ప్రతీసారిలాగానే ఈసారి కూడా బిగ్ బాస్ నామినేషన్స్ చాలా వాడివేడిగా జరిగాయి. కంటెస్టెంట్స్ తమ ఫోటో ఉన్న కత్తిని తీసుకొని.. తాము నామినేట్ చేయాలనుకుంటున్న వారి వేయిస్ట్‌లో పొడవాలి. ఇక ఈ నామినేషన్స్‌కు సంబంధించిన రెండో ప్రోమో విడుదలయ్యింది. నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవ్వగానే కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చారు. ‘మీ హక్కుకు ఉన్న విలువను గ్రహించి, సరైన కారణాలు చెప్పి నామినేట్ చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు’ అని ప్రకటించారు బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుండి నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ చెప్పే కారణాలు సిల్లీగా ఉన్నాయని ఎప్పటికప్పుడు బిగ్ బాస్ వార్న్ చేస్తూనే ఉన్నారు. మరోసారి తాజాగా అదే విషయాన్ని గుర్తుచేశారు.


కథ వినిపించిన అమర్‌దీప్.. సామెత చెప్పిన శివాజీ..
నామినేషన్స్ ఎపిసోడ్‌కు సంబంధించి విడుదలయిన ప్రోమోలో ముందుగా అమర్‌దీప్.. శివాజీని నామినేట్ చేయడానికి ముందుకు వచ్చాడు. తన కారణాన్ని చెప్పడంకంటే ముందుగా అందరికీ ఒక కథను వినిపించాడు. ‘‘ఒక అన్న, ఒక తమ్ముడు ప్లాన్ వేసి బ్యాంకు దోపిడికి వెళ్లారు. కానీ ఒకడు ఏం చేశాడంటే.. అందరినీ చంపుకుంటూ వచ్చి, ఆ ఒకడే బయటికి వచ్చాడు. గేమ్‌లో ఒకడే బయటికి వస్తాడు’’ అంటూ తన అభిప్రాయాన్ని ఒక కథ రూపంలో చెప్పాడు అమర్‌దీప్. కథ అంతా విన్న శివాజీ.. ‘‘రాజుగారి పెద్ద పెళ్లాం మంచిది అంటే చిన్నపెళ్లాం మంచిది కాదు అని కాదు’’ అంటూ ఒక సామెతతో అమర్‌కు సమాధానమిచ్చాడు శివాజీ.


కరెక్ట్ పాయింట్ చెప్పిన తేజ..
శుభశ్రీ వచ్చి ప్రియాంకను నామినేట్ చేసింది. ‘‘గ్రూప్‌గా ఉంటావు. ఎప్పుడూ మీ వాళ్లే అంటూ ఉంటావు’’ అని ప్రియాంకపై ఆరోపణలు చేసింది. శుభశ్రీ చేసిన ఆరోపణలు నచ్చని ప్రియాంక సీరియస్ అయ్యింది. ఏ గ్రూపు పేర్లు చెప్పు అంటూ సీరియస్ అయ్యింది. అయితే నీకు తెలుసు కదా అని శుభశ్రీ సమాధానమిచ్చింది. ‘‘నాకు తెలీదు’’ అని ప్రియాంక ఎదురు మాట్లాడింది. ‘‘నాకు అనిపించింది చెప్తున్నా’’ అని శుభశ్రీ.. తన అభిప్రాయాన్ని సమర్ధించుకుంది. ‘‘నీకు అనిపించింది ప్రతీది కరెక్ట్ ఉంటుంది అని నువ్వు అనుకుంటావు కానీ అది కరెక్ట్ కాదు’’ అని ప్రియాంక.. తన అభిప్రాయాన్ని తిప్పికొట్టింది. టేస్టీ తేజ.. స్మైల్ ప్లీజ్ టాస్క్‌లో చేసిన తప్పులకు నేరుగా నామినేట్ అయ్యాడు. తనను ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరం లేకపోయినా.. తను మాత్రం తనకు నచ్చని కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయడానికి ముందుకొచ్చాడు. ‘‘ముగ్గురు లేదా నలుగురు కంటెస్టెంట్స్.. నామినేషన్స్ కంటే ముందు వీరిని నామినేట్ చేద్దాం. అలా చేస్తే మనకు ఫేవర్ అవుతుంది అని మాట్లాడుకుంటే అది గ్రూపిజం’’ అంటూ గ్రూపుల అర్థాన్ని కరెక్ట్‌గా వివరిస్తూ.. గౌతమ్, యావర్‌లను నామినేట్ చేశాడు. 


బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్..
అమర్‌దీప్.. శివాజీతో పాటు శుభశ్రీని కూడా నామినేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నావంటూ వ్యాఖ్యలు చేశాడు. ఎలా సేఫ్ గేమ్ ఆడుతున్నానో చెప్పమని శుభ ప్రశ్నించింది. ‘‘నాకు రైట్ అనిపించింది, నీకు తప్పు అనిపించింది. నాకు తప్పు అనిపించింది, నీకు రైట్ అనిపించవచ్చు’’ అని అమర్‌దీప్ సమాధానం ఇచ్చాడు. ‘‘ఇప్పుడు కూడా అవమానించారు’’ అంటూ అమర్‌పై వ్యాఖ్యలు చేసింది శుభ. ఇక యావర్ కూడా ‘‘నాకు శివన్న ఏం ఫేవరిజం చేశాడు చెప్పండి’’ అంటూ కంటెస్టెంట్స్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రోమో చివర్లో ‘‘కంటెస్టెంట్స్‌గా ఉన్న మీలో ఇంటిసభ్యులు అయ్యేది ఎవరు, ఇంటి నుండి బయటికి వెళ్లేది ఎవరు అనే నిర్ణయం..’’ అని చెప్తూ బిగ్ బాస్ ఆపేశారు. దీంతో అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది.



Also Read: బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఆ ఏడుగురు - ఈసారి డేంజర్ జోన్‌లో ఉన్నది వారేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial