుడు కొట్లాడాలి కప్పు తెచ్చుకోవాలి. అలా ఆడితేనే చివరికి ఎవరికో ఒకరికి కప్పు కచ్చితంగా వస్తుంది" అంటూ హౌస్ మేట్స్ అందరితో చెబుతాడు రతికా తండ్రి. దాంతో  రతికా తన తండ్రిని ప్రేమతో ముద్దాడుతుంది. ఆ సమయంలో బిగ్ బాస్ ఇంటిని మీరు వదిలి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇక చివరికి వెళుతూ వెళుతూ రతికా తండ్రి హౌస్ మేట్స్ తో.." బయటికి వచ్చాక మీ అందరికీ దావత్ ఇస్తా" అని చెబుతూ అందరితో సరదాగా డాన్స్ చేస్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే రాత్రి వరకు వేసి చూడాల్సిందే. లేకపోతే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉంటే లైవ్ స్ట్రీమింగ్ లో వీక్షించవచ్చు.


Also Read : కమల్ హాసన్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన మహేష్ బాబు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial