‘బిగ్ బాస్’ సీజన్-7 ( Bigg Boss Telugu 7)లో వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా శివాజీ, గౌతమ్ మధ్య జరుగుతున్న వార్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు హోస్ట్ నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘హౌస్‌లో చాలామంది చాలాసార్లు నాగ్ సార్ వచ్చాక తేల్చుకుందాం అని చాలా చాలా సార్లు అనడం విన్నాను. ఇక్కడ ఇబ్బందైతే కన్ఫెషన్ రూమ్‌‌కి వచ్చి తేల్చుకోవచ్చు’’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో గౌతమ్ లేచి నిలబడ్డాడు. తాను కొన్ని విషయాలు తేల్చుకోవాలని అన్నాడు. 


శివాజీ ‘మ్యాచ్ ఫిక్సింగ్’పై క్లారిటీ


కెప్టెన్సీ టాస్క్‌లో శివాజీ తనను కావాలని పక్కన పెట్టాలని చూశారని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించాడు అనేది గౌతమ్ ఆరోపణ. ఈ విషయాన్నే నాగ్ ప్రశ్నిస్తూ.. నువ్వు చూశావా లేదా ఇంకెవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఇందుకు గౌతమ్, కొన్ని చూశాను.. అశ్వినీ కూడా చెప్పిందని అన్నాడు. దీంతో ఈ విషయం కన్ఫెషన్ రూమ్‌లో తేల్చుకోవల్సిన విషయం కాదని, హౌస్‌మేట్స్‌తో తేల్చుకోవల్సిందని నాగ్ చెప్పారు. గౌతమ్‌కు శివాజీ అన్యాయం చేశాడు అనుకొనేవారు చేతులు ఎత్తండని హౌస్‌మేట్స్‌ను అడిగారు నాగ్. దీంతో కేవలం అశ్వినీ మాత్రమే చెయ్యెత్తింది. ఈ సందర్భంగా శివాజీ టీమ్ మేట్స్‌ను ఆ రోజు ఏం జరిగిందని అడిగారు. ప్రియాంక సమాధానమిస్తూ.. శివాజీ మమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యలేదని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత అమర్ మాట్లాడుతూ.. అశ్వినీ రాగానే చెప్పాం. అందుకు ఒకే చెప్పింది. తర్వాత ఇక్కడికి వచ్చాక నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ తర్వాత నాగ్ అశ్వినీని ప్రశ్నించారు. ‘‘శివాజీ ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మాట్లాడారా?’’ అని అడిగారు. దానికి అశ్వినీ మాట్లాడుతూ.. ‘‘ఒక్కరిని పిలవలేదు. గ్రూప్‌గానే మాట్లాడారు’’ అని సమాధానం ఇచ్చింది. ఇంకా ఏదో చెప్పబోతుంటే.. నాగ్ ఆమెను మాట్లాడనివ్వకుండా ఆపారు. ‘‘అశ్వినీ చెప్పింది ఇప్పటికైనా అర్థమైందా? అలాంటి మాటలు విన్న తర్వాత మైండ్ అలాగే అవుతుంది. చెప్పుడు మాటలు’’ అని నాగ్ అన్నారు. 


అసలు ఏం జరిగింది? 


కెప్టెన్సీ టాస్క్ పూర్తయిన తర్వాత అశ్వినీ.. గౌతమ్‌తో మాట్లాడుతూ.. ‘‘గ్రూపులో ఉన్నప్పుడు కూడా శివాజీ వాళ్లంతా గౌతమ్‌ను తీసేయాలి. అల్రెడీ కెప్టెన్‌గా ఉన్నాడు అంటున్నారు. అంటే అల్రెడీ కెప్టెన్‌గా ఉన్న అర్జున్ ఆడొచ్చా? యావర్ ఆడొచ్చా’’ అని అంది. దీంతో గౌతమ్.. ‘‘అందుకే నేను ఆడకూడదని అనుకున్నా’’ అని అన్నాడు. ‘‘ఆయనకు (శివాజీకి) లాస్ట్ మినిట్‌లో ఎలా మాట్లాడాలో తెలుసు. ఆడియెన్స్ బ్యాడ్‌గా అనుకుంటారని, నీ తరపున ఆడతా అని అన్నారని అశ్వినీ తెలిపింది. (గౌతమ్‌కు బదులుగా శివాజీ ఆడతానని ముందుకు వెళ్లడాన్ని లైవ్‌లో చూపించారు. అంతకు ముందు ఆయన గౌతమ్ ఆడకూడదని గ్రూపులో చర్చించారు. ఇదే విషయంపై అశ్వినీ, గౌతమ్ మాట్లాడుకోవడాన్ని శుక్రవారం ఎపిసోడ్ చివర్లో చూపించారు).


ఎలిమినేట్ చేయాలని కోరిన గౌతమ్


శివాజీ తనని టార్గెట్ చేసుకుంటున్నారని భావించిన గౌతమ్.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనని కన్ఫెషన్ రూమ్‌కు పిలవాలని కోరాడు. ఈ సందర్భంగా కెమేరా ముందు శివాజీ గురించి మాట్లాడాడు. ‘‘కొన్ని విషయాలు చాలా చాలా తప్పుగా ఉన్నాయి. వాటిని నేను అంగీకరించను. అదే జరిగితే నేను షో నుంచి బయటకు వెళ్లడానికి కూడా సిద్ధం. నన్ను ఎలిమినేట్ చేసేయండి. గేమ్‌కు ముందు శివాజీ అందరినీ పిలిచి గౌతమ్ అల్రెడీ కెప్టెన్ అయ్యాడు. మళ్లీ అవ్వకూడదు అన్నాడు. అదే లాజిక్ అర్జున్, యావర్‌లకు కూడా వర్తిస్తుంది కదా. ఫిజికల్ గేమ్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి.. నీతి, నిజాయతీ, ధర్మం అని చెబుతాడు. ఆయనలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ మా కంటికి కనిపిస్తున్నాయి. స్లైడ్ చేస్తూ బటర్ రాస్తూ తప్పించుకుంటున్నాడు. ఆయన ఈ షో విన్ కావచ్చు.. కప్ కొట్టవచ్చు. ప్రైజ్ విన్ కావచ్చేమో. అది మేటర్ కాదు. అట్లాంటిది ఏమైనా ఉంటే ఎలిమినట్ చేసేయండి. నేను నామినేషన్స్‌లో కూడా లేను ఎలిమినేట్ చేసేయండి. నాగ్ సార్‌ను కూడా ఈ విషయాన్ని అడుతాను. హౌస్‌లో ఎవరెవరు ఎలాంటివారో లిస్ట్ రాసి చెప్పగలను. నాతో ఎవరూ బ్లఫ్ చేయలేరు. నాకు జస్టిస్ కావాలి. ఆన్సర్ కావాలి’’ అని గౌతమ్ చెప్పాడు. ఈ విషయం పైనే నాగ్ శనివారం క్లారిటీ ఇచ్చారు.



Also Read: అందుకే సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ చెల్లి షాకింగ్ కామెంట్స్