బిగ్ బాస్ సీజన్ 7లో తాజాగా సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అంతా పిక్షనరీ గేమ్ ఆడుతూ భలే ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు కూడా. దాంతో పాటు ఒక్కొక్కరిని నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్లారు నాగార్జున. ఇక ఈ బిగ్ బాస్ సండే ఫన్‌డేలో కంటెస్టెంట్స్ చేతికి కొన్ని జంతువుల గుర్తులను ఇచ్చి, వాటికి తగిన అర్థాలు చెప్పి.. హౌజ్‌లో ఆ జంతువు ఎవరు అనుకుంటున్నారో చెప్పమన్నారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరి అభిప్రాయాలు వారు బయటపెట్టారు. అందరూ ఎక్కువగా గుడ్డి గొర్రె అని ట్యాగ్‌ను టేస్టీ తేజకు ఇచ్చారు.


కుక్క, పిల్లి, ఏనుగు, గొర్రె లాంటి జంతువుల గుర్తులను ముందుగా కంటెస్టెంట్స్‌ చేతికి ఇచ్చాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌజ్‌లో ఆ జంతువు ఎవరు అని అనుకుంటున్నారో చెప్పమన్నాడు. ఈ గేమ్‌ను ముందుగా ప్రియాంక ప్రారంభించింది. తన చేతిలో ఉన్న కుక్క గుర్తును తీసుకెళ్లి రతిక మెడలో వేసింది. కుక్క అంటే ఎప్పుడూ మోరుగుతూ ఉంటుందని, అసలు గంట అయినా రెండు గంటలు అయినా ఆపదు అనే ఉద్ధేశ్యంతో తనకు ఆ ట్యాగ్ ఇచ్చానని స్పష్టం చేసింది ప్రియాంక. ఆ తర్వాత దోమ గుర్తును అమర్‌దీప్‌కు ఇచ్చింది శోభా శెట్టి. దోమ అంటూ ఎప్పుడూ రక్తం పీలుస్తుంది అని అర్థం. అలాగే సందర్భం వచ్చినప్పుడు అమర్‌దీప్ తన రక్తం తాగుతాడు అని సింబాలిక్‌గా చెప్పింది శోభా శెట్టి.


సందీప్.. తన చేతిలో ఉన్న గొర్రె గుర్తును తీసుకెళ్లి టేస్టీ తేజ మెడలో వేశాడు. ఇటీవల జరిగిన పవర్ అస్త్రా టాస్క్‌లో గుడ్డి గొర్రెలాగా ప్రవర్తించాడని గుర్తుచేశాడు. అలా అయితే సంచాలకుడిగా నువ్వు కూడా గుడ్డి గొర్రెలాగానే ప్రవర్తించావంటూ నాగార్జున కౌంటర్ వేశారు. దానికి అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తేజ.. ప్రియాంక చెప్పిన కారణమే చెప్తూ.. రతికకు కుక్క అనే ట్యాగ్ ఇచ్చాడు. తనకు రెండుసార్లు కుక్క అనే ట్యాగ్ వచ్చిన తర్వాత అదే ట్యాగ్‌ను ప్రిన్స్ యావర్‌కు ఇచ్చింది రతిక. యావర్ ఎక్కువగా అరుస్తాడు కాబట్టి ఆ ట్యాగ్ ఇవ్వడం కరెక్ట్ అనుకున్నారు ప్రేక్షకులు. 


ఈ గేమ్‌లో యావర్ చేతికి ఏనుగు బొమ్మ వచ్చింది. అంటే కంట్రోల్‌లో ఉండని కంటెస్టెంట్ ఎవరో.. వారి మెడలో ఆ గుర్తును వేయమన్నారు నాగార్జున. దీంతో రతిక మెడలో దానిని వేశాడు. ఇలా రతిక, యావర్ ఒకరికొకరు ట్యాగ్స్ ఇచ్చుకోవడం చూసి అమర్‌దీప్ కాస్త వెటకారం చేశాడు కూడా. ఇక పల్లవి ప్రశాంత్ చేతిలో ఉన్న ఏనుగు ట్యాగ్‌ను అమర్‌దీప్‌కు ఇచ్చాడు. నామినేషన్స్ సమయంలో అమర్‌దీప్ కంట్రోల్ లేకుండా ప్రవర్తించాడని గుర్తుచేశాడు. శుభశ్రీ చేతిలో పిల్లి గుర్తు ఉండగా తనకు హౌజ్‌లో ఎవరు స్వార్థపరులు అనిపిస్తే.. వారికి ఆ ట్యాగ్ ఇవ్వమన్నారు నాగ్. అయితే దానిని తీసుకెళ్లి అమర్‌దీప్‌కు ఇచ్చింది శుభ. పవర్ అస్త్రా కంటెండర్‌షిప్ విషయంలో ఎంతసేపు తనకు రాలేదని బాధపడ్డాడు అందుకే తను స్వార్థపరుడు అని స్వార్థపరుడు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది శుభ. ఇక శివాజీ కూడా గుడ్డి గొర్రె అనే ట్యాగ్‌ను తేజకే ఇచ్చాడు. గౌతమ్ అయితే కంట్రోల్ లేని ఏనుగు అని యావర్‌కు ట్యాగ్ ఇచ్చాడు. గేమ్ విషయంలో యావర్ స్వార్థపరుడు అని అమర్‌దీప్ అన్నాడు.


Also Read: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial