‘బిగ్ బాస్’ సీజన్-7లో సోమవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ వారం కంటెస్టెంట్లను నామినేట్ చేసేందుకుగాను ‘బిగ్ బాస్’ హౌస్ కాస్తా.. కోర్ట్ రూమ్‌గా మిగిలిపోయింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయదలచుకొనే సభ్యులను బోనులో నిలబెట్టి.. తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. జ్యూరీ సభ్యులైన శోభాశెట్టి, సందీప్, శివాజీలను వారు మెప్పించాల్సి ఉంటుంది. అప్పుడే బోనులో ఉన్న కంటెస్టెంట్లు నామినేట్ అవుతారు. ఈ సందర్భంగా ప్రిన్స్.. ప్రియాంక్, టేస్టీ తేజాలను బోనులో నిలబెట్టాడు. దీంతో కంటెస్టెంట్లు గట్టిగానే అరుచుకున్నారు. 


శివాజీతో రతిక వాదన


ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున రతిక, పల్లవి ప్రశాంత్‌లను ఉద్దేశించి.. శివాజీని కొన్ని విషయాలు అడిగారు. ఇద్దరిలో ఎవరు ముందుగా చెయ్యిచారని నాగ్ సరదాగా అడిగారు. అప్పుడు శివాజీ.. ఇద్దరూ సమానంగా చప్పట్లు కొట్టినట్లు అని తెలిపాడు. అయితే, ఈ విషయంపై రతిక, శివాజీ మధ్య సోమవారం వార్ జరిగింది. నాగ్ ముందు మీరు ఎందుకు అలా అన్నారు? అని ప్రశ్నించింది. ‘‘రెండు చేతులు కలిశాయి. అందుకే చప్పట్లు వచ్చాయనే మాట అనేశావ్’’ అని రతిక అడిగింది. ఇందుకు శివాజీ సమాధానం ఇస్తూ.. ‘‘నేను లేకపోతే.. ఆయన వీడియోలు వేసి చూపిస్తే ఏమిటీ పరిస్థితి? సరదాగా ఉన్నదే కదా నేను అన్నది’’ అని అడిగాడు. ఇందుకు రతిక ‘‘కాదన్నా.. సరదా కాదు, వీడియోలు వేసి చూపిస్తే ఇంకా హ్యాపీ. ఒక అమ్మాయిగా నాకు అనిపిస్తోంది అన్నా’’ అని అంది. ఇందుకు శివాజీ సీరియస్ అవుతూ.. ‘‘నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావ్ అంతేగా? నువ్వు హర్ట్ అయ్యావనేగా నీకు సారి చెప్పింది? ఎందుకు సాగదీస్తున్నావ్ కాళ్లు పట్టుకోవాలా? నువ్వు మాట్లాడేది వాంటెడ్‌గా అనిపిస్తోంది’’ అని శివాజీ అన్నాడు. ఇదంతా సోమవారం రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు. అయితే, నిన్నటి సన్ ఫన్ డే ఎపిసోడ్ చూడని ప్రేక్షకులకు వీరి గొడవ అర్థం కావడం లేదు. వీరి మధ్య ఏమైందని ప్రశ్నిస్తున్నారు.


శోభాశెట్టి, ప్రియాంక, తేజాతో ప్రిన్స్ వాదన


నామినేషన్స్‌లో భాగంగా ప్రిన్స్ యావర్.. ప్రియాంక, టేస్టీ తేజాలను ఎంపిక చేసుకున్నాడు. తన వాదన వినిపిస్తూ శోభాశెట్టి ఫెమినిజం తరహాలో.. ఇద్దరు అమ్మయిలే ఆడాలి అన్నట్లుగా మాట్లాడారు అని తెలిపాడు. ఇందుకు శోభాశెట్టి మాట్లాడుతూ.. ‘‘ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టే నేను త్యాగం చేయాలి అనుకుంటున్నా అని తేజా దగ్గర మీరే అన్నారట కదా’’ అని తెలిపింది. ‘‘ఆన్ ది స్పాట్.. నేను ఏమి అన్నానో అదే పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ప్రిన్స్ అన్నాడు. ‘‘నాకు ఈ విషయంలో క్లారిటీ కావాలి. అప్పటివరకు వాదనలు సాగడానికి నేను ఒప్పుకోను’’ అని శోభాశెట్టి తెలిపింది. ‘‘నేను కోపంగా ఉన్నప్పుడు నేను ఎవరినైనా హర్ట్ చేశానా? ఎవరి ఫీలింగ్స్‌నైనా హర్ట్ చేశానా? నేను డ్యామేజ్ చేసింది బిగ్ బాస్ ప్రాపర్టీ. అది మీకు సంబంధం లేదు’’ అని ప్రిన్స్ అన్నాడు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘‘అది మాకు అవసరం’’ అని తెలిపింది. అనంతరం శివాజీ మాట్లాడుతూ.. ‘‘దానివల్ల నువ్వు ఏం నష్టపోయావు?’’ అని అడిగాడు. ‘‘ఆ నిర్ణయం నన్ను హర్ట్ చేసింది’’ అని ప్రిన్స్ సమాధానం ఇచ్చాడు. అలాగే తేజా టాస్క్‌లు సరిగా ఆడటం లేదని ప్రిన్స్ ఆరోపించాడు. దీంతో తేజా స్పందిస్తూ.. ‘‘బీస్ట్ టాస్క్‌లో నీ కంటే బాగా ఆడాను. అలాగే, స్టాండ్‌బై మీద నువ్వు ఉన్నప్పుడు నీ ముఖం మీద నీళ్లు కొట్టాను. అది పిజికల్ కాదా?’’ అని అడిగాడు. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే.. రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. 



Also Read: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి దామిని ఔట్ - ఇప్పుడు ఎన్ని చెప్పినా వర్కవుట్ కాదు, ఇంటికెళ్లమన్న శివాజీ