బిగ్ బాస్ సీజన్ 7లో చూస్తుండగానే.. నాలుగో వారం కూడా వచ్చేసింది. ఇక ఈ నాలుగు వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ప్రేక్షకులు అప్పుడే గెస్ చేయడం మొదలుపెట్టారు. నాలుగో వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, తేజ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, గౌతమ్, రతిక ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన ఎలిమినేషన్స్‌లో ముగ్గురు ఆడవారే ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగో వారంలో కూడా ఒక అమ్మాయే డేంజర్ జోన్‌లో ఉందని టాక్ వినిస్తోంది. చివరిగా డేంజర్ జోన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండగా.. అది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అని సమాచారం. ఈ ఇద్దరిలో లేడీ కంటెస్టెంటే ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరే
బిగ్ బాస్‌లోని రెండో వారంలో టేస్టీ తేజ, షకీలా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. ఆ సమయంలో తేజ సేవ్ అయ్యి.. షకీలా ఎలిమినేట్ అయ్యారు. అప్పటినుండి తేజ.. నామినేషన్స్‌లోకి వస్తే.. ఎలిమినేట్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. బయట ఉన్నవారు మాత్రమే కాదు.. బిగ బాస్ కంటెస్టెంట్స్ కూడా తేజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. తనతో పాటు రతిక కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం. టేస్టీ తేజ, రతిక.. ఈ ఇద్దరూ అవసరం లేనప్పుడు హౌజ్‌లో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కానీ పూర్తిస్థాయిలో ఆటను ప్రదర్శించడం లేదని కొందరు ప్రేక్షకులు మండిపడుతున్నారు. అందుకే బిగ్ బాస్ నాలుగో వారంలో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.
ఆ విషయంలో నెగిటివిటీ
రతిక.. బిగ్ బాస్ సీజన్ 7లోని కంటెస్టెంట్స్‌లో అత్యంత అందమైన లేడీగా అడుగుపెట్టింది. అందుకే తనను చూసిన మొదటిరోజే పల్లవి ప్రశాంత్.. తనకు ఫిదా అయిపోయాడు. తనకు లేడీ లక్ అని ట్యాగ్ కూడా ఇచ్చేశాడు. అంతే కాకుండా తన మాటలు నచ్చడంతో.. ఇతర కంటెస్టెంట్స్‌ను పట్టించుకోకుండా రతికతోనే క్లోజ్ అయ్యాడు. కానీ ఒకవారం నామినేషన్స్ సమయం వచ్చేసరికి ప్రశాంత్‌కు పూర్తిగా రివర్స్ అయ్యింది రతిక. పల్లవి ప్రశాంత్‌కు తనపై ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసి తనను రిజెక్ట్ చేయడం మంచి పనే అయినా కూడా రతిక డీల్ చేసిన పద్ధతి కరెక్ట్ కాదని చాలామంది ప్రేక్షకులు భావించారు. అక్కడినుండి తనకు ప్రేక్షకుల్లో మరింత నెగిటివిటీ పెరిగిపోయింది.
ఓట్లు పడడం లేదు
పల్లవి ప్రశాంత్‌ను దూరం పెట్టిన తర్వాత కొన్నాళ్ల వరకు ప్రిన్స్ యావర్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది రతిక. దీంతో అప్పటివరకు తనపై ఉన్న నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. మామూలుగా రతిక.. ఇంట్లో టాస్కులు ఆడదు, పనిచేయదు.. కేవలం రెడీ అయ్యి అటు, ఇటు తిరుగుతుంది అని చాలామంది నెటిజన్లు తనపై తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అందంగా అనిపించినా కూడా తన ఆటతీరు చూసిన ప్రేక్షకులు తనకు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 7లోని నాలుగో వారంలో రతిక ఎలిమినేషన్ పక్కా అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.
Also Read: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌పై రతిక చెత్త కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial