Bigg Boss 9 Telugu Top 5 Journey Experience Promo : బిగ్‌బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్లు చిల్ అవ్వడంతో పాటు బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను ఆడుతూ ఎమోషనల్ జర్నీలు పంచుకుంటున్నారు. అసలు బిగ్‌బాస్‌కి వచ్చిన రీజన్ ఏంటనేది చెప్పమంటూ హోజ్ని ఫుల్‌గా ఎమోషనల్‌గా మార్చేశాడు. అలాగే వారు గతంలో ఆడిన టాస్క్‌లు ఒన్ లాస్ట్ టైమ్ అంటూ ఆడిస్తున్నాడు. దానికి సంబంధించిన ప్రోమో హైలెట్స్ చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో
ఇంటి సభ్యులు బిగ్‌బాస్ జర్నీ అంటే ఏంటి? మీ దృష్టిలో మీ హృదయం నుంచి వచ్చే భావాలను పంచుకోవాలంటూ చెప్పాడు. దానికోసం అందరూ సిద్ధమై.. ఓ చోట కూర్చొని మాట్లాడుకున్నారు. ముందుగా మాట్లాడిన ఇమ్మాన్యుయేల్.. వచ్చేప్పుడు అనుకున్నా.. ఏముందిలే సింపుల్‌గా కామెడీ చేసి నవ్వించేయవచ్చు అనుకున్నాను. కానీ నేను లోపలికి రాగానే మాస్క్ మ్యాన్ గారితో చిన్న ఇష్యూ అయింది. నేను చేసిన ఫన్ బాడీ షేమింగ్ అనేట్టు వెళ్లిపోయింది. ఆ టైమ్‌లో నిద్రపట్టేది కాదు. నేను ఇంకేమి చేయాలంటూ ఉండగా.. మా మమ్మీ పరిచయం అయింది. దానినుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ అయింది అంటూ చెప్పాడు.
సంజన రీజన్ ఇదే
నాతో ఎవరైనా ఉంటారా టూ వీక్స్. నన్ను భరించగలుగుతారా అనుకుని వచ్చాను. నేను నా మీదనే జోక్స్ వేసుకుని వచ్చాను. ఇది నాకు రీ లైఫ్ అంటూ చెప్పింది. బిగ్‌బాస్‌కి వచ్చే ముందు నేను కెరీర్లో సెట్ అవ్వలేదు. ఇంక అన్న మీద, నాన్న మీదనే డిపెండ్ అయి ఉన్నానని నా మీద నాకే కోపం వచ్చేది అంటూ ఏడ్చేశాడు పవన్. తర్వాత తనూజ తెలుగు ఆడియన్స్ కోసం వచ్చాను అన్నట్లు చెప్పింది. కళ్యాణ్ ఎన్ని కష్టాలున్నా.. ఇక్కడే ఉండాలనిపించేది బిగ్‌బాస్ అంటూ చెప్పి ఎమోషనల్ అయ్యాడు.
లాస్ట్ వీక్ కూడా గేమ్స్..
ఈ సీజన్లో హైలెట్ అయినా గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఒన్ లాస్ట్ టైమ్ అంటూ నాచోరే నాచోరే టాస్క్ పెట్టాడు. అందరూ వస్తోన్న సాంగ్స్‌కి డాన్స్ వేయాలి. సాంగ్ ఆగిన తర్వాత బిగ్‌బాస్ చెప్పిన రంగు నుంచి బయటకు రావాలని చెప్పాడు. ఫస్ట్ రౌండ్లో సంజన ఆగిపోగా.. సెకండ్ రౌండ్లో తనూజ ఆగిపోయింది. తర్వాత ముగ్గురూ గట్టిగా గేమ్ ఆడారు. దానికి సంబంధించిన ప్రోమోలో డిమోన్ హైలెట్ అయ్యాడు. చాలా ఫాస్ట్‌గా ఆ రంగుల్లో నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో ఆడియన్స్ పవన్‌కి హైప్ ఇస్తున్నారు.