Bigg Boss Telugu 9 Day 32 Promo : బిగ్​బాస్​లో డేంజర్​ జోన్​లో ఉన్నవాళ్లందరికీ టాస్కులు జరుగుతున్నాయి. వీరిలోనే గెలిచిన వారికి కెప్టెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే సోమవారం నుంచి టాస్కుల్లో ఉన్న కంటెస్టెంట్లకు ఉపశమనం ఇస్తూ ఎంటర్​టైన్​మెంట్ టాస్క్ పెట్టాడు బిగ్​బాస్. అది కేవలం ఫన్​ ఇవ్వడమే కాదు.. కష్టపడి గెలిచేలా డిజైన్ చేశారు. గేమ్స్ ఓ పక్క అయితే.. టాప్​లో ఉన్నవారికి ఓ పవర్ ఇచ్చి.. ఓ టీమ్​ని ఎలిమినేట్ చేయించాడు. వాటికి సంబంధించిన బిగ్​బాస్ సీజన్ 9 డే 32కి సంబంధించిన ప్రోమోలు విడుదల చేశారు. 

Continues below advertisement

బిగ్​బాస్ డే 32 లేటెస్ట్ ప్రోమో.. 

బిగ్​బాస్ డే 32లో భాగంగా మొదటి ప్రోమోలో ఎంటర్​టైన్మెంట్​ని ఇన్​క్లూడ్ చేశాడు బిగ్​బాస్. ఫుల్ ఎంటర్​టైన్​మెంట్​లోకి వెళ్లే సందర్భం వచ్చింది అంటూ ప్రోమోను ప్రారంభించారు. ఎంటర్​టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో.. టాస్క్​ గెలవడం కూడా అంతే ముఖ్యమంటూ సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్​కి అనుగుణంగా పోటీదారులు డ్యాన్స్ చేయాలని.. సాంగ్ ఆగినప్పుడు ఎదురుగా ఉన్న రంగు గోడలో నుంచి బయటకు రావాలని చెప్పాడు. మెలికలు తిరుగుతుంటే అమ్మాయో పాట వేయగా.. ఆరెంజ్ అనే కలర్ చెప్పాడు బిగ్​బాస్. ఇలా బిగ్​బాస్ కలర్ చెప్పినప్పుడు ఎక్కువసార్లు ఆ రంగుల గోడ నుంచి బయటకు వస్తారో వారు విన్ అయినట్లు అని చెప్పాడు బిగ్​బాస్. 

Continues below advertisement

పోటీల్లో అందరూ చాలా స్పిరిట్​తో ఆడారు. దివ్యను భరణి మెచ్చుకోవడంతో తనూజ చిన్న బుచ్చుకున్నట్లు చూపించారు. తర్వాత దివ్యకు, తనూజకు కూడా భరణి విషయంలో క్లాష్ వచ్చినట్లు చూపించారు. తనూజ మీకోసం ఆడండి.. ఎవరికోసం ఆడొద్దు అని చెప్తే దివ్య ఆయన కోసమే ఆడుతున్నారు అని చెప్తుంది. నేను మానాన్నకి చెప్తాను అంటూ తనూజ బదులు ఇచ్చింది. ఇదిలా ఉండగా.. సంజన ఇలా ఉంటే నేను ఇంటికి వెళ్లిపోతాను. ఫిజికల్ టాస్క్​లు ఆడటం నా వల్ల అవ్వట్లేదు అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. 

సెకండ్ ప్రోమో హైలెట్స్.. 

ప్రోమో స్టార్టింగ్​లోనే సంజన, రీతూ మేము రాము బయటకి రాము అంటూ రాము రాథోడ్​ని టీజ్ చేస్తారు. దీంతో ఏమి చేయాలో తెలియని స్టేజ్​లో ఉండిపోతాడు రాము. తర్వాత ఇమ్మాన్యూయేల్ వచ్చి.. అడుగుతాడు. వాళ్లని ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిపోవచ్చు అంటే అందరూ నవ్వేస్తారు. తర్వాత ఎక్కువ పాయింట్లు ఉన్న భరణి, దివ్యకు బిగ్​బాస్ బోటమ్​లో ఉన్న ఇద్దరి టీమ్స్​లో నుంచి ఒకరిని తీసేయొచ్చని పవర్ ఇస్తాడు.

చివరి రెండు ప్లేసుల్లో సంజన-ఫ్లోరా, సుమన్- శ్రీజ ఉంటారు. వారిలో సంజన్ టీమ్ కాస్త ముందు ఉంది. అయితే గేమ్స్ అన్ని చూసి.. మాకు కాంపిటేషన్ తగ్గించుకోవాలని.. సంజన-ఫ్లోరాను రేసు నుంచి తప్పిస్తున్నట్లు భరణి-దివ్య తెలిపారు. దీంతో సంజన్ హర్ట్ అయింది. మేము ఇలా వెళ్లిపోవడానికి డిజర్వ్ కాదంటూ ఫీల్ అయింది. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈరోజు పూర్తి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు లిస్ట్ కూడా రెడీ అయిపోయింది. బిగ్​బాస్ రానున్న రోజుల్లో ఎలాంటి ట్విస్ట్​లు ఇస్తాడో చూసేద్దాం.