Bigg Boss Telugu 9 Second Week Nominations : బిగ్​బాస్​ తెలుగు సీజన్​ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్​గా సాగుతుంది. నిన్నటి ప్రక్రియనే ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో(Bigg Boss Telugu 9 Day 9 Promo)ను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో మాస్క్ మ్యాన్ చుట్టూనే ఎక్కువ తిరిగింది. ఎందుకంటే అందరూ అతనికి రంగు పూసి మరి ట్రూ కలర్స్ బయటకి చూపించేందుకు సిద్ధమయ్యారు. మరి ప్రోమోలోని హైలెట్స్ ఏంటో.. ఎలా సాగిందో.. మాస్క్​ మ్యాన్ రిప్లై ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమో..

బిగ్​బాస్​లో లేటెస్ట్ ప్రోమో చాలా ఆసక్తిగా ఉంది. దాదాపు సెలబ్రెటీలు అందరూ మాస్క్​ మ్యాన్​ని టార్గెట్ చేశారు. దానిని కప్పి పుచ్చుకోవడానికి హరీశ్ కూడా గట్టిగానే ట్రై చేశారు. ఇంతకీ ప్రోమోలో ఏముందంటే.. రంగు పూసి నామినేష్ చేసేందుకు రాము వచ్చాడు. నేను వెళ్లిపోతాను రాము. మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వీళ్ల మధ్య నేనుండలేను అని చెప్పడం నాకు నచ్చలేదు. అలా అందరినీ జడ్జ్ చేసేశాడు. అంటూ హరీశ్​ని నామినేట్ చేశాడు. హైలెట్ ఏంటి అంటే.. హరీశ్ తినడం లేదని బిగ్​బాస్ పిలిచి మాట్లాడుతూ.. రాముని పిలిచి హరీశ్​ని చూసుకోమని చెప్పాడు. దీంతో రాము అతనిని నామినేట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

Continues below advertisement

రీతూ చౌదరీ VS మాస్క్ మ్యాన్

రీతూ చౌదరీ కూడా మాస్క్ మ్యాన్ హరీశ్​ని నామినేట్ చేసింది. షోనే వదిలేసి వెళ్లిపోతానంటే అది గివ్​ అప్ ఇచ్చే పర్సనాలిటీ అనిపించింది అని రీతూ చెప్తే.. అది గివ్​ అప్ కాదు.. నేను బయటకు వెళ్లా కాపాడాల్సిన ప్రాణాలు చాలా ఉన్నాయి అంటూ రిప్లై ఇచ్చాడు. చరిత్ర హీనుడు, చరిత్ర హీనుడు అంటూ ముద్రవేశారు కదా అంటూ.. మీకు నచ్చినట్టు నేను ఉండను అని సీరియస్​ అయ్యాడు. దాంతో రీతూ కూడా నాకు నచ్చినట్లు మిమ్మల్ని ఉండమని నేనూ చెప్పను అంటూ గట్టి రిప్లై ఇచ్చింది.

ఓనర్స్​ ఇంట్లో గొడవలు రావడానికి కారణం మీరేనంటూ రీతూని ఉద్దేశించి చెప్పడంతో రీతూ ఎమోషనల్ అయింది. మీకు మీరు గొడవలు పెట్టుకుని.. నా వల్లే వచ్చాయి అంటే నేను ఒప్పుకోను. నాకు ఎవరైనా తింటుంటే ఆకలేసి ఒక ముక్క పెట్టమని అడిగాను తప్పా.. నేను ఏరోజు నాకు ఎక్కువ ఫుడ్ కావాలి.. లేకపోతే నేను లోపల తిరిగి మీ ఫుడ్ తినాలి అనుకోలేదంటూ ఎమోషనల్ అయింది. మాస్క్ మ్యాన్ అప్పటికీ తగ్గకుండా ఓహ్ ఇలా ఏడ్చి సింపతీకార్డ్ ప్లే చేస్తున్నావా అని అడగడంతో.. ​ఓహ్ మీరు అన్నం తినకపోవడం సింపతీ కార్డ్ ప్లే చేయడమా అంటూ అడగడంతో ప్రోమో ఎండ్ అయింది. 

లాస్ట్ పంచ్ రీతూ భలే ఇచ్చింది అంటూ ప్రేక్షకులు వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కామనర్స్ చాలా వరస్ట్​గా ఉన్నారంటూ వాళ్లని బయటకు పంపేయాలంటున్నారు. ఈ ప్రోమోలో రాము.. కళ్యాణ్​ని నామినేట్ చేయడం, ప్రియా హరీశ్​ని నామినేట్ చేయడం కూడా ఉన్నాయి. ఈ రోజు పూర్తి ఎపిసోడ్​ ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా ఉండనుంది.