హరితేజ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అసవరం లేదు. ఓవైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై సత్తా చాటుతోంది. యాంకర్ గానూ అలరిస్తోంది. తెర మీదే కాదు, వెర వెనుక కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. బుల్లితెర షోలలో అదిరిపోయే కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతుంది. కామెడీ అంటే కామెడీ, సీరియస్ అంటే సీరియస్, పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తుంది. ‘అఆ’ సహా పలు సినిమాల్లో చక్కటి కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. అటు బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. టైటిల్ గెలవకపోయినా, టాప్ 5 కంటెస్టెంట్లలో ప్లేస్ దక్కించుకుంది. ఈ షోతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఆస్ట్రేలియా వెకేషన్ లో బిగ్ బాస్ హరితేజ
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ తో కాకుండా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడుపుతోంది. తనకో పాప ఉన్నా, ఆమెను ఫ్యామిలీ దగ్గరే వదిలేసి మరీ హాలీడే ట్రిప్ లో జల్సా చేస్తోంది. గత కొద్ది రోజులుగా కంగారూ దేశంలోనే గడుపుతోంది. చిట్టిపొట్టి డ్రెస్సుల్లో నెటిజన్లను అలరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్
నెటిజన్లతో ఇంటరాక్షన్ అవుతున్న హరితేజకు ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్న వేశాడు. మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని క్వశ్చన్ చేశాడు. ఈ ప్రశ్నకు హరితేజ షాక్ అయ్యింది. అయితే, కోపం తెచ్చుకోకుండా, నవ్వుతూ చాలా హుందాగా సమాధానం చెప్పింది. నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేలా ఉన్నారే అని కామెంట్ పెట్టింది. దీనికి తన భర్త దీపక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. విడాకుల ప్రశ్నకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
2015లో దీపక్ తో హరితేజ వివాహం
హరితేజ 2015లో పెళ్లి చేసుకుంది. కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకుంది. వీరికి 2021లో కూతురు జన్మించింది. ఆమెకు భూమి అనే పేరు పెట్టారు. బిడ్డ పుట్టాక హరితేజ కొద్దిగా లావు అయ్యింది. ఆ తర్వాత బరువు తగ్గించుకునేందుకు చాలా కష్టపడింది. డైటింగ్ తో పాటు జిమ్ చేస్తూ మళ్లీ స్లిమ్ గా మారింది. తాజాగా ఆస్ట్రేలియా వెకేషన్ లో ఆనందంగా గడుపుతోంది. ఇక తెలుగులో ‘అఆ’, ‘యూ టర్న్’, ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘ప్రతిరోజు పండగే’ లాంటి సినిమాల్లో చక్కటి నటనతో అలరించింది. సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
Read Also: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
Read Also: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!