Bigg Boss 9 Telugu Today Suman Sheety vs Kalyan Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగు చివరిదశకు వచ్చేసింది. ఈ సమయంలో టికెట్​ టూ ఫినాలే టాస్క్​లు పెట్టాడు బిగ్​బాస్. ఇప్పటికే ఈ రేస్​ నుంచి తనూజ, సంజన, పవన్ అవుట్ అయ్యారు. మిగిలిన వాళ్లు టాస్క్​లు ఆడుతున్నారు. దీనిలో భాగంగా చివరి టాస్క్​లు పెట్టాడు బిగ్​బాస్. రీతూ, సుమన్ శెట్టి, కళ్యాణ్, భరణి, ఇమ్మాన్యుయేల్ గేమ్స్ ఆడుతున్నారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో హైలెట్స్.. 

బిగ్​బాస్​ లేటెస్ట్ ప్రోమోలో రెండు గేమ్స్​కి సంబంధించినవి ఇచ్చారు. మొదటి టాస్క్​ని భరణి, కళ్యాణ్, రీతూ ఆడగా.. రెండో టాస్క్​ కళ్యాణ్, సుమన్ శెట్టి ఆడారు. ముందు టాస్క్​లో ముగ్గురు పాల్గొనగా ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇచ్చాడు బిగ్​బాస్. రీతూ పసుపు రంగు, భరణి నీలం రంగు, కళ్యాణ్ రెడ్ కలర్ ఇచ్చారు. ముందు ఉన్న బోర్డుపై వీరంతా తమకు ఇచ్చిన రంగును అంటించాల్సి ఉంది. ఎవరి రంగు ఎక్కువగా ఉంటే.. వారు గెలుస్తారు. అయితే బోర్డు మీద అందరూ రంగు పూయడంతో ఎవరి రంగు ఎక్కువగా కనిపించింది చెప్పడం కష్టంగా మారింది. అంతేకాకుండా రీతూ, భరణి మధ్య కాస్త క్లాష్ జరిగింది. 

Continues below advertisement

రెండో టాస్క్​.. కళ్యాణ్ vs సుమన్ శెట్టి

తర్వాత టాస్క్​ కళ్యాణ్, సుమన్ శెట్టికి మధ్య జరిగింది. కళ్యాణ్ నెక్స్ట్ గేమ్ సుమన్​తో ఆడేందుకు ఓకే చెప్పాడు. అయితే వీరికి బిగ్​బాస్ ఇంట్రెస్టింగ్ గేమ్ పెట్టాడు. ఇద్దరికి సపరేట్ రూమ్స్ ఇచ్చి దానిలోని వస్తువులను పగలగొట్టి.. వాటిని బయట ఉన్న తూకంపై వేయాలని చెప్పాడు. అయితే వాటి బరువు ఎవరికి ఎక్కువగా ఉంటుందో.. వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ గేమ్​లో కళ్యాణ్, సుమన్ శెట్టి ఇద్దరూ మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. అయితే కళ్యాణ్ తన సైడ్ పూర్తిగా తూకంలో వేసిన తర్వాత.. అతి చిన్న గ్యాప్ ఉంది దానిని సుమన్ శెట్టి ఫిక్స్ చేస్తున్నాడనగా.. కళ్యాణ్ ఆపేశాడు.

సుమన్ టాస్క్​ గెలిచేందుకు చాలా ట్రై చేశాడు కానీ.. కళ్యాణ్ ఆపడంతో ఈ గేమ్​ నుంచి ఆగిపోవాల్సి వచ్చింది. ఈసారి టాస్క్​ల్లో సుమన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. నిన్న తనూజతో కలిపి ఆడిన గేమ్​లో కూడా మంచిగా ఆడాడు. సుమన్​కి ఈ సారి నాగచైతన్య నుంచి మంచి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంది.