బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి అయిదు వారాలు పూర్తయ్యి.. ఆరో వారం కూడా పూర్తికాబోతోంది. ఇప్పటివరకు ఏ సీజన్‌లో జరగని వింత.. ఈ సీజన్‌లో జరిగింది. ఒకరు తర్వాత ఒకరుగా అందరూ లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, ఆ తర్వాత షకీలా, దామిని, రతిక, శుభశ్రీ.. ఇలా అందరూ బ్యాక్ టు బ్యాక్ లేడీ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయిపోయారు. దీంతో బిగ్ బాస్ హౌజ్.. ఒక బాయ్స్ హాస్టల్‌గా మారిపోయింది. కానీ వెళ్లిపోయిన అమ్మాయిల లోటు తీర్చడానికి మరో ముగ్గురు అమ్మాయిలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఈ ఆరో వారంలో కూడా ఎలిమినేట్ అయ్యేది ఒక లేడీ కంటెస్టెంటే అని టాక్ వినిపిస్తోంది.
నామినేషన్స్‌లో ఎనిమిది మంది
బిగ్ బాస్ సీజన్ 7లో ఆరో వారం నామినేషన్స్‌లో అమర్‌దీప్, నయని పావని, ప్రిన్స్ యావర్, అశ్విని శ్రీ, శోభా శెట్టి, టేస్టీ తేజ, పూజా మూర్తి ఉన్నారు. సందీప్ కూడా నామినేషన్స్‌లో ఉండగా.. గౌతమ్ వచ్చి బిగ్ బాస్.. తనకు ఇచ్చిన సూపర్ పవర్‌తో సందీప్‌ను సేవ్ చేశాడు. దీంతో ఈ వారంలో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎక్కువగా ఎలిమినేట్ అయ్యే అవకాశం శోభా శెట్టికే ఉందని సమాచారం. అందరూ నేను చెప్పినట్టే వినాలి, నాకు నచ్చిందే చేయాలి అనే యాటిట్యూడ్‌తో కంటెస్టెంట్స్‌ను ఇబ్బందులు పెడుతూ.. వారి మీద అనవసరమైన పెత్తనం చూపిస్తోంది శోభా. దీంతో ప్రేక్షకులకు తనపై మెల్లగా విసుగు రావడం మొదలయ్యింది. చిత్రం ఏమిటంటే.. ఈ వారం బయటకు వెళ్లిపోతానేమోనని ఆందోళనతో ఉన్న అమర్ దీప్‌కు అనూహ్యంగా ఓట్లు పడుతున్నాయట. అమర్ ఏ మాస్క్ లేకుండా జెన్యూన్‌గా ఉంటున్నాడనే భావన, అమాయకత్వం వంటివి ఈ ఓటింగ్‌కు కారణమని తెలుస్తోంది.
శోభా శెట్టి, అశ్వినిలపై నెగిటివ్ అభిప్రాయాలు
ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో అశ్వినితో శోభా శెట్టికి జరిగిన వాగ్వాదం వల్ల కూడా తను నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అసలైతే ఈ వాగ్వాదం వల్ల అశ్వినిపై కూడా ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయమే ఏర్పడింది. నామినేషన్స్ సమయంలోనే తను ఏడవడం, నన్ను నామినేట్ చేయండి నేను వెళ్లిపోతాను అంటూ నెగిటివ్‌గా మాట్లాడడం.. ఇవి చాలామంది ప్రేక్షకులకు నచ్చలేదు. పైగా బిగ్ బాస్ హౌజ్‌లో శోభా శెట్టి ప్రవర్తన మాత్రమే తప్పుగా ఉన్నట్టుగా అశ్విని తన వెనుక మాట్లాడడం మొదలుపెట్టింది. అందరితో శోభా అందరినీ ఏమారుస్తుంది అని చెప్పుకొని తిరగడం ప్రారంభించింది అశ్విని.
తక్కువ ఓట్లు గెలుచుకుంది వీరే
ఇక ఆరో వారం ఎలిమినేషన్ విషయానికొస్తే.. శోభా శెట్టి, అశ్విని శ్రీ.. ఈ ఇద్దరిపై ప్రేక్షకుల్లో అంతగా మంచి అభిప్రాయాలు లేవు. అందుకే ఓటింగ్ విషయంలో కూడా వీరిద్దరికే తక్కువ ఓట్లు ఉన్నాయి. వీరిద్దరి తర్వాత అంత తక్కువ ఓట్లు గెలుచుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచింది. మొత్తంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్‌లో ఇప్పటికే పూజా మూర్తి, అశ్విని శ్రీలపై ప్రేక్షకుల్లో నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అర్జున్ బాగా ఆడుతున్నాడు అనుకునేలోపే తను కూడా పల్లవి ప్రశాంత్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తనపై ప్రేక్షకుల్లో ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాడు.
Also Read: హీరోగా అకీరా? కొడుకు సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial