Bigg Boss Telugu 9 Second Week Nominations Promo : అస్సలు మాట్లాడట్లేదు... లోపలికి వెళ్లినప్పటి నుంచి సైలెంట్‌గా ఉంటున్నాడు అనుకున్న సుమన్ శెట్టితో కూడా బిగ్‌బాస్ అరిపించేశాడు. బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో భాగంగా గొడవలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మాస్క్ మ్యాన్ దాదాపు అందరితోనూ నామినేషన్స్ వేయించుకున్నాడు. అలాగే అందరితోనూ గొడవలకు దిగుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ వారం నామినేషన్స్‌లో సుమన్ శెట్టి కూడా హైలెట్ అయ్యేలానే ఉన్నాడు. తాజా ప్రోమోలో సీరియస్ గొడవల్లో కూడా నవ్వులు తెప్పించేశాడు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా ఉందంటే..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో రెండోరోజు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసి దానిలో రీతూ-మాస్క్ మ్యాన్ హరీశ్‌ని హైలెట్ చేయగా.. తాజా ప్రోమోలో సుమన్ శెట్టిని హైలెట్ చేశాడు బిగ్‌బాస్. ప్రోమోలో ముందుగా వచ్చిన కెప్టెన్ సంజన.. సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. నేను ఎవరిని తొక్కలేదు. ఎంత తొందరగా ఇది తెలుసుకుంటే అంత మంచిది అంటే.. ఆ రాయి అన్నాడు సుమన్ శెట్టి. ఇలా మాట్లాడకండి అంటుంటే.. తొందరగా రాయి.. ఎక్కువసేపు నిల్చొంటే కాళ్లు నొప్పు పుడుతున్నాయని చెప్పాడు. అరవకండి అని సంజనా చెప్తున్నా.. టైమ్ వేస్ట్ చేయకండి రాయండి అంటూ చెప్పగా కంటెస్టెంట్లు నవ్వారు.
తర్వాత సుమన్ శెట్టి నామినేట్ చేసేందుకు వచ్చాడు. దీనిలో భాగంగా ప్రియను సుమన్ శెట్టి ఎంచుకున్నాడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తే ఇస్తామని కండీషన్ పెట్టారు అని సుమన్ చెప్పగా.. మీరు ఏమి చేయకుండా మీకు ఫుడ్ ఇచ్చినందుకు మా వాళ్లు నన్ను తింటారని తెలిపింది ప్రియ. మీరు ఇవ్వాలనుకుంటే ఇంప్రెస్ చేయండి అని మమ్మల్ని అడగాలి. అంతేకానీ ఇంప్రెస్ చేయమంటూ నేను విప్పి రావాలా అమ్మా అని అడగ్గా.. రీతూ, తనూజ, ఇమ్మూ నవ్వేశారు. తర్వాత మనీష్‌ని నామినేట్ చేశాడు. నేను అడిగి డోర్ తీసుకుని వెళ్లిపోవట్లేదు కదా బ్రో అంటే.. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలియాలిగా అంటూ మనీష్ రిప్లై ఇచ్చాడు. మేము ఏమన్నా దొంగలం కాదుగా బాబాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు సుమన్ శెట్టి.
గుండు అంకుల్-రెడ్ ఫ్లవర్
భరణి ప్రియకు కూడా గట్టిగానే ఆర్గ్యూమెంట్ జరిగినట్లు తెలుస్తుంది. తన డాక్టర్ ప్రొఫెషన్ తీయొద్దంటూ ప్రియ రెచ్చిపోయింది. మీరు వండిన ఫుడ్ ఉడకలేదు సార్.. మీరు వండిన ఫుడ్‌లో ఇసక ఉంది సార్ అంటూ అరిచింది. ఇమ్మూ, మనీష్ మధ్య కూడా గొడవ బాగానే జరిగింది. ఇమ్మూని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ మనీష్‌ని నామినేట్ చేశాడు. అయితే అతనిని ఎవరో ఇన్ఫ్లూయెన్స్ చేశారంటూ మనీష్ చెప్పుకొచ్చాడు. ఇమ్మూ తర్వాత నామినేషన్ హరీశ్‌ని చేశాడు. గుండు అంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే.. రెడ్ ఫ్లవర్ అనడం ఏంటి అని అడగ్గా.. నేను నిన్ను అనలేదని చెప్పాడు హరీశ్. వీరిద్దరి మధ్య గొడవ కూడా తారాస్థాయికి చేరుకుంది. ఏదేమైనా ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నట్లు తెలుస్తుంది.