Bigg Boss 9 Telugu Thanuja Kalyan Demon Promo : బిగ్‌బాస్‌లో ప్రతి సీజన్లో ఏదొక కపుల్ ఉంటారు. అయితే ఈ సీజన్లో డిమోన్ పవన్, రీతూ బాగా హైలెట్ అయ్యారు. కానీ కళ్యాణ్, తనూజ జంట మాత్రం కాస్త డిఫరెంట్. వీళ్లు కపుల్ అని చెప్పలేము. కాదు అని చెప్పలేము. ఎందుకంటే కళ్యాణ్ రీసెంట్‌గానే బయట కూడా తనూజతో ఈ బాండ్ ఉండాలన్నాడు. ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పాడు. కానీ తనూజ మొదటి నుంచి కళ్యాణ్‌ని దూరం పెడుతూనే ఉంది. కానీ రీసెంట్ టైమ్‌లో ఆమె కూడా కళ్యాణ్ ఒక్కడే జెన్యూన్‌గా తనకు సపోర్ట్ చేశాడని చెప్పడం, అతనితోనే ఎక్కువ సమయం స్పెండ్ చేయడం చేస్తుంది.
కానీ బిగ్‌బాస్ ప్రేక్షకులు మాత్రం కళ్యాణ్, తనూజ జంట సూపర్‌గా ఉందని రీల్స్, ఎడిట్స్ కూడా చేస్తున్నారు. అయితే వాళ్లకి సంతోషాన్ని ఇచ్చే అన్‌సీన్ ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ఇంట్లోని వారంతా ఫన్నీ స్కిట్ వేయగా.. దానిలో కళ్యాణ్, తనూజ.. వైఫ్, హజ్బెండ్‌గా చేశారు. ఇంతకీ ప్రోమో హైలెట్స్ ఏంటి? పవన్‌ని ఇమ్మాన్యుయేల్ ఎలా ఆటపట్టించాడు.. స్కిట్ ఏమి వేశారో ఇప్పుడు చూసేద్దాం.
అనగనగా ఓ అమ్మ, ఇద్దరు కొడుకులు..
ఇమ్మాన్యుయేల్ తల్లి పాత్ర వేయగా.. డిమోన్ పవన్, కళ్యాణ్ కొడుకులుగా చేశారు. డిమోన్ పవన్‌కి సంజన భార్యగా, కళ్యాణ్‌కి తనూజ భార్యగా చేశారు. తల్లి, భార్యల మధ్య కొడుకులు ఎలా సఫర్ అయ్యారు.. అత్తా కోడళ్ల గిల్లి కజ్జాలు ఏంటనేది ఫన్నీగా చేశారు. ఇమ్మూ తల్లిగా ఊడుస్తూ ఉండగా.. కళ్యాణ్, పవన్ వచ్చి అమ్మా అని పిలుస్తారు. ఆఫీస్‌కి వెళ్లి వస్తాము అంటే.. ఉండండి దిష్టి తీస్తాను అంటూ చెప్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి రీతూ దిష్టి థూ అంటూ డిమోన్ పవన్‌పై ఊస్తాడు ఇమ్మూ.
బయటకు వెళ్లిన ఇద్దరూ తనూజ, సంజనను తీసుకుని ఇంటికి వచ్చి అమ్మా అంటే.. ఎవర్రా వీళ్లు సబ్బులు అమ్ముకునేవాళ్లా అని అడుగుతాడు. లేదు అమ్మ కోడళ్లు అని చెప్తారు. అత్తగారు ఆశీర్వదించండి అంటూ సంజన కాళ్లపై పడుతుంది. ఇదే నాకు అత్త లాగా ఉంది.. నేను దీనికి అత్త ఏంటిరా అంటూ ఫన్ చేశారు. తర్వాత సంజన, పవన్.. కళ్యాణ్, తనూజ మాట్లాడుకుంటారు. ఈలోపు ఏమే చిన్న కోడలా అంటూ తనూజని పిలిచి.. వచ్చినకాడి నుంచి వంట చేయలేదు కాసలి తుడవలేదు.. పో పోయి పెసరట్టు ఉప్మా చేసి తీసుకురా అంటూ అరిచేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు. పవన్‌ని నీకు రీతూ లాంటి భార్యని తెస్తానంటూ బాగా టీజ్ చేశాడు ఇమ్మూ. దీంతో ప్రోమో అంతా ఫన్నీగా సాగింది.