‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఊహించినట్లే టేస్టీ తేజా (Tasty Teja) బయటకు వెళ్లిపోయాడు. ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే తేజా.. తాను బయటకు వెళ్లిపోతానని ముందుగానే అంచనా వేయడంతో పెద్దగా షాక్ కాలేదు. చివరిలో తనతోపాటు నిలుచున్న రతికాకు (Rathika Rose) కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. వెళ్లేది నువ్వు కాదు.. నేను అన్నాడు. చివరికి అదే జరిగింది. రతిక సేఫ్ అయ్యింది.. తేజా హౌస్ నుంచి ఔట్ అయ్యాడు.
శోభా కన్నీళ్లు.. ఫుడ్ వీడియో చేసుకుందాంలే అంటూ తేజా ఓదార్పు (Bigg Boss 7 Telugu)
తేజా ఇంటి నుంచి వెళ్తుంటే శివాజీతో సహా హౌస్‌మేట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. వారందరినీ చూసి తేజా కూడా ఏడ్చేశాడు. నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే.. నన్ను క్షమించండి అని తేజా వెళ్తు వెళ్తూ అందరికీ చెప్పాడు. ఆ తర్వాత నాగార్జునతో మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తానో లేదో ఊహించలేదు. కానీ అవకాశం వచ్చింది. హౌస్‌లోకి అమ్మను తీసుకొద్దామని అనుకున్నా. నేను వెళ్తున్నా. అదొక్కటే లోటు. దేన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటా’’ అని తెలిపాడు. తేజా జర్నీ చూసిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. ‘‘బ్యూటిఫుల్ జర్నీ తేజా. ఎంత నవ్వించావ్ తేజా అందరినీ, నేను మిస్ అవుతా తేజా, నేను ఎంత నవ్వుకొనేవాడిని నీతో మాట్లాడుతూ. నీతో జోకులు వేస్తూ’’ అంటూ ఎమోషనల్ అయ్యారు. శోభాశెట్టి (Shobha Shetty) చివర్లో తేజాతో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేకుండా ఎలా ఉండాలో అని భయం వేస్తోంది. మిగతా రోజులు నువ్వు నాతో ఉండవని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
హౌస్‌మేట్స్‌కు మార్కులు వేసిన తేజా.. శోభాకు 10కి 20
హౌస్‌మేట్స్‌కు మార్కులు వెయ్యాలని తేజాను అడిగారు నాగ్. ఈ సందర్భంగా శోభా శెట్టికి 10కి 20 మార్కులు వేశాడు. ఇన్ని వారాలు నన్ను భరించినందుకు అన్ని మార్కులు ఇచ్చానని తెలిపాడు. గౌతమ్‌కు 8 మార్కులు, అర్జున్‌కు 8 మార్కులు ఇస్తానని తెలిపాడు. అయితే, అర్జున్ కూడా తేజా గురించి ఎమోషనల్ అవ్వడం గమనార్హం. ఇంట్లో బాగా కనెక్ట్ అయ్యింది తేజాయేనని అన్నాడు. ఆ తర్వాత యావర్‌కు 10 మార్కులు వేశాడు. కానీ, అతడు ఆ పది తీసుకోడని, తగ్గించుకుంటాడని తేజా అన్నాడు. భోలే వంటలకు 7 మార్కులు వేయొచ్చని అన్నాడు, అశ్వినీకి 8 మార్కులు, ప్రశాంత్‌కు 9 మార్కులు ఇచ్చాడు. ప్రశాంత్ ఓటమిని తీసుకోడు అందుకే ఒక మార్క్ తగ్గించానని అన్నాడు. ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో వంటలక్క లాంటిదని తేజా అన్నాడు. హౌస్‌లో అమ్మాయిలను తాను ఏకవచనంతో పిలిచేవాడినని.. కానీ, ఆమెను మాత్రమే అలా పిలవలేదని అన్నాడు. ఆమె మీద ఉన్న రెస్పెక్ట్ అలాంటిదని తేజా తెలిపాడు. తన కెప్టెన్సీ కోసం ఆడినందుకు పదికి 10 మార్కులు ఇస్తానని తేజా తెలిపాడు. అమర్ దీప్ ఆటలో ఇప్పుడు పుంజుకున్నాడని, అతడికి 9 మార్కులు ఇస్తానని తేజా చెప్పాడు, రతికాకు 5 మార్కులు, శివాజీ తనని నామినేషన్ చేశాడు కాబట్టి 8 మార్కులు వేస్తున్నానని తెలిపాడు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘‘తేజా నువ్వు చాలా తెలివైనవాడివి. నీ అంత తెలివైనవాడు ఈ హౌస్‌లో లేడు. నేను చూసినవాళ్లలో నువ్వు చాలా అరుదైనవాడివి’’ అని ప్రశంసించాడు.
Also Read: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్