Bigg Boss Telugu 9 Latest Emotional Promo : బిగ్‌బాస్ సీజన్ 9లోకి కొత్త కంటెస్టెంట్ వచ్చేసింది. ఇంటి సభ్యులు ఎంచుకున్న పర్సన్‌ని కాకుండా.. వారు ఎవరికైతే ఓటు వేయలేదో.. వారిని లోపలికి తీసుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. లోపలికి వచ్చిన దివ్యకు ఓ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. అదేంటంటే ఇప్పటివరకు లోపలున్న కంటెస్టెంట్లు ఆడుతున్న గేమ్ చూసి.. వారిని ఆర్డర్ ప్రకారం నిల్చొపెట్టాలి చెప్పాడు. దాంట్లో భాగంగా ఓ ట్విస్ట్ ఇచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఎలా ఉందంటే..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. లోపలికి ఎంట్రీ ఇచ్చిన దివ్య బిగ్‌బాస్ గేమ్ ప్రకారం ర్యాంకింగ్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటాడు. ఒక్కోక్కరికి ఒక్కో రీజన్ చెప్తూ దివ్య వారిని నెంబర్స్ దగ్గర పెట్టాలి. ఫ్లోరా షైనీని దివ్య చివరి స్థానంలో పెట్టగా.. భరణిని మొదటి స్థానంలో పెట్టింది. అలాగే ఇమ్మూని రెండో స్థానంలో.. మూడో స్థానంలో సంజనను, నాలుగో స్థానంలో డిమోన్ పవన్‌ను 5 స్థానంలో తనూజను ఉంచింది. ఇక్కడితో టాస్క్ అయిపోయింది అనుకున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఓ షాక్ ఇచ్చాడు.
కెప్టెన్సీ టాస్క్..
దివ్య సెలెక్ట్ చేసిన టాప్ 5 కంటెస్టెంట్లలను కెప్టెన్సీ టాస్క్ ఆడేందుకు అర్హులంటూ చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. అలాగే దివ్య కూడా వారితో పాటు ఆడాల్సి ఉంది. వారికి తప్పిస్తారా, గెలిపిస్తారా అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే ఈ టాస్క్‌లో ఇమ్మాన్యూయేల్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఇది ఆల్రేడి లైవ్‌లో ప్లే అయిపోయింది. అలాగే ఈ వారం ఎన్నో ట్విస్ట్‌లు ఉండబోతున్నాయనేది సమాచారం. ఉంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని.. ఒకరు సీక్రేట్ రూమ్‌లోకి వెళ్లనున్నారని.. లేదా ఇద్దరూ ఎలిమినేషన్ ఉండొచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో.. ఎవరికి ఓట్లు తక్కువగా వచ్చాయో.. కాసేపట్లో తెలియనుంది. ఎందుకంటే ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌ని ప్రారంభించేశారు. దసరా కోసం కూడా మంచి ప్లానింగ్ చేసినట్లు బిగ్‌బాస్ టీమ్ చెప్తోంది.