Bigg Boss Telugu 7 : ‘బిగ్ బాస్’ సీజన్-5 ఈ వారం చాలా చప్పగా సాగిందని ప్రేక్షకులు అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్ మొత్తం ఎమోషనల్ మూమెంట్స్‌తో నిండిపోయింది. అయితే, ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ మాత్రం మిస్ కావద్దు. తన మైండ్ గేమ్‌తో ఇతర హౌస్‌మేట్స్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న శివాజీ (Shivaji)కి, ఆయన్నే టార్గెట్ చేసుకున్న డాక్టర్ బాబు గౌతమ్‌ (Gautham Krishna) కు మధ్య పెద్ద వారే జరిగింది. ఎంతవరకు అంటే.. ‘బిగ్ బాస్’ డోర్ దగ్గరకు వెళ్లి మరీ గౌతమ్ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ అరిచేంత వరకు. 


‘బిగ్ బాస్’ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో గౌతమ్, శివాజీలు తమ విశ్వరూపం చూపించారు. గత కొన్ని రోజులుగా హౌస్‌మేట్స్ రాకతో డల్‌గా ఉన్న హౌస్.. ఒక్కసారే వారి అరుపులతో నిండిపోయింది. ‘బిగ్ బాస్’ పెట్టిన కెప్టెన్సీ టాస్క్.. వారి మధ్య మరోసారి చిచ్చుపెట్టింది. హౌస్‌మేట్స్ అందరికీ బిగ్ బాస్.. ‘హో బేబీ’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా మిగతా హౌస్‌మేట్స్ ఫొటో ఉన్న బేబీని పట్టుకుని బేబీ జోన్‌లోకి వెళ్లాలి. ఎవరైతే చివర్లో వెళ్తారో వారు.. కెప్టెన్సీ రేసు నుంచి ఔట్ అయినట్లని బిగ్ బాస్ చెప్పాడు. 


ఈ సందర్భంగా గౌతమ్.. రతిక బొమ్మను పట్టుకున్నాడు. మరోవైపు అమర్.. యావర్ బొమ్మను పట్టుకుని చివర్లో నిలబడిపోయాడు. దీంతో యావర్ కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత అమర్.. ప్రియాంక బొమ్మను పట్టుకున్నాడు. అప్పుడు కూడా వెనుకే నిలబడిపోయాడు. రతిక కూడా బేబీ కేర్‌లోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. ఈ టాస్క్‌కు సంచాలకురాలిగా ఉన్న శోభా అమర్‌ను ఉద్దేశిస్తూ.. నువ్వు రెండుసార్లు బయటే ఉండిపోయావు కన్సిడర్ చేయను అని చెప్పింది. కానీ, అలా ఉండిపోవడమే కదా గేమ్ అని అమర్ వాదించాడు. 


గౌతమ్‌తో శివాజీ వాదన


ఆ తర్వాత గౌతమ్, శివాజీ మధ్య ఏమైందో.. ‘‘ఊరికే గొడవ పెట్టుకుంటే ఎవరూ యాక్సెప్ట్ చేయరు’’ అని శివాజీ అన్నాడు. దీంతో గౌతమ్.. ‘‘నాకు అన్యాయం జరిగితే నేను అరుస్తా. ఇక్కడ ఉన్నంత వరకు ఇలాగే ఉంటా’’ అని అన్నాడు. దీంతో ‘‘ఏంది రా నువ్వు ఉండేది’’ అని శివాజీ కూడా గట్టిగా అరిచాడు. ‘‘మీకోసం మీరు మాట్లాడుకోండి. మీరే సెకండ్ బిగ్ బాస్ అని అనుకుంటా’’ అని గౌతమ్ అన్నాడు. ‘‘లాస్ట్ అలాగే అన్నావ్. నాగ్ సార్ దగ్గర ఏమైందో చూశావుగా’’ అని శివాజీ అన్నాడు. దీంతో గౌతమ్ ‘‘తిట్టన్నీ అన్నా.. నరికేయని..’’ అన్నాడు. ‘‘ఇది నా ఆటిడ్యూడ్’’ అని మరోసారి శివాజీ ముందుకెళ్లి అరిచాడు. 


దీంతో శివాజీ కూడా గౌతమ్ పైకి వచ్చి అరిచాడు. చివర్లో తన కామన్ డైలాగ్‌ను ప్రయోగించాడు శివాజీ. ‘‘నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు’’ అనగానే..  గౌతమ్ తన మైక్‌ను విసిరేసి బిగ్ బాస్ గేట్ దగ్గరకు వెళ్లాడు. వెంటనే తలుపు తెరవాలని, హౌస్ నుంచి వెళ్లిపోతానని అన్నాడు. గత వారం కూడా గౌతమ్.. శివాజీపై ఆగ్రహంతో హౌస్ నుంచి వెళ్లిపోతానని అన్నాడు. దీంతో నాగార్జున క్లారిటీ ఇవ్వడమే కాకుండా గౌతమ్‌కు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. ఈ వారం మాత్రం నేరుగా డోర్ తెరిచి బయటకు వెళ్లిపోమనడం ఖాయమని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. 


ప్రోమోను ఇక్కడ చూడండి:



Also Read: తండ్రిని ఎత్తుకొని తిప్పిన ప్రశాంత్ - శివాజీకి దండం పెట్టిన ప్రశాంత్ తండ్రి, గుండెలు బరువెక్కడం ఖాయం