'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలోని బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా హౌస్‌లోకి పంపించారు. షో మొదలైన రెండో రోజే నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ముందుగా ఛాలెంజర్స్ ని వారియర్స్ టీమ్ నుంచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో కారణాలతో చెప్పమని అడిగారు. ఆ తరువాత వారియర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, హమీద, అరియానా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ ఉన్నారు.
వీరిలో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఛాలెంజర్స్ టీమ్ నుంచి ఒకరు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని.. మిత్ర, చైతులలో మిత్రకి తక్కువ ఓట్లు పోల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. వీరితో పోలిస్తే.. నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్, హమీద, అరియనాలను ఓట్లు బాగానే పడతాయి.
ఆర్జే చైతుకి కూడా సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ వలన ఓట్లు బాగానే పడుతున్నాయట. కానీ మిత్ర శర్మకి మాత్రం ఓట్లు రావడం లేదట. ఈ విషయం ఆమె కూడా గ్రహించిందో ఏమో.. హౌస్ లో కాస్త డల్ గానే ఉంటుంది. నిజానికి వచ్చిన రోజు, నామినేషన్స్ రోజు చలాకీగా కనిపించింది. కానీ ఎప్పుడైతే ఆమెని నామినేట్ చేశారో అప్పటినుంచి కాస్త సైలెంట్ అయిపోయింది.
పదకొండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మిత్ర.. తెలుగులో 'తొలి సంధ్యవేళలో' అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ. అలానే శ్రీపిక్చర్స్ అనే బ్యానర్ మొదలుపెట్టి సినిమాలను నిర్మిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యానర్ లో 'బాయ్స్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది.