Bigg Boss Season 7 Diwali Promo 1 : బిగ్‌బాస్ సీజన్ 7 దీపావళి స్పెషల్ ప్రోమో వచ్చేసింది. మంచి కలర్ఫుల్గా ఈ ఎపిసోడ్ ఉండేలా ప్లాన్ చేసింది బిగ్‌బాస్ టీమ్. సెలబ్రెటీల ఆట, పాటలతో పాటు.. కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీని బిగ్‌బాస్ వేదికపైకి తీసుకువచ్చింది. దీపావళి సెలబ్రేషన్ అంతా.. బిగ్‌బాస్ స్టేజ్ మీదే ఉందా అనేంతగా ఈ ప్రోమోను డిజైన్ చేశారు. ప్రతివారంలా కాకుండా ఈ వారం రాత్రి 7 గంటలకే ఎపిసోడ్ స్టార్ట్ కాబోతుంది. సెలబ్రేటీల ఆటలు, ఫ్రెండ్స్ రాకలు, కాజల్ అగర్వాల్ ఎంట్రీలను ఫ్లాష్‌తో ప్రోమో స్టార్ట్ అయింది. తర్వాత నాగార్జున ఎంట్రీ ఇచ్చారు.
హౌజ్‌మేట్స్‌కి నాగార్జున (King Nagarjuna) హ్యాపీ దివాళీ చెప్పారు. హౌజ్మేట్స్కూడా బ్యూటీఫుల్ ఔట్ఫిట్స్లో కనిపించారు. నాగార్జునకు విష్ చేశారు. ఇవాళ దీపావళి కదా.. నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని వేదికమీదకి పిలుస్తాను అంటూ హౌజ్‌మేట్స్‌కి తెలిపారు. అమర్ బావా అని పిలువగా.. స్టేజ్‌పై ఇమ్మాన్యేల్, అతని ఫ్రెండ్ స్టేజ్ మీదకి వచ్చారు. యావర్ (Yawar)ని ఉద్దేశిస్తూ.. తనకి తెలుగు నేర్పించలేదని నాగ్ ఇమ్మూని అడుగగా.. సార్ అతనికి తెలుగు రాదు. నాకు ఇంగ్లీష్, హిందీ రాదు. అని చెప్పగా.. మరి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎలా అని అడిగితే.. మేము ఫేస్ టైమ్‌లో సైగలు ద్వారా మాట్లాడుకుంటామని ఫన్ చేశాడు.
అమర్(Amar) వాళ్ల మదర్ స్టేజ్ మీదకి రాగా.. నాన్న ఎలా ఉన్నారంటూ అమర్ తల్లిని అడిగాడు. నాన్న బాగానే ఉన్నారు. నువ్వు కప్ కొట్టుకుని వచ్చేవరకు రానంటున్నాడు హైదరాబాద్‌కి అని అమర్ మదర్ తెలిపారు. తర్వాత గౌతమ్ తరపున వచ్చిన వారు.. గౌతమ్ (Doctor Gowtham)అంటే అన్ఫిల్టర్బుల్గా గేమ్ ఆడాలి అశ్వద్ధామలాగా అని తెలిపారు. యావర్ ఫ్రెండ్.. నీవల్ల నేను నాగార్జునగారి కలిసే అవకాశం వచ్చింది. తర్వాత వచ్చిన ఉప్పెన డైరక్టర్ బుచ్చిబాబు.. అర్జున్‌కు రామ్ చరణ్ సినిమాలో నువ్వో సూపర్ క్యారెక్టర్ చేస్తున్నావంటూ భారీ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆఫర్‌తో అర్జున్ ఆనందంతో సతమతమైపోయాడు.
అనంతరం వచ్చిన సోహేల్(Biggboss Sohel).. నాగార్జునతో తనకున్న బిగ్‌బాస్ అనుభవాలు షేర్ చేసుకున్నాడు. సీజన్ 4 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తున్నాను. బిగ్‌బాస్ నుంచి నేను ఇంకా ఎలిమేనేట్ కాలేదంటూ తెలిపాడు. తర్వాత వచ్చిన మానస్ అన్నయ్య అని అర్జున్‌ని పిలవగానే.. అర్జున్ అడ్వాన్స్ మ్యారేజ్ లైఫ్ అని తెలిపాడు. ఇదేంటి అడ్వాన్స్ బర్త్‌డే విన్నాను కానీ మ్యారేజ్ లైఫ్ అని నాగ్ అడుగగా.. పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండరుగా సార్ అని అర్జున్ రిప్లై ఇచ్చాడు. దీంతో నాగార్జున ఫన్నీగా అర్జున్ వైఫ్ పేరుతో అమ్మా.. సురేఖ అంటూ నవ్వులు పూయించాడు. మీ ఆయన ఏమి చెప్పాడో విన్నావా? మ్యారేజ్ తర్వాత హ్యాపీగా ఉండరట.. గుర్తుపెట్టుకో అని నాగ్ ఇమిటేట్ చేశారు.
శోభ ఆంటీ..
శివాజీ (Shivaji Family ) చిన్నకొడుకు, భార్య స్టేజ్ మీదకి వచ్చారు. అస్సలు ఫోన్లో కూడా కాంటాక్ట్‌లో లేకుండా ఎప్పుడూ లేము అంటూ శివాజీ భార్య ఎమోషనల్ అయ్యారు. శివాజీ కొడుకు భోళేని అన్న అని పిలుస్తుంటే.. అన్న కాదురా బాబాయ్ అని శివాజీ తెలిపాడు. కాదు నాన్న.. భోళే హీరో అంటూ తెలిపాడు. తర్వాత శోభను ఆంటీ అంటూ సంభోదించాడు. దీంతో ఆమె మెహం మాడిపోయింది. దీంతో శివాజీ భార్య కలుగజేసుకుని ఆంటీ కాదు అక్క అని చెప్పగా.. మా మమ్మీని ఆంటీని పిలుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. నాగార్జున శివాజీ మీ అబ్బాయికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది కదా అని అడుగగా.. అవును సార్ మా ఇంట్లో నా మీద ఎక్కువ కామెడీ చేసేది వాడే అని చెప్పాడు. నువ్వు నన్ను చూడవా అంటూ శివాజీ భార్య.. శివాజీని అడుగగా.. సార్ నా భార్య ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ ఫస్ట్ టైమ్ బయటకి వచ్చింది.
తండ్రికి సలహా ఇచ్చిన కొడుకు..
తర్వాత శివాజీ కొడుకు నాన్న నువ్వు ఎంత పెద్ద హీరో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శివన్న ఉన్నాడు అంటూ ఎమోషనల్‌గా తెలిపాడు. ఇంకోసారి నీ నోటి నుంచి వెళ్లిపోతా అనే మాట వినపడకూడదు అని తెలుపగా.. నాగార్జున.. శివాజీ ఎప్పుడైనా అనుకున్నావా మీ రిక్కీ నీకు సలహాలు ఇస్తాడని అడిగారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంటూ శివాజీ తెలిపాడు. ప్రగతి వచ్చి.. ప్రియాంకను నువ్వు చేస్తున్నదానికి ఐయామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని తెలిపింది. ప్రియాంక మదర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. తర్వాత అందరూ తమ వారికి సలహాలు ఇచ్చారు. రతికా సింగ్ (Rathika Singh Dance Performance) డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. తర్వాత కాజోల్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చింది. మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో .. టాప్ 5 గేమ్ ఆడించారు నాగార్జున. దీంతో ప్రోమో ముగిసింది.
Also Read : ఈ సింపుల్ చిట్కాలతో మీ పగిలిన పాదాలకు చెక్ పెట్టండి