BIGG BOSS Season 9 Call For Entries: ఫేమస్ టీవీ రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 త్వరలోనే రాబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఫన్, గేమ్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా... తాజాగా నాగార్జున మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు.
సామాన్యులకు ఎంట్రీ... ఇదీ ప్రాసెస్
ఇప్పటివరకూ ఈ షోలో పలువురు సెలబ్రిటీలు, టీవీ షోస్‌లో పాపులర్ అయిన వాళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటెస్టెంట్స్‌గా ఉండేవాళ్లు. ఇప్పుడు ఈ షోలో సామాన్యులకు సైతం ఎంట్రీ లభించనుంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వారికి కూడా టీం ఆహ్వానం పలుకుతోంది.
దీని కోసం 'bb9.jiostar.com' వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేయించుకోవాలి. ఆ తర్వాత... అసలు 'బిగ్ బాస్ 9'లో ఎందుకు పాల్గొనాలనుకుంటున్నారో కారణం చెబుతూ వీడియో అప్ లోడ్ చేయాలి. కండీషన్స్ మేరకు హౌస్ మేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
రిటర్న్ గిఫ్ట్
'బిగ్ బాస్' అభిమానులకు ఇది రిటర్న్ గిఫ్ట్ అంటూ కింగ్ నాగార్జున తెలిపారు. 'ఇప్పటివరకూ మీరు బిగ్ బాస్‌ను ఎంతగానో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు... రిటర్న్ గిఫ్ట్‌గా ఏమివ్వాలి? బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈసారి హౌస్‌లోకి సెలబ్రిటీలే కాదు. మీకు కూడా ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ తలుపులు మీ కోసం తెరచి ఎదురు చూస్తున్నాయి. వచ్చేయండి.' అంటూ నాగార్జున అనౌన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: 'కాంటా లగా' గర్ల్ షఫాలీ మృతికి అసలు రీజన్ ఏంటి? - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా!
ఈసారి రణరంగమే...
ఇటీవలే 'బిగ్ బాస్' సీజన్ 9పై అప్డేట్ ఇస్తూ నిర్వాహకులు స్పెషల్ వీడియో అనౌన్స్ చేశారు. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంతకు ముందు హోస్ట్‌గా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ వస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. అయితే... నాగార్జునే మళ్లీ హోస్ట్‌గా వ్యవహరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. 'ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు కోసం యుద్ధం కాదు. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే.' అంటూ హైప్ క్రియేట్ చేశారు నాగ్.
కంటెస్టెంట్స్ వీళ్లేనా...
ఇప్పటికే పలువురు టీవీ, మూవీ యాక్టర్స్‌తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఒప్పందాలు, స్క్రూటినీ తర్వాత హౌస్‌లో పాల్గొనే వారి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తాజాగా సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఇస్తుండడంతో సీజన్ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది.