బిగ్ బాస్ సీజన్ 7లో ఆడియన్స్‌లో ఎంటర్‌టైన్ చేయడం కోసం బిగ్ బాస్ కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొత్త రకమైన టాస్కులతో, ఫన్ యాక్టివిటీలతో కంటెస్టెంట్స్‌ను ఖాళీగా కూర్చోనివ్వడం లేదు. అంతే కాకుండా నామినేషన్స్ రూపంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నించినా.. వెంటనే మళ్లీ అందరూ కలిసిపోయారు. అందుకే కంటెస్టెంట్స్ మధ్య అంతకంటే పెద్ద చిచ్చు పెట్టడానికి బిగ్ బాస్ సిద్ధమయ్యాడు. ఇమ్యూనిటీ టాస్క్‌లో ఎవరు విన్నర్ అనే విషయాన్ని కంటెస్టెంట్సే డిసైడ్ చేయాలని రూల్ పెట్టాడు. దీంతో హౌజ్‌లో మరోసారి వాతావరణం అంతా మారిపోయింది. 


ఇమ్యూనిటీ టాస్క్‌లో ట్విస్ట్..
‘ఫేస్ ది బీస్ట్’ అంటూ ఒక ఇమ్యూనిటీ టాస్క్‌ను కంటెస్టెంట్స్ ముందుపెట్టాడు బిగ్ బాస్. అందులో గెలిస్తే ఏకంగా అయిదు వారాల పాటు హౌజ్‌లో ఉండే అవకాశం దక్కుతుందని చెప్పాడు. దానికోసం కంటెస్టెంట్స్ అంతా బాడీ బిల్డర్స్‌తో పోటీపడ్డారు. ఆ టాస్క్‌లో అబ్బాయిల తరపున ఆట సందీప్, అమ్మాయిల తరపున ప్రియంక జైన్ ముందంజంలో ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక మిగతా కంటెస్టెంట్స్ బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేస్తే.. ఇమ్యూనిటీ టాస్క్‌లో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని తెలిపాడు. దీంతో రతిక, శివాజీ.. బిగ్ బాస్ పెట్టిన టాస్క్‌లో విన్ అయ్యి ఆట సందీప్, ప్రియాంక జైన్‌తో తలపడడానికి సిద్ధపడ్డారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఈ నలుగురిలో ఇమ్యూనిటీకి అర్హత లేనివారు ఎవరో కంటెస్టెంట్స్‌నే డిసైడ్ చేయమన్నాడు బిగ్ బాస్. 


రతిక అర్హురాలు కాదు..
రతిక, శివాజీ.. వీరిద్దరూ బాడీ బిల్డర్స్‌తో పోటీపడకుండా నేరుగా ఇమ్యూనిటీ టాస్క్‌కు సెలక్ట్ అయిపోవడం చూసి ఇతర కంటెస్టెంట్స్ తట్టుకోలేకపోయారు. అందుకే రతికను చాలామంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేస్తూ.. ఇమ్యూనిటీకి తను అర్హురాలు కాదంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో చూస్తుంటేనే రతిక ఒకవైపు, మిగతా కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు అన్నట్టుగా అనిపిస్తోంది. మరి ఈ ప్రోమోలోనే ఇంత కాంట్రవర్సీ ఉంటే.. ఎపిసోడ్‌లో ఇంకెంత కాంట్రవర్సీ ఉంటుందో అనుకుంటున్నారు ప్రేక్షకులు.


నోరు అదుపులో పెట్టుకో..
బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ముందుగా శుభశ్రీ వచ్చి.. ‘అందరిలో ఎక్కువగా అనర్హులు రతిక అనిపిస్తోంది’ అంటూ రతికను నామినేట్ చేసింది. ఆ తర్వాత దామిని వచ్చి ‘ఇమ్యూనిటీ టాస్క్‌లో పాల్గొని గెలవలేదు’ అన్న కారణాన్ని చెప్పి రతికను నామినేట్ చేసింది. షకీలా వచ్చి రతిక తనతో కనెక్ట్ అవ్వడం లేదు అన్న విషయాన్ని కారణంగా చూపించింది. ఆ తర్వాత నామినేట్ చేయడానికి వచ్చిన గౌతమ్ కృష్ణ.. ఇతర కంటెస్టెంట్స్ కంటే కాస్త భిన్నంగా ఆలోచించి.. ‘రతికకు ఆల్రెడీ 3, 4 బకెట్స్ పడ్డాయి కాబట్టి నేను శివాజీ దాంట్లో పోసి గేమ్ ఛేంజ్ చేస్తాను’ అంటూ శివాజీని అనర్హుడని ప్రకటించాడు. ఆపై శోభా శెట్టి కూడా రతికనే అనర్హురాలు అని తేల్చింది. టాస్క్ అనగానే వదిలేసి వెళ్లిపోతున్నావంటూ వ్యాఖ్యలు చేసింది. దీనికి రతిక ఒప్పుకోలేదు ‘ఇప్పటినుంచి చూడు’ అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.


తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి శివాజీ తట్టుకోలేక సామెతలు చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న దామిని సీరియస్ అయ్యింది. ‘నిలబడినప్పుడు ఒక కారణం, కూర్చున్నప్పుడు ఒక కారణం’ అంటూ దామినిని ప్రశ్నించింది రతిక. దానికి సమాధానంగా ‘నాకు 100 కారణాలు ఉన్నాయి’ అని దామిని కోపంగా చెప్పింది. ‘దామిని కొంచెం నోరు కంట్రోల్‌లో పెట్టుకో’ అంటూ రతిక వార్నింగ్ ఇచ్చింది. దానికి దామిని ‘అలాగే మేడం’ అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. 






Also Read: లావణ్యా త్రిపాఠికి జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ - పెళ్లికి ముందు ఆ సిరీస్ కంప్లీట్ చేయాలని!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial