బిగ్ బాస్ సీజన్ 7లో శోభాశెట్టికి, ప్రిన్స్ యావర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటాదనే సంగతి తెలిసిందే. అయితే, శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్రిన్స్ యావర్.. తన గురించి, తన కుటుంబం గురించి, తన ఆర్థిక పరిస్థితి గురించి శోభా శెట్టితో షేర్ చేసుకున్నాడు.
శోభాతో కష్టాలు పంచుకున్న యావర్
ప్రిన్స్ యావర్.. ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడు సీరియల్స్‌లో నటుడిగా సెటిల్ అయ్యాడు. అయినా కూడా తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని తాజాగా బయటపెట్టాడు. తనకు డబ్బులు చాలా అవసరమని, అందుకే ఇలా ఉన్నానంటూ శివాజీతో చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోసారి తన జీవిత కథను శోభాశెట్టితో షేర్ చేసుకున్నాడు ప్రిన్స్ యావర్. తన అన్నపై ఆర్థికంగా ఆధారపడ్డానని యావర్ ఇప్పటికే బయటపెట్టాడు. శోభా శెట్టితో కూడా మరోసారి అదే విషయాన్ని చెప్పాడు. తన అన్న దగ్గర కూడా డబ్బులు లేవని, తన జీతం అంతా అయిపోయిందని, ఎంత ప్రయత్నించినా తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని తన ఆర్థిక కష్టాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు ప్రిన్స్ యావర్.
అలా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాను
బిగ్ బాస్‌కు వచ్చే ముందు 30వ తారీఖు తన అన్నకు జీతం వచ్చిందని, ఆ డబ్బులతోనే షాపింగ్‌కు వెళ్లామని చెప్పుకొచ్చాడు ప్రిన్స్ యావర్. అలా షాపింగ్‌కు వెళ్లి తెచ్చుకున్న బట్టలతోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చానని అన్నాడు. ‘‘అందుకే నాకు కోపం లేదు. ఆ ఆకలి మాత్రమే ఉంది. మీరంతా ఆరోజు అలా అనుకున్నారు కానీ నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యం మాత్రమే అది కాదు. ఆ టాస్క్ అయిపోవడం కోసం నేను ఎదురుచూశాను అంతే. శివన్న పిలవగానే లోపలికి వచ్చేశాను. కానీ మీరు వేరేలాగా ఆలోచించారు.’’ అంటూ తన గురించి క్లారిటీ ఇచ్చాడు ప్రిన్స్ యావర్. దీంతో శోభా శెట్టి చాలా ఫీల్ అయ్యి.. నువ్వు చాలా ఇన్‌స్పైరింగ్ అని చెప్తూ.. యావర్‌ను హగ్ చేసుకుంది. గ్రేట్ అంటూ ప్రశంసించింది.
ట్రోఫీ కొట్టుకొని వెళ్లాలి
ప్రిన్స్ యావర్‌ను హగ్ చేసుకున్న తర్వాత ఎమోషనల్ అయ్యింది శోభా శెట్టి. ‘‘నువ్వు గ్రేట్. ఇక్కడ నువ్వు ఉండాలి. ఆడాలి. ట్రోఫీ కొట్టుకొని బయటికి వెళ్లాలి.’’ అని మోటివేషన్ ఇచ్చింది. ప్రిన్స్ యావర్‌కు, శోభా శెట్టికి ముందు నుండి అంత సాన్నిహిత్యం ఏమీ లేదు. కానీ హౌజ్‌లో యావర్ తనకు నచ్చుతాడని పలు సందర్భాల్లో బయటపెట్టింది శోభా. అంతే కాకుండా మూడో పవర్ అస్త్రా కోసం యావర్, శోభా, ప్రియాంక పోటీపడిన సమయంలో యావర్‌ను టార్గెట్ చేసి అడ్డు తొలగించారు ప్రియాంక, శోభా. ఆ ఓటమిని ఒప్పుకోని యావర్.. కోపంతో ఊగిపోయిన సమయంలో కూడా శోభా వెళ్లి తనకు హగ్ ఇచ్చి తనను కూల్ చేసే ప్రయత్నం చేసింది.
Also Read: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial