డే 87 ఎపిసోడ్ లో 86వ రోజు రాత్రి 11 దాటాక మరో టాస్క్ పెట్టారు. "ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి జరిగే పోటీలో భాగంగా ఇద్దరు పోటీదారులకు పెడుతున్న టాస్క్ బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్. ఇద్దరు పోటీదారులు బ్యారెల్ కింద నిలబడి, గ్రిప్ కోల్పోకుండా, బ్యారెల్ ఫ్లిప్ అవ్వకుండా చూసుకోవాలి. సంచాలక్ పిలిచిన వాళ్లు తాము ఫైనలిస్ట్ గా చూడకూడదు అనుకున్న వాళ్ళ బ్యారెల్ లో నీళ్ళు నింపాలి. బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరూ వచ్చి వాటర్ పోయాలి" అన్నది టాస్క్.
హౌస్ మొత్తం తనూజకే సపోర్ట్
భరణి, డెమోన్ వచ్చి సుమన్ కు, కళ్యాణ్, రీతూ, ఇమ్మూ వచ్చి తనుజకు సపోర్ట్ చేశారు. ఇందులో సుమన్ శెట్టి గెలవగా, ఓడిపోయినందుకు తనూజా కన్నీళ్లు పెట్టుకుంది. తనూజా అవుట్ ఆఫ్ రేస్ కావడంతో ఆమె గడులను సుమన్ సొంతం చేసుకున్నాడు. ఇక సుమన్ శెట్టి తనకు భరణి సపోర్ట్ చేయడం వల్లే గెలిచానని, ఒకవేళ తనను సంచాలక్ గా చేసి ఉంటే కష్టం అయ్యేదని భరణితో చెప్పి, నెక్స్ట్ నుంచి కలిసే ఆడాలని డీల్ కుదుర్చుకున్నారు. ఇక తరువాత సుమన్ శెట్టికి సపోర్ట్ చేసినందుకు తనూజకు వివరణ ఇచ్చాడు భరణి. కానీ తనూజా అదేం పెద్ద విషయం కాదని కొట్టిపారేసింది.
భరణికి తనూజ సపోర్ట్ - డెమోన్ అన్యాయం
87వ రోజు ఉదయాన్నే "ఇప్పుడు మీరు మూడవ టాస్క్ లో పాల్గొనే ముగ్గురు కంటెస్టెంట్స్ ను ఎంచుకునే సమయం వచ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ కు ఎంత దగ్గర అవుతారు? ఆడియన్స్ హృదయాలను ఎలా గెలుస్తారు అన్నది మీరు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు బిగ్ బాస్. ఇందులో చివరకు సుమన్, కళ్యాణ్, డెమోన్ అడతామని ముందుకొచ్చారు. ఈ పోరులో భాగంగా "పవర్ బాక్స్" అనే ఛాలెంజ్ ను ముగ్గురికీ ఇచ్చారు. ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా నడిచింది. డెమోన్ తన దగ్గరకు రావడంతో "బలం ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళి తీసుకో. ఎందుకు భయపడుతున్నావ్ ? మాటలు జాగ్రత్తగా రాని" అంటూ ఫైర్ అయ్యాడు సుమన్. ఇందులో డెమోన్ గెలిచాడు. "నిన్న ఆడి గెలవలేకపోయాను. ఈసారి ఆడి గెలుద్దాం అనుకుంటున్న" అంటూ భరణితో నెక్స్ట్ గేమ్ కు సిద్ధం అయ్యాడు భరణి. "సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకన్నా మిగతావాళ్ళు షాక్ కావాలి. అలా ఉండాలి అవుట్ పుట్" అని తనూజా భరణితో చెప్పింది. మరోవైపు సుమన్ ప్లేస్ లో భరణి ఉంటే ఆటను చెడగొట్టేవాడు అంటూ ఇమ్మాన్యుయేల్ కామెంట్ చేశాడు.
ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరు పోటీ దారులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ "వారధి కట్టు విజయం పట్టు". ఇందులో చివరకు భరణి శంకర్ విన్ అయ్యాడు. దీనికి తనూజా సంచాలక్ గా వ్యవహరించింది. నిజానికి టాస్క్ లో పవన్ దగ్గరున్న ప్లాంక్ తో సమస్య ఉండడంతో అతను ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో పవన్ దగ్గరున్న అన్ని గడులను స్వాధీనం చేసుకున్నాడు భరణి. ఇక పవన్ రేసు నుంచి తప్పుకున్నాడు. "నన్ను టార్గెట్ చేసినవాళ్లనే నేను టార్గెట్ చేయాలి అనుకున్నా" అంటూ తనను తనని తాను సమర్థించుకుంది తనుజా.