Bigg Boss 9 Telugu  Top 5 Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగు తుది దశకు చేరుకుంది. లాస్ట్​ వీక్​లో టాప్ 5 కంటెస్టెంట్లు ఉన్నారు. ముందుగా కళ్యాణ్ ఫైనలిస్ట్ అయి మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత తనూజ, మూడో స్థానంలో పవన్, నాలుగో స్థానంలో ఇమ్మాన్యుయేల్, ఐదవ స్థానంలో సంజన ఉన్నారు. మొదటి వారంలోనే వెళ్లిపోతుందని అనేలా ఉన్న సంజన చివరి వరకు ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. సాధారణంగా బిగ్​బాస్ చివరి వారం అంటే.. కంటెంస్టెంట్లకు సీజన్ ప్రోమోలు వేసి చూపిస్తారు. కానీ ఈ సారి అలా చేసేందుకు బిగ్​బాస్ మరో ప్లాన్ వేశాడు. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో

బిగ్​బాస్​ చివరి వారంలో ఏ సీజన్​లో అయినా కంటెస్టెంట్లు రిలాక్స్ అవుతారు. వారికి టాస్క్​లు ఉండవు. జస్ట్ రెడీ తమకి సంబంధించిన ఎమోషనల్ ప్రోమో చూస్తారు. అయితే ఈసారి సీజన్9లో చివరి వరకు వీళ్లతో గేమ్స్ ఆడించాలని బిగ్​బాస్ ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. టాస్క్​లు పెట్టి గెలిచిన వారికి ప్రోమో చూపిస్తాను, సందేశాన్ని ఇస్తాను అంటూ ఫిటింగ్ పెట్టాడు. ప్రోమో మొదలయ్యే సరి టాప్ 5 కంటెస్టెంట్లు కూర్చున్నారు. మీ ఐదుగురు బిగ్​బాస్ సీజన్ 9 యొక్క అల్టీమేట్ యోధులు. ద ఫైవ్ ఫైనలిస్ట్స్ అంటూ ఎలివేషన్ ఇచ్చేసరికి అందరూ థ్యాంక్స్ చెప్పారు. 

Continues below advertisement

చివరి వారంలోనూ టాస్క్​లే.. 

ఈ సీజన్​లో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛాలెంజ్​లను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ఒన్స్ మోర్ అంటూ చెప్పాడు.  ఒన్ లాస్ట్ టైమ్ అన్నాడు. ప్రతి రోజూ మీలో ఒకరికి.. ప్లేయర్ ఆఫ్ ది డే అయి.. మీ ఆత్మీయుల నుంచి సందేశాలను పొందే అవకాశం ఇస్తున్నానంటూ చెప్పాడు. ఇప్పుడు ఓ గేమ్ పెట్టాడు. డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఒకటీమ్.. తనూజ, కళ్యాణ్ మరో టీమ్. సంజన సంచాలకుడిగా చేసింది. అయితే ఇమ్మూ, పవన్ మంచి కో ఆర్డినేషన్​తో టాస్క్​ని పూర్తి చేసినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. మరోవైపు కళ్యాణ్, సంజన తమ టాస్క్ కంప్లీట్ చేయడంలో కాస్త కన్​ఫ్యూజ్ అయినట్లు చూపించారు.