Bigg Boss 9 Telugu Unstoppable Emmanuel AV Promo : బిగ్​బాస్​లో చివరి వారంలో అందరూ ఎదురు చూసేది స్పెషల్ ఏవీల కోసమే. అయితే ఈ సారి దానిని భిన్నంగా ప్లాన్ చేశాడు బిగ్​బాస్. సోమవారం, మంగళవారం కేవలం టాస్క్​లతో కానిచ్చేశాడు. కానీ ఈరోజు నుంచి స్పెషల్ ప్రోమోల హంగామా ఉండబోతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన మొదటి ప్రోమో వచ్చేసింది. అందరికంటే ముందుగా ఇమ్మాన్యుయేల్ ప్రోమో విడుదల చేశాడు బిగ్​బాస్. ప్రోమోలో పొగడ్తలతో ముంచేశాడు. 

Continues below advertisement

బిగ్​బాస్​ ఇమ్మాన్యుయేల్ ఏవీ ప్రోమో.. 

బిగ్​బాస్​లో టాప్​ 5 కంటెస్టెంట్లలో ఒకరైనా ఇమ్మాన్యుయేల్ ఏవీ వచ్చేస్తుంది. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. అందంగా రెడీ అయినా ఇమ్మాన్యుయేల్.. తనకోసం సిద్ధమైన సెట్​లోకి వచ్చాడు. అక్కడున్న ఫోటోలు, మెమోరీలు చూసుకుంటూ మురిసిపోయాడు. ఇది పొడిచింది డిమోన్​గాడే అంటూ వెళ్లి.. ఇమ్మూ మదర్ ఇంట్లోకి వచ్చినప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు. నవ్వుతూ, ఎమోషనల్ అవుతూ ముద్దు పెట్టుకున్నాడు. 

Continues below advertisement

బిగ్​బాస్​ మాటల్లో.. 

ఇమ్మాన్యుయేల్ ప్రతి ఒక్క ఎమోషన్.. అనుభవంలోకి వస్తేనే.. జీవితం మరింత నిండుగా, ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను స్వయంగా అనుభవించిన వారికే.. ఒక చిన్న చిరునవ్వు బలమెంతో బాగా తెలుస్తుంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు అంటూ బిగ్​బాస్ చెప్తుండగానే ఇమ్మాన్యుయేల్ ఏడ్చేశాడు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులు అయినా.. నామినేషన్స్​ అయినా మాటలే మీ ఆయుధాలు. తెలివి తేటలే మీ గేమ్ ప్లాన్. ప్రేక్షకులను ఎలా ఎంటర్​టైన్ చేయాలనే విషయం.. ఈ ఇంట్లో మీకన్నా ఎవ్వరికీ తెలియదు అంటూ ఎలివేషన్ ఇచ్చాడు. 

కమెడీయన్​గా అడుగు పెట్టిన మీరు.. హీరోగా రావాలని.. మీ అమ్మ కల నిజం కావాలని బిగ్​బాస్ అంటుండగానే.. ఇమ్మాన్యుయేల్ ఏడ్చేశాడు.  బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ కట్టె కాలే వరకు మిమ్మల్ని ఎంటర్​టైన్ చేస్తూనే ఉంటాను అంటూ అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. ప్రోమోనే ఇంత హైప్ ఇస్తుంటే.. ఇంక ఏవీ ఏ రేంజ్​లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంక డిమోన్ పవన్, సంజన, తనూజ, కళ్యాణ్​ ఏవీలు, వాటి ప్రోమోలు రావాల్సి ఉంది.