బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో గొడవలు, మనస్పర్థలు సహజం. కానీ దానివల్ల శారీరికంగా ఒక కంటెస్టెంట్ మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు. కానీ తాజాగా జరిగిన ఒక టాస్కులో తేజ ప్రవర్తన వల్ల గౌతమ్‌‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. తేజ చేసిన ఆ పనికి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా హ్యాపీ లేరు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, అసలు తేజ ప్రవర్తనపై నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారా అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురుచూశారు. చాలామంది ఊహించినట్టుగానే నాగార్జున.. తేజ ప్రవర్తన గురించి ప్రస్తావన తీసుకొనిరావడం మాత్రమే కాకుండా తనకు ఒక శిక్షను కూడా విధించారు. 


సంచాలకులు ఫెయిల్..
పవర్ అస్త్రా కోసం జరిగిన స్మైల్ ప్లీజ్ టాస్క్‌లో గౌతమ్‌పై అటాక్ చేశాడు తేజ. కానీ అది మరీ శరీరంపై గాయాలు అయ్యేవరకు వెళ్లింది. అది కరెక్ట్ కాదని ఇతర కంటెస్టెంట్స్ అరుస్తున్నా కూడా తేజ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన ఆట తను ఆడుకుంటూ వెళ్లిపోయాడు. ఈ విషయంపై నాగార్జున సైతం సీరియస్ అయ్యారు. ముందుగా తేజ అలా ప్రవర్తిస్తున్నప్పుడు, గౌతమ్‌ను హర్ట్ చేస్తున్నప్పుడు సంచాలకులుగా శివాజీ, సందీప్ సైలెంట్‌గా ఉండడంపై మండిపడ్డారు. సందీప్‌తో నీకు కళ్లు కనిపించవా అని ప్రశ్నించారు. శివాజీ కూడా అసలు సంబంధం లేనట్టుగా నిలబడ్డావని సీరియస్ అయ్యారు. అంతే కాకుండా గౌతమ్.. తేజపై అటాక్ చేసే క్రమంలో గొంతు మీద కొట్టొద్దు అని శివాజీ అరిచాడు కానీ తేజ.. గౌతమ్‌కు అలా చేస్తున్న సమయంలో మాత్రం మాట కూడా మాట్లాడలేదని వీడియో ప్రూఫ్‌ను చూపించారు నాగార్జున.


నాగార్జున సీరియస్..
తేజ.. తాను చేసింది తప్పే కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా నిలబడ్డాడు. నాగార్జున.. తనతో మాట్లాడడం మొదలుపెట్టగానే తప్పు తనదే అని ఒప్పుకున్నాడు కూడా. గేమ్ గెలవాలి అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నానని, తాను ఏం చేస్తున్నానో తనకు అర్థం కాలేదని చెప్పాడు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ అరుస్తున్నప్పుడు.. అది తను ఎంకరేజ్‌మెంట్‌లాగా తీసుకున్నానని అన్నాడు. మెల్లగా రియలైజ్ అయ్యి ఆపేశాను అంటూ తేజ చెప్పిన మాటలకు నాగార్జున సీరియస్ అయ్యారు. తేజ చేసింది పూర్తిగా తప్పు అన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. అంతే కాకుండా తనకు శిక్ష వేయాలని డిసైడ్ అయ్యారు.


జైలు శిక్ష ఖరారు..
తేజకు శిక్ష వేద్దామని నిర్ణయించుకున్న నాగార్జున.. ఏ శిక్ష వేస్తే బాగుంటుంది అంటూ ఇతర కంటెస్టెంట్స్‌ను అడగడం మొదలుపెట్టారు. ముందుగా శుభశ్రీ జైల్‌లో వేయాలి అని చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక.. జైలు అయితే సరిపోదు కానీ వేరే ఆప్షన్ లేదు కాబట్టి అది ఓకే అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. సందీప్ అయితే ఏకంగా తేజను ఎలిమినేట్ చేయాలని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు.. ప్రేక్షకులు అని క్లియర్‌గా చెప్పేశారు నాగార్జున. అలా అయితే సంచాలకులుగా ఉన్న శివాజీ, సందీప్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సిందే అని అన్నారు. మొత్తంగా కంటెస్టెంట్స్‌లో ఎక్కువమంది తేజకు జైలు కరెక్ట్ అన్నారు కాబట్టి తేజకు జైలు శిక్షను ఖరారు చేశారు నాగార్జున. అంతే కాకుండా గౌతమ్ ఏం పని చెప్పినా చేయాలని తీర్పునిచ్చారు. వచ్చేవారం నామినేషన్స్‌లో కూడా తేజ ఉంటాడని స్పష్టం చేశారు.


Also Read: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial