Bigg Boss 9 Telugu Today Emmanuel vs Kalyan vs Rithu Promo : బిగ్​బాస్​ సీజన్ 9 తెలుగులో టికెట్​ టూ ఫినాలే కోసం టాస్క్ జరుగుతుంది. ఇప్పటికే తనూజ, సంజన, భరణి, పవన్, సుమన్ శెట్టి ఈ రేస్​ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ చివరి టాస్క్ ఆడాల్సి ఉంది. బిగ్​బాస్ ఇప్పటికీ ఇదే చివరి టాస్క్ అంటూ చెప్పడంతో.. ఫైనలిస్ట్ ఎవరు అవుతారు? టాప్ 5లోకి ఎవరు వెళ్తారనేది తెలియాల్సి ఉంది. అయితే చివరి టాస్క్​కి సంబంధించిన బిగ్​బాస్ ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది.  

Continues below advertisement

బిగ్​బాస్ ప్రోమో హైలెట్స్.. 

మీరంతా ఇప్పటివరకు దేనికోసం పోరాడుతున్నారో.. దానిని రివిల్ చేసే టైమ్ వచ్చిందంటూ బిగ్​బాస్ సెకండ్ ప్రోమో స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మొదటి ఫైనలిస్ట్ కోసం ఎదురు చూస్తోన్న షీల్డ్​ని చూపించారు. బటర్​ఫ్లై రూపంలో ఉన్న షీల్డ్​ గురించి బిగ్​బాస్ స్పెషల్ ఎలివేషన్ ఇచ్చారు. అది కేవం ఫస్ట్ ఫైనలిస్ట్​కి లభించే గౌరవమే కాదు.. ఆ షీల్డ్ కష్టాలని భరించి.. సవాళ్లను ఎదుర్కొని.. గొంగలి పురుగునుంచి.. సీతాకోక చిలకగా మారే మీ ప్రయాణానికి ప్రతీక అంటూ చెప్పారు. అది కేవలం మీలో ఒకరికే లభిస్తుందని తెలిపారు. అలాగే ఇదే ఆఖరు ఛాలెంజ్ అని తెలిపారు బిగ్​బాస్. దీంతో అంతా షాక్ అయ్యారు. 

Continues below advertisement

ఫైనల్ టాస్క్ ఇదేనా?

ఇదే టికెట్​ టూ ఫినాలేలో ఆఖరు ఛాలెంజ్ అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నట్లు చూపించారు. తర్వాత యుద్ధాలు మాత్రమే ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ముగ్గురు పోటిదారులకు ఇస్తోన్న చివరి ఛాలెంజ్ అంటూ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్​కి సంచాలక్​గా తనూజ చేస్తుంది. టాస్క్ పేరు బ్యాలెన్స్ చేయరా డింబకా. ఇప్పుడు రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ చేతిలో కర్ర పట్టుకుని.. దానిపై కాయిన్స్, టోకెన్స్​ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. 

రేసు నుంచి బయటకు వచ్చినవారంతా ఇప్పుడు ఎవరికైతే టికెట్​ టూ ఫినాలే రావద్దు అనుకుంటున్నారో వారి కర్రపై కాయిన్స్ లేదా టోకెన్స్ పెట్టాల్సి ఉందని చెప్పాడు. ప్రోమో ప్రకారం భరణి ఇమ్ము కర్రపై కాయిన్స్ పెట్టాడు. రీతూ కర్రపై సుమన్ శెట్టి పెట్టాడు. కళ్యాణ్ కర్రపై తనూజ పెట్టినట్లు కనిపిస్తుంది. కానీ క్లారిటీ లేదు. అయితే వీటిని బ్యాలెన్స్ చేస్తూ పోటీదారులు నడవాల్సి ఉంది. అప్పుడు అవి పడిపోకుండా చూడాలి. ఒకవేళ పడితే ఛాలెంజ్​లో ఓడిపోయినట్లేనని చెప్పాడు బిగ్​బాస్. మరి ఈ పోటీలో గెలిచేది ఎవరనేది పూర్తి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సి ఉంది.