తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘బిగ్ బాస్ - సీజన్-7’కు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున మరో స్పెషల్ ప్రోమోతో వచ్చేశారు. ఈ ప్రోమో భలే ఆసక్తికరంగా ఉంది. చివరిలో ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. దీన్ని బట్టి, సీజన్-7లో కూడా ఊహించని ట్విస్టులు ఉంటాయని అర్థమవుతోంది.
అనుకున్నది జరగదు..
బిగ్ బాస్ 7 ప్రోమోను రమేశ్, రాధ అనే ఇద్దరు ప్రేమికులతో ప్రారంభించారు మేకర్స్. ఇందులో రమేశ్.. కొండపై నుంచి జారి పడిపోబోతుంటే.. రాధ కొండపై నుంచి చున్నీ ఇచ్చి పట్టుకోమంటుంది. అయితే మామూలుగా సినిమాల్లో ఇలాంటి సీన్ వచ్చినప్పుడు రమేశ్.. కచ్చితంగా బ్రతికి బయటపడాల్సిందే.. కానీ ఈ ప్రోమోలో మాత్రం అలా జరగదు. ఇక బతికేస్తాడు అనుకొనే సమయానికి రాధకు తుమ్ము వస్తుంది. అంతే, రమేష్ లోయలో పడిపోతాడు. అంటే బిగ్ బాస్ 7 కూడా ఎవరి ఊహకు అందకుండా ఉంటుందని ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఆటలు చెల్లవని, బిగ్ బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని నాగార్జున స్పష్టం చేశాడు. ఇప్పటికే బిగ్ బాస్ 7 ప్రమోషన్స్ కోసం ఒక షోకి వచ్చిన నాగ్.. అక్కడ కూడా ఈ సీజన్ అనేది ముందు సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది అని కచ్చితంగా చెప్పాడు. భిన్నంగా అంటే ఏంటా అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టారు.
కంటెస్టెంట్స్ వీరేనా?
బిగ్ బాస్ 7 ప్రోమో విడుదలైన.. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకాక్ పిల్ల, మోహన భోగరాజు, సాకేత్, అమర్‌దీప్, శోభా శెట్టి, శ్వేతా నాయుడు, వర్ష, బుల్లెట్ భాస్కర్, ప్రభాకర్.. ఈ షోలో కంటెస్టెంట్స్‌గా రానున్నారని సమాచారం. అయితే మునుపటి సీజన్స్‌లాగా కాకుండా బిగ్ బాస్ 7లో కాస్త గుర్తింపు ఉన్న సెలబ్రిటీలనే తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టు ముందు నుండే టాక్ ఉంది. ఇప్పుడు ఆ టాక్‌ను నిజం చేస్తూ.. ఎక్కువగా సీరియల్ నటీనటులనే ఈ సీజన్ కోసం ఎంపిక చేశారు. మామూలుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యేవరకు కంటెస్టెంట్స్ ఎవరూ అనే విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండడమే మేకర్స్ బాధ్యత కాబట్టి.. పైన చెప్పబడిన సెలబ్రిటీలు కూడా కచ్చితంగా ఈ సీజన్‌లో ఉంటారా లేదా అనే సందేహమే.
అప్పటినుంచి ఇప్పటివరకు..
కింగ్ నాగార్జున.. గత నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ మొదలవ్వగానే ముందుగా జూనియర్ ఎన్‌టీఆర్‌కు హోస్ట్ స్థానాన్ని ఇచ్చి.. షోపై హైప్‌ను విపరీతంగా పెంచేశారు. అంతే కాకుండా ఎన్‌టీఆర్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బిగ్ బాస్ చూడడం ప్రారంభించారు. ఆ తర్వాత సీజన్‌లోకి నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. కానీ నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో.. అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా వచ్చింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నాని ఒప్పుకోలేదు. ఆ తర్వాత బరిలోకి దిగాడు నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ప్రతీ సీజన్ స్టార్టింగ్‌లో నాగ్ స్థానంలో మరో హీరో బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించనున్నాడు అంటూ రూమర్స్ వస్తాయి. కానీ అవేవి నిజం కాదని చివర్లో తెలుస్తుంది. బిగ్ బాస్ 7 విషయంలో కూడా అదే జరిగింది.
Also Read: 'ఖుషి' నడుము సీన్‌కు అరుపులే - 'భోళా శంకర్' చూసిన ఆడియన్స్ ఏమంటున్నారంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial