Bigg Boss Second Week Nominations Heated Arguments : బిగ్​బాస్​ సండే ఫన్​ డే అయిపోయిన తర్వాత.. హీటెక్కించే మండే వచ్చేసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్​లో కంటెస్టెంట్లు అందరూ సరదగా ఫన్ గేమ్స్ ఆడారు. బేబక్క ఎలిమినేట్ కూడా అయింది. వీకెండ్ గేమ్స్​తో కంటెస్టెంట్లు చిల్ అయ్యారో లేదో ఇలా నామినేషన్స్ వచ్చేశాయి. ఇప్పటికే హౌజ్​లో గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. మరి ఈ వారం నామినేషన్స్ రచ్చ ఎలా సాగిందో.. కంటెస్టెంట్లు ఎవిక్ట్ చేయడానికి ఎవరిని ఎంచుకున్నారో ఇప్పుడు చూసేద్దాం. 


ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతుంది అంటూ బిగ్​బాస్​ చెప్పగా ప్రోమో స్టార్ట్ అయింది. కంటెస్టెంట్​లు ఎవిక్ట్ చేయడానికి ఎవరినైతే ఎంచుకుంటున్నారో.. వారిపై పెయింట్ వేయాలని చెప్పడంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్​బాస్ సూచించాడు. అభయ్ నవీన్.. ఆదిత్య ఓం పై, విష్ణుప్రియపై పెయింట్ వేశాడు. సీత.. ప్రేరణపై.. సోనియా.. నైనికపై పెయింట్ వేసి ఫ్లాష్స్​తో ప్రోమో, ఆర్గ్యూమెంట్ మొదలైంది. 


రెండో వారంలోనూ చెత్తగోలే..


సీత నామినేషన్స్ చేసేందుకు వచ్చి.. ప్రేరణను ఉద్దేశించి మాట్లాడింది. మీరు బయట ఫ్రెండ్​షిప్ పెట్టుకుని వచ్చి.. మీరు వాటిని మెయింటైన్ చేస్తూ.. వాళ్లు మిమ్మల్ని ఫాలో చేస్తూ ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేయొచ్చు కానీ.. వేరే వాళ్లను ఇదే ఫాలో అవ్వాలని చెప్పే రైట్ మీకు లేదంటూ చెప్పింది సీత. బయట నుంచి బయట నుంచి అనే మాట ఎక్కువగా వస్తుంది. అది ఆపేయండి అంటూ ప్రేరణ కౌంటర్ ఇచ్చింది. క్యారెక్టర్​ని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు ప్రేరణ క్వశ్చన్ చేయగా.. అలా నేనేమి చేయలేదంటూ సీత వాదించింది. 



ప్రేరణ మళ్లీ సీరియస్ అవుతూ.. నన్ను మాట్లాడనిస్తారా? కొంచెం ఎవరైనా ఆమెకి చెప్తారా మాట్లాడనివ్వమని అంటూ సీరియస్ అయింది. మధ్యలో నువ్వు మాట్లాడను అని నువ్వు చెప్పినప్పుడు నీ మాటాకి నువ్వు వాల్యూ ఇవ్వాలి అంటూ ఆర్గ్యూమెంట్​ని పెంచింది ప్రేరణ. నీ మాట నాకు నచ్చకపోతే నేను మాట్లాడుతాను రా అంటూ సీత కౌంటర్ ఇచ్చింది. చెత్త కుప్ప నీట్​గా ఉందని.. చెత్తకుప్పలో దూకము వెళ్లి అంటూ.. సీరియస్ అయ్యి ప్రేరణపై రెడ్ పెయింట్ వేసింది. సీత ఏడుస్తూ ప్రోమోలో కనిపించింది. 


మణికంఠ కంటే తక్కువా?


నవీన్ వచ్చి.. ఆదిత్య ఓంని నామినేట్ చేస్తున్నట్లు చెప్పగా.. ఆదిత్య డిఫెండ్ చేసుకున్నారు. మణికంఠ కంటే నేను తక్కువగా అనిపించానా అంటూ అడిగారు. మణికంఠ కంటే తక్కువ కానే కాదు అని నవీన్ చెప్పిన వెంటనే.. ఆదిత్య మాట్లాడుతూ.. ఓకే అందరికీ అర్థమైంది అంటూ కౌంటర్ ఇచ్చాడు. అందరికీ అర్థమైందని చెప్పాడు. 


డస్ట్​బిన్​ రీజన్​ని ఇలా వాడేసిందా?


సోనియా వచ్చి నైనికను నామినేట్ చేసింది. డస్ట్​బిన్​ నుంచి తీశారా? ఇంకేడ నుంచి తీశారా అనేది పక్కన పెడితే.. దానిని క్లీన్ చేసి పెట్టాలిగా అంటూ నైనికను నామినేట్ చేసింది. నేను కాదు అని నైనిక డిఫెండ్ చేసుకుంటుంటే.. నీ క్లాన్ అంటే నువ్వు. కాబట్టి నువ్వే చేయించగాలిగా అంటూ ఓవర్ స్మార్ట్​నెస్ చూపించింది. మీ క్లాన్​లో అలా నడుస్తుందేమో.. మాకు అలా జరగదు అని నైనిక చెప్పగా.. ఆమె తలపై సోనియా పెయింట్ వేసింది. 


Also Read : ఆనవాయితీ ప్రకారం బేబక్కను బయటకు పంపేసిన బిగ్​బాస్.. ఈ వారానికి ఆమె రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?


బొొక్కలో క్లారిటీ..


సోనియా సెకండ్ నామినేషన్​ సీతకు వేసింది. గేమ్​కి పర్సనల్​కి డివిజన్ లేదు అంటే.. అది నా పర్సనల్ ప్రాబ్లమ్ అది.. సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి. నీకు ఆ మెచ్యూరిటీ రావాలి అంటూ సోనియా చెప్పగా.. నాకు క్లారిటీ ఉంది.. నేను చేసే పనులు నాకు తెలుసు సోనియా. నువ్వు గేమ్​ని అర్థం చేసుకుని.. తర్వాత వచ్చి నాకు చెప్పు అంటూ సీత సీరియస్ అయింది. నీకు క్లారిటీ లేదు అంటూ మైక్​ని తీసి.. వస్తూ.. బొక్క క్లారిటీ లేదు అనగా.. సోనియా ఎక్కువ మాట్లాడకంటూ సీరియస్ అయింది. బొక్కలో క్లారిటీ అని నిన్ను అనలేదు సోనియా అంటూ మొహంపై చెప్పింది. ఇలా ప్రోమో ముగిసింది.


Also Read : బిగ్​బాస్​ షో 100 రోజులు ఎందుకు? ఒక రోజులోనే చేసేయండి.. ఛీ..రాకు అంటోన్న మణికంఠ.. గట్టిగా ఇచ్చిపడేసిన విష్ణుప్రియ