Bigg Boss Special Sunday Promo : బిగ్​బాస్​ తెలుగు సీజన్ 9 డే 42కి సంబంధించిన ప్రోమో వచ్చింది. దీపావళి స్పెషల్ లుక్​లో నాగార్జున, కంటెస్టెంట్లు అందంగా ముస్తాబయ్యారు. ప్రోమోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. కంటెస్టెంట్లతో గేమ్స్ ఆడించడం నుంచి.. ఇంటి సభ్యుల నుంచి వీడియో కాల్స్ వరకు బిగ్​బాస్ టీమ్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్​ను ప్రారంభించింది. మరి దీపావళి, సండే స్పెషల్ ప్రోమో హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

బిగ్​బాస్​ స్పెషల్ దీపావళి ప్రోమో

బిగ్​బాస్ ప్రోమో స్టార్ట్ అవ్వగానే.. నాగార్జున ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పాడు. కంటెస్టెంట్లకు కూడా విష్ చేశారు. దీపావళి మీ ఇంట్లో.. ఎంటర్టైన్మెంట్ మా ఇంట్లో అంటూ చెప్పాడు నాగార్జున. దీపావళికి రకరకాల టపాసులు ఉంటాయి. మీరంతా మా క్రాకర్స్ అంటూ స్టార్ట్ చేశారు నాగ్. తర్వాత కాసేపు ఆడియన్స్​తో మాట్లాడారు. నాగ్​ మామని ఓ అమ్మాయి మటన్ బిర్యానీతో కంపేర్ చేస్తుంది. ఇంతలో సంజన.. సార్ పెళ్లి చూపుల్లా కనిపిస్తున్నారు సార్ అంటే.. నీకు నాకా అంటూ జోక్ చేసి స్మైల్ ఇవ్వడంతో అందరూ నవ్వేస్తారు. 

Continues below advertisement

ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్​లు..

కొన్ని టాస్క్​లు ఇస్తాను. వాటిలో గెలిచినవారికి ఇంటి నుంచి వీడియో మెసేజ్​లు వస్తాయంటూ చెప్తారు నాగార్జున. నేను మూడు పదాలు చెప్తాను. వాటిని విని గెస్ చేయాలంటూ టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్లను రెండుగా డివైడ్ చేశారు. ముందుగా వచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య, దివ్య నిఖిత పాల్గొన్నారు. నాగార్జున సీఈఓ, కాలేజ్ ఫ్రెండ్స్, ఫార్మింగ్ అని చెప్పగా.. దివ్య మహర్షి అంటూ ఆన్సర్ ఇస్తుంది. దీంతో ఆరెంజ్ టీమ్ గెలిచిందంటూ నాగార్జున చెప్తారు. తర్వాత వాళ్లు డ్యాన్స్ వేస్తారు. ఇలా ఈ టాస్క్ కొనసాగింది. 

తర్వాత ఫోటో చూసి.. డ్యాన్స్

మరో టాస్క్​లో భాగంగా ఫోటోను చూపించి.. ఎదుటివ్యక్తికి పేరు చెప్పకుండా ఆ స్టెప్​తో పాటను గుర్తు పట్టేలా చేయాల్సి ఉంది. దీనిలో వచ్చిన పవన్, దివ్య దాయి దాయి దామ్మ సాంగ్ కనిపెట్టి గెలుస్తారు. అనంతరం నాగార్జున ఇంటి సభ్యులు అందరికీ కొత్త డ్రెస్​లు ఇచ్చారు. ఇంతలో తనూజ సార్ నాకు ఎందుకు ఇమ్మాన్యూయేల్​కి నచ్చిన కలర్ ఇచ్చారు అంటే.. ఆ డ్రెస్​లో నిన్ను చేసి.. రెడ్ ఫ్లవర్ అవుతాడులే అంటూ పంచ్ వేస్తాడు. తర్వాత కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి.. మొదటి, చివరి అక్షరం చెప్తారు. వాటికి సంబంధించిన ఫుడ్స్ కంటెస్టెంట్లు చెప్పాల్సి ఉంది. 

ముందుగా చెప్పినట్లు కంటెస్టెంట్లకు ఇంటి సభ్యుల నుంచి వీడియో మెసేజ్​లు వచ్చాయి. సుమన్ శెట్టికి, డిమోన్ పవన్​కి, సంజనాకి కాల్స్ వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. పవన్​కి అతని తల్లి, సుమన్​కి భార్య నుంచి, సంజనాకి భర్త నుంచి వీడియో కాల్స్ వచ్చాయి. అందరూ ఎమోషనల్ అవుతుండగా ప్రోమో ఎండ్ అయింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ స్పెషల్ ఎపిసోడ్ సాయంత్రం 7 నుంచి రానుంది.