బిగ్ బాస్ సీజన్ 7లో పవర్ అస్త్రా అనే కొత్త అంశం మొదలయ్యింది. ఈ పవర్ అస్త్రాను సాధించిన వారు మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ అని, మిగతావారు కేవలం కంటెస్టెంట్స్ అని నాగార్జున ముందే క్లారిటీ ఇచ్చారు. అందుకే ఈ పవర్ అస్త్రా కోసం పోటీపడమని 14 మంది కంటెస్టెంట్స్‌కు చెప్పారు. అలా రెండోవారం పవర్ అస్త్రా కోసం జరిగిన పోటీలో శివాజీకి అస్త్రం లభించింది. అయితే తను పక్షపాతంగా ఉన్నడంటూ కంటెస్టెంట్స్ అంతా తనను హౌజ్‌మేట్‌గా ఉండడానికి అనర్హుడు అని ప్రకటించారు. హౌజ్ అంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయంతో శివాజీ తన పవర్ అస్త్రాని కోల్పోయాడు. దీంతో తిరిగి కంటెస్టెంట్ అయ్యి నామినేషన్స్‌లో నిలబడ్డాడు. దీంతో తన పవర్ అస్త్రా పోవడానికి కారణమయిన కంటెస్టెంట్స్‌పై తను పగ పెంచుకున్నాడని నేటి (అక్టోబర్ 2) జరిగిన నామినేషన్స్‌లో స్పష్టంగా కనిపించింది. 


శివాజీ చెప్పిన కథ..
అందరికంటే ముందుగా నామినేషన్స్ వేయడానికి వచ్చిన శివాజీ.. కంటెస్టెంట్స్ పేర్లు చెప్పకుండా వారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘మొదటినుండి, ఈ హౌజ్‌కు వచ్చిన దగ్గర నుండి నేను గమనించింది సీజన్ 7కు వచ్చేటప్పుడు మీరు ముందే మాట్లాడుకొని, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఆడే విధానం నాకు రెండోరోజే అర్థమయిపోయింది.’’ అంటూ పలువురిని ఉద్దేశించి వ్యాఖ్యనించాడు. ఆ తర్వాత మీకొక కథ చెప్తా అంటూ కథను ప్రారంభించాడు. నలుగురు దొంగలు, బ్యాంకు రాబరీ అంటూ ‘జులాయి’ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘సీజన్ 7లో కూడా అలాగే జెంటిమెన్‌లాగా ఇక్కడికి వచ్చి, వచ్చిన తర్వాత తప్పుడు ఆట ఆడడం మొదలుపెట్టారు. అది కరెక్ట్ కాదు.’’ అంటూ పేర్లు చెప్పకుండా కొందరిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శివాజీ.. ముందుగా అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు.


శివాజీ వర్సెస్ అమర్‌దీప్..
‘‘ప్రతీసారి అమర్.. అన్నా నువ్వు చూడట్లేదు అన్నాడు. ఆ తర్వాత క్రమంగా వాడికి నెగిటివ్ అభిప్రాయం నా మీద. నిన్న అడిగినదానికి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదు’’ అంటూ తనను హౌజ్‌మేట్‌గా అనర్హుడు అని అమర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే దానికి కారణం యాక్టివిటీ రూమ్‌లో చెప్పానని, మళ్లీ బయట కూడా చెప్పడం ఎందుకు అని చెప్పలేదని అన్నాడు అమర్. ఇక గతవారం శివాజీ జడ్జిగా ఉన్నప్పుడు జరిగిన నామినేషన్స్ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. తను పక్షపాతంగా లేనని వాదించడం మొదలుపెట్టాడు. బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ సమయంలో అందరినీ సమానంగా చూశానని, అప్పుడు ప్రియాంకకే ఎక్కువ కాయిన్స్ ఇచ్చానని గుర్తుచేశాడు. కానీ అమర్‌దీప్ మాత్రం శివాజీ చెప్పిన ఈ పాయింట్‌కు ఒప్పుకోలేదు. మధ్యలో యావర్ పేరును తీసుకొచ్చాడు. దీంతో యావర్.. సందీప్ పక్షపాతంగా ఉన్నాడని, తను కూడా ఇతర కంటెస్టెంట్స్‌కు ఎక్కువ కాయిన్స్ ఇచ్చానని పాయింట్ చెప్పబోయాడు. దీంతో అమర్, శివాజీ నామినేషన్స్ మధ్యలో యావర్, సందీప్‌కు కాసేపు వాగ్వాదం జరిగింది. 


ప్రియాంక వర్సెస్ శివాజీ..
శివాజీ, అమర్‌దీప్ నామినేషన్స్ సమయంలో ఒకరినొకరు పక్షపాతి అని ప్రూవ్ చేయడానికే సరిపోయింది. దానిపైనే ఎక్కువగా వాగ్వాదం జరిగింది. చివరిగా అమర్ చిన్నపిల్లాడు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ‘‘నువ్వు చాలా తెలివైనదానివి. కానీ ఎవరి గురించైనా అడిగినప్పుడు చెప్పడానికి సంకోచిస్తావు’’ అంటూ ప్రియాంకపై ఆరోపణలు చేశాడు శివాజీ. దానికి ప్రియాంక ఒప్పుకోలేదు. అంతే కాకుండా హౌజ్‌మేట్‌గా తాను అనర్హుడు అని ఆలోచించకుండా చెప్పేసిందని అన్నాడు. దానికి ప్రియాంక ‘‘నేను రతికలాగా బ్లైండ్‌గా ఎత్తలేదు’’ అని క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. తన వర్షన్ చెప్పే ప్రయత్నం చేసింది. దానికి సమాధానంగా శివాజీ.. ‘‘బిగ్ బాస్ ప్రైజ్ గెలవడానికి రాలేదు. ఆడియన్స్ మనసు గెలవడానికి వచ్చాను’’ అన్నాడు. ఆ మాటకు ప్రియాంక వ్యంగ్యంగా నవ్వింది. ఈసారి జరిగిన నామినేషన్స్‌లో హైలెట్ అయిన పాయింట్ ఏంటంటే.. అమర్‌దీప్‌ను నామినేట్ చేసిన చాలామంది కంటెస్టెంట్స్ ప్రియాంకను కూడా నామినేట్ చేశారు. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్‌ను హైలెట్ చేస్తూ గ్రూపులుగా ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. నామినేషన్స్ అంతా పూర్తయిన తర్వాత బిగ్ బాస్ కూడా తొండి ఆడుతున్నాడు అంటూ శివాజీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతా గ్రూపులుగా ఆడుతున్నారని శుభశ్రీ చేసిన ఆరోపణలపై తేజా స్పందిస్తూ.. బయట అల్రెడీ పరిచయాలున్న వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే అది గ్రూప్ కాదని, హౌస్‌లోకి వచ్చిన తర్వాత గ్రూపుగా విడిపోయి కుట్రలు పన్నితేనే గ్రూపిజం అంటారంటూ ‘గ్రూప్స్’కు అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు.


Also Read: శ్రీదేవిది సహజ మరణం కాదు, అప్పట్లో పన్ను విరిగిందని నాగార్జున చెప్పారు: బోనీ కపూర్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial