Bigg Boss 9 Telugu Today Thanuja vs Suman Sheety Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగు చివరి దశకు వచ్చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్​లో మొదటిగా వెళ్లేది ఎవరు? టికెట్ టూ ఫినాలే దక్కించుకునేది ఎవరు అనే దానికోసం బిగ్​బాస్ టాస్క్​లు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ రేస్​ నుంచి సంజన తప్పుకోవాల్సి వచ్చింది. ఇమ్మూతో కలిసి గేమ్ ఆడి ఓడిపోయింది. దాంతో ఆమె అవుట్ ఆఫ్​ ది రేస్ అయింది. మరి నెక్స్ట్ ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారు? లేటెస్ట్ ప్రోమో హైలెట్స్ ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్ లేటెస్ట్ ప్రోమో.. 

బిగ్​బాస్ సీజన్ 9 తెలుగులో డే 87 ప్రోమో స్టార్ మా విడుదల చేసింది. టికెట్ టూ ఫినాలే రేస్​లో ఆడేందుకు తనూజ, సుమన్ శెట్టి సిద్ధమయ్యారు. వీరికి బిగ్​బాస్​.. బ్యారెల్, బ్యాలెన్స్, బ్యాటిల్ అంటూ టాస్క్ పెట్టాడు. బ్యారెల్ కింద నిలబడి.. రోప్స్​ని రెండు చేతులతో పట్టుకుని.. గ్రిప్ వదలకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్​బాస్. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ పెట్టాడు. 

భరణి సపోర్ట్ ఎవరికి?

సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా.. సంచాలక్​ ఒక్కొక్కరిని పిలవాల్సి ఉంటుంది. అయితే ఎవరినైతే టికెట్​ టూ ఫినాలే రేస్​లో చూడకూడదనుకుంటున్నారో.. వారు బ్యాలెన్స్ చేస్తోన్న టబ్​లో నీరు నింపాలని చెప్పాడు బిగ్​బాస్. బజర్ మోగిన తర్వాత ముందుగా సంజన భరణిని పిలిచింది. అయితే ఈసారి భరణి తనూజకు కాకుండా.. సుమన్ శెట్టికి సపోర్ట్ ఇచ్చాడు. సుమన్​కి భరణి తప్పా ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. ముందుగా వచ్చిన భరణి.. తనూజ టబ్​లో నీరు పోశాడు. 

Continues below advertisement

రేస్లో గెలిచిందెవరు?

తర్వాత వచ్చిన కళ్యాణ్ సుమన్ శెట్టి టబ్​లో నీరు వదిలాడు. ఇమ్మూన్యుయేల్, రీతూ, పవన్ కూడా సుమన్ శెట్టి టబ్​లోనే నీరు పోశారు. అయితే దానిని బ్యాలెన్స్ చేసేందుకు సుమన్, తనూజ ఇద్దరూ బాగా కష్టపడ్డారు. అయితే చివరికి తనూజనే ఓడిపోయింది. టికెట్​ టూ ఫినాలే రేస్​ నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. భరణి కూడా తనూజకు సపోర్ట్ చేయలేదు. కానీ తను ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ చెప్పాడు. ఇప్పటివరకు సంజన, తనూజ ఈ టికెట్​ టూ ఫినాలే రేస్​ నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది. పూర్తి ఎపిసోడ్​లో ఎన్ని ట్విస్ట్​లు ఉన్నాయో వేచి చూడాల్సిందే.