బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. నాలుగో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. వారే శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇప్పటివరకు జరిగిన పవర్ అస్త్రా పోటీల్లో కంటెండర్స్‌ను వెనక్కి లాగడానికి, వారు ఓడిపోయేలా చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈసారి బిగ్ బాస్ స్వయంగా కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో రతిక, అమర్‌దీప్ రంగంలోకి దిగారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ వారు చేసిన వ్యాఖ్యలు కాస్త శృతిమించినట్టుగా ఉన్నాయని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు.


ముందుగా బిగ్ బాస్‌లో నాలుగో పవర్ అస్త్రా కోసం ప్రిన్స్ యావర్, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్‌‌కు ‘పట్టు వదలకు డింబకా’ అనే ఛాలెంజ్‌ను ఇచ్చారు. ఈ ఛాలెంజ్‌లో ముగ్గురు కంటెండర్స్.. పవర్ అస్త్రాను పట్టుకొని నిలబడాలి అని చెప్పారు. శివాజీని ఈ టాస్కును సంచాలకులుగా నియమించారు. ముందుగా శివాజీ.. కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేయవద్దని రూల్ పెట్టారు. కానీ కాసేపటికి ఇతర కంటెస్టెంట్స్.. తమకు కావాల్సిన కంటెండర్‌కు సపోర్ట్ చేస్తూ మిగిలిన కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేయవచ్చని చెప్పారు. దీంతో ఇతర కంటెస్టెంట్స్ అంతా చాలా ఎగ్జైట్ అవుతూ రంగంలోకి దిగారు. 


డిస్టర్బ్ చేయడానికి అమర్, రతిక ప్రయత్నం


ముందుగా శుభశ్రీని, ప్రిన్స్ యావర్‌ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించారు అమర్‌దీప్, రతిక. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు. ‘‘నిన్ను అక్క అని ఎందుకు అన్నాడు’’ అంటూ ప్రశాంత్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు అమర్‌దీప్. ఆ ప్రశ్నకు సమాధానంగా ‘‘ఏమో ఆయననే అడుగు. ఆయన అపరిచితుడు. ఎప్పుడు ఏ రిలేషన్ ఉంటుందో తెలియదు.’’ అని రతిక చెప్పింది. మరి లేడీ లక్ అని బెల్ట్ వేశాడు, నువ్వు నాది అన్నాడు, అక్కడ రాశాడు, మరి అక్క అని ఎందుకు అన్నాడు అని పాత విషయాలను గుర్తుచేశాడు అమర్. ‘‘అక్క అని ఎందుకు అన్నావో చెప్పురా ప్లీజ్’’ అని ప్రశాంత్‌ను డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. దానికి ప్రశాంత్ చాలా పొగరుగా రియాక్షన్ ఇచ్చాడు. ‘‘చూస్తున్నారుగా చూడండి’’ అంటూ కెమెరాను చూసి ప్రేక్షకులతో చెప్పాడు.


నోరుజారిన రతిక


కాసేపు యావర్‌ను, శుభశ్రీని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించిన అమర్‌దీప్, రతిక.. తిరిగి పల్లవి ప్రశాంత్ వైపే వచ్చారు. అక్క అని ఎందుకు అన్నావంటూ పదే పదే అదే ప్రశ్న అడిగాడు అమర్. ‘‘అది వాడి ఇష్టం’’ అని సమాధానమిచ్చాడు శివాజీ. దానికి అమర్, రతిక ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. సంచాలకులు మాట్లాడకూడదు అని గట్టిగా చెప్పారు.  ఆ తర్వాత ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ.. ‘‘ఆయన బుర్రలో మన్ను, మశానం ఉంది. అందుకే ప్రతీ వారం రిలేషన్స్ మార్చేస్తాడు’’ అని నవ్వుతూ చెప్పింది రతిక. నా ప్రాపర్టీ అంటూ ప్రశాంత్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలను హేళన చేశారు. అలా ఉండి ఇప్పుడు అక్క అంటుంటే ఎలా ఒప్పుకున్నావు, సిగ్గుందా అని రతికను ప్రశ్నించాడు అమర్.


‘‘ఆయనకు సిగ్గుండాలి. నాకు ఉంది’’ అని సమాధానమిచ్చింది రతిక. దానికి ప్రశాంత్.. మౌనంగా ఉన్నా.. ‘‘నాకు ఉంది. నీకు లేదు అంటున్నాడు’’ అని కామెడీ చేశాడు అమర్. ప్రశాంత్ మౌనంగా ఉండడం చూసిన రతిక.. సమాధానం లేదు కాబట్టి మాట్లాడడం లేదని కౌంటర్ ఇచ్చింది. ప్రశాంత్ మీసం తిప్పగా.. ‘‘ఏం పీక్కుంటావో పీక్కో’’ అంటున్నాడు అన్నాడు అమర్. పక్కకి దొబ్బేయ్ అంటున్నాడని అన్నాడు. ‘‘నీ మాట మీద నీకు క్లారిటీ ఉండదా. సిగ్గు లేదా నీకు. ఇలాగేనా నిన్ను పెంచింది ఇంట్లో. బుద్ధుందా ఒక అమ్మాయితో ఇలాగేనా ప్రవర్తించేది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట నీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తావా. నోట్లో నుండి మాట వచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడు. మజాక్ కూడా ఏం లేదు. మీసాలు, గడ్డాలు ఉన్నా వేస్టే.’’ అని ప్రశాంత్‌ను ఉద్దేశిస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడింది రతిక.


Also Read: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial