Bigg Boss Telugu 6 finale live: ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలే లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్’ సీజన్-6 విన్నర్ రేవంత్, రూ.40 లక్షలతో శ్రీహాన్ రన్నర్!
ఈ రోజే ‘బిగ్ బాస్’ సీజన్ -6 ఫినాలే. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో సీనియర్ నటి రాధా, మాస్ మహారాజ్ రవితేజ, హీరో నిఖిల్ సందడి చేశారు.
హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ.40 లక్షలు తీసుకుని రన్నర్‌గా నిలిచాడు శ్రీహాన్. దీంతో ‘బిగ్ బాస్’ సీజన్-6 విన్నర్‌గా రేవంత్ ట్రోపీ అందుకున్నాడు.
నాగార్జున మరో బంపర్ ఆఫర్, రూ.40 లక్షలతో బయటకొచ్చేసిన శ్రీహాన్. దీంతో చివరికి రేవంత్ విజేతగా నిలిచి ట్రోపిని అందుకున్నాడు.
రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ప్రైజ్ మనీలో 20 శాతం మీకేనని టెంప్ట్ చేశారు. కానీ, ఎవరూ దాన్ని తీసుకోడానికి సిద్ధం కాలేదు. ఆ తర్వాత 30 శాతానికి పెంచారు. కానీ, దాన్ని కూడా వద్దన్నారు. చివరికి రవితేజ్ రెడ్ సూట్ కేస్ ఇచ్చి కీర్తిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు. ప్రస్తుతం శ్రీహాన్, రేవంత్ టాప్-2లో ఉన్నారు.
‘బిగ్ బాస్’ హౌస్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎవరు సూట్‌కేసుతో వెళ్తారనేది సస్పెన్స్.
‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లారు.
బిగ్ బాస్ ఇంట్లో ‘ధమాకా’ టీమ్ నుంచి మాస్ మహరాజ్ రవితేజ, శ్రీలీలా గెస్టులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున.. శ్రీహాన్‌ను చూపిస్తూ అతడు ఫ్లర్టింగ్‌లో కింగ్ అని చెప్పారు. దీంతో రవితేజ ‘‘డూ ఏజ్ మచ్ ఏజ్ పాజిబుల్’’ అని అన్నారు. దీంతో నాగ్.. ‘‘ఆ స్కూల్‌లో రవితేజ మాస్టర్’’ అని పంచ్ వేశారు. దీంతో రవితేజ ‘‘మీరు తక్కువ బాగా.. మీకు ఏమీ తెలియదు పాపం’’ అని అంటూ నవ్వించారు. ఆ తర్వాత రవితేజను సూట్ కేసు పట్టుకుని.. కంటెస్టెంట్లకు ఆఫర్ ఇవ్వాలని హోస్ట్ అక్కినేని నాగార్జున సూచించారు. దీంతో రవితేజ హౌస్‌లోకి సిల్వర్ సూట్‌కేస్‌తో ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి వెళ్లిన రవితేజ ‘‘మేటర్ ఏమిటంటే మీకు ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను. అది తీసేసుకుంటే వెళ్లిపోవచ్చు’’ అని రవితేజ అన్నారు.
‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలేలోకి హీరో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. రెండ్ క్యాప్‌తో హౌస్‌లోకి వెళ్లాడు. మరి, టాప్-5లో ఎవరిని బయటకు తీసుకోస్తారో చూడాలి.
‘బిగ్ బాస్’ జర్నీ చూసి హౌస్ మేట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. కష్టాలు, సరదాలు, గొడవలు, స్నేహం.. అన్నీ ఈ జర్నీలో చూపించారు.
‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫినాలే మొదలైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున స్టైలిష్ ఎంట్రీతో ఈ ఫినాలే షో మొదలైంది. ఇంతకుముందు ‘బిగ్ బాస్’ సీజన్-6 జ్ఞాపకాలను చూపించాడు. ‘బాస్ పార్టీ’కి నాగ్ స్టెప్పులు వేశారు.
‘బిగ్ బాస్’ ఫినాలేలో సీనియర్ నటి రాధా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆమె వేదికపై భలే యాక్టీవ్‌గా కనిపించారు. వేదిక మీదకు స్టెప్పులు వేసుకుంటూ వచ్చిన ఆమెను చూస్తూ.. ‘‘రావడం కూడా స్టెప్స్‌తోనే వస్తున్నారా’’ అని అన్నారు. రాధా స్పందిస్తూ.. ‘‘స్టెప్స్ లేకుండా నడవలేను. నాలుగో తరగతి నుంచే నేను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను’’ అని అన్నారు. ఆ తర్వాత బాలాదిత్య.. మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను అని రాధాతో అన్నాడు. దీంతో నాగ్.. ‘‘మొన్న తమన్నా వచ్చినప్పుడు కూడా’’ అదే అన్నాడని పంచ్ వేశారు. అనంతరం బాలాదిత్యతో కలిసి రాధా స్టెప్పులు వేశాడు.
‘బిగ్ బాస్’ ఫినాలే ఈ రోజే. సాయంత్రం 6 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో విజేత ఎవరనేది ప్రకటించనున్నారు.
Background
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-6 (Bigg Boss Telugu Season-6) ముగింపుకు వచ్చేసింది. దీంతో ఇప్పటికే ఫినాలే మొదలైపోయింది. హోస్ట్ అక్కినేని నాగార్జునతోపాటు సీనియర్ నటి రాధా, హీరోలు రవితేజ, నిఖిల్, శ్రీలీలాలు స్టేజ్‌పై సందడి చేశారు. అయితే, ఈ షోకు ఎవరు గెస్టుగా వస్తున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు. అయితే, ప్రోమోలో హీరో రవితేజ సూట్ కేస్ పట్టుకుని వెళ్లి ఐదుగురు కంటెస్టెంట్స్‌తో బేరసారాలు సాగించినట్లు చూపించారు. అలాగే నిఖిల్ ఓ టోపీతో బిగ్ బాస్ సీజన్-6 విజేతను నిర్ణయిస్తున్నట్లుగా చూపించారు. మరోవైపు సీనియర్ నటి రాధా కూడా ఈ షోలో సందడి చేశారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం హాజరయ్యారు. మరికొద్ది గంటల్లోనే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్-6’ విజేత ఎవరనేది తేలిపోనుంది. తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తుండండి.
‘బిగ్ బాస్’ సీజన్-6 ఈ ఏడాది సెప్టెంబరు 4న మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరికి టాప్-4లో కీర్తి భట్, రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరు విజేత అవుతారనేది ఉత్కంఠంగా ఉంది. ప్రస్తుతం ముగ్గురి మధ్యే అసలైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రేవంత్, శ్రీహాన్‌లలో ఒకరికి విజేత అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం సింగర్ రోహిత్ విజేతగా నిలిచే అవకాశాలున్నాయని, శ్రీహన్ రన్నరప్ అని తెలుస్తోంది. అసలు రిజల్ట్ ఏమిటనేది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.
‘బిగ్ బాస్’ సీజన్-6లో పాల్గొన్న కంటెస్టెంట్లు వీరే
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)
రేవంత్ విన్నర్?
బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలిచినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నరప్ గా మిగిలాడని, ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక విన్నర్ మెటీరియల్ అనుకున్న రోహిత్ అయిదో స్థానానికే పరిమితం అయ్యాడని, కీర్తి నాలుగోస్థానంలో ఉందని తెలుస్తోంది. రేవంత్ విన్నర్ అని మొదట్నుంచి వినిపిస్తూనే ఉంది. ఇంకా విన్నర్ ని ప్రకటించక ముందే నా కొడుకుని విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ రేవంత్ తల్లి ఇప్పటికే కామెంట్ చేసింది. ఇలాంటి కొడుకే తనకు పుట్టాలని ఎప్పటికీ దేవుడిని కోరుకుంటానని కూడా చెప్పింది. అంతేకాదు రేవంత్ ఇంటి దగ్గర సంబరాలకు కూడా అంతా రెడీ చేసేశారు. రేవంత్ కూడా ఎప్పట్నించో తానే విన్నర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందే విన్నర్ అయి తిరిగొస్తా అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడ. ఇప్పుడు అదే నిజమైనట్టు తెలుస్తోంది.
ఫినాలే వేదికపై నాగార్జున ఇద్దరి కంటెస్టెంట్‌ల చేతులు పట్టుకుని నిల్చుని చివరకు విజేత చేతిని పైకెత్తుతాడు. అలా వేదికపై నిల్చుంది రేవంత్, శ్రీహాన్ అని తెలుస్తోంది. వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నర్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయి ముందే బయటికి వచ్చేశారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -