బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారం పూర్తయ్యింది. మొదటిసారి వీకెండ్‌కు కంటెస్టెంట్స్‌తో మాట్లాడడానికి నాగ్ కూడా ఎంటర్ అయిపోయారు. ప్రేక్షకులకు, కంటెస్టెంట్స్‌కు మధ్య ఒక బ్రిడ్జ్‌గా వ్యవహరిస్తారు నాగ్. ప్రేక్షకుల అభిప్రాయాలు ఏంటి, కంటెస్టెంట్స్ గురించి వారు ఏం అనుకుంటున్నారు, అసలు బిగ్ బాస్ సీజన్ ఎలా ఉంది.. ఇలాంటి అంశాలను బిగ్ బాస్ టీమ్.. బాగా విశ్లేషించి నాగార్జునకు వివరిస్తారు. అవే అంశాలను వచ్చి కంటెస్టెంట్స్‌తో మాట్లాడతారు నాగ్. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ప్రేక్షకులు.. ప్రతీ కంటెస్టెంట్‌కు ఎన్ని మార్కులు వేస్తారు అనే కొత్త అంశంతో నాగ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


ముందుగా కంటెస్టెంట్స్‌ అందరికీ సెల్ఫ్ అసెస్మెంట్ కార్డ్స్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. ఆ సెల్ఫ్ అసెస్మెంట్‌లో వారు వేసుకున్న స్కోర్‌కు, ప్రేక్షకులు వారికి వేసుకున్న స్కోర్‌ను పోల్చి చూశారు నాగార్జున. ప్రియాంక జైన్.. తనకు తాను 100 మార్కులు వేసుకుంది. ఆడియన్స్ మాత్రం తనకు 71 మార్కులే వేశారు. శివాజీ.. తనకు తాను 90 మార్కులు వేసుకున్నారు. ఆడియన్స్ మాత్రం తనకు 74 మార్కులే ఇచ్చారు. దామిని తనకు తాను 95 మార్కులు ఇచ్చుకుంది. ఆడియన్స్ తనకు కేవలం 62 మార్కులే ఇచ్చారు. ఈ విషయాన్ని దామిని ముందే గెస్ చేసింది. ఆడియన్స్ తనకు ఎక్కువ మార్కులు ఇవ్వరేమో, తను బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వలేకపోతున్నానేమో అని దామిని ముందే చెప్పింది.


యావర్.. తనకు తాను 94 మార్కులు ఇచ్చుకున్నాడు. ఆడియన్స్ మాత్రం తనకు 69 మార్కులు ఇచ్చారు. షకీలా తనకు తాను 85 మార్కులే ఇచ్చుకుంది. అందరు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే తనకు తాను తక్కువ మార్కులు ఇచ్చుకున్న కంటెస్టెంట్ షకీలా మాత్రమే. ఇలా చూసుకుంటే షకీలాకు ఆడియన్స్ దగ్గర నుండి 69 మార్కులు వచ్చాయి. సందీప్ తనకు తాను 90 మార్కులు ఇచ్చుకున్నాడు. ప్రేక్షకులు మాత్రం 72 ఇచ్చారు. కానీ అందరితో పోలిస్తే ప్రేక్షకుల ఆలోచనలను ఎక్కువగా గెస్ చేయగలిగాడు సందీప్. శోభా శెట్టి తనకు తాను 93 మార్కులు ఇచ్చుకుంది. ఇక ప్రేక్షకులు తనకు 76 మార్కులు ఇచ్చారు. 


కొందరు కంటెస్టెంట్స్ ఒవర్ కాన్ఫిడెన్స్..
బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్‌తో సన్నిహితంగా ఉంటూ హాట్ టాపిక్‌గా మారిన రతిక.. తనకు తాను 90 మార్కులు వేసుకుంది. ప్రేక్షకులు కూడా తన గెస్‌కు తగినట్టుగా మార్కులు ఇచ్చారు కానీ 10 మార్కులు తగ్గించారు. అంటే టోటల్‌గా రతికకు ఆడియన్స్ తరపున 80 మార్కులు వచ్చాయి. పల్లవి ప్రశాంత్.. తనకు తాను 78 మార్కులు వేసుకున్నాడు. షకీలా కంటే పల్లవి ప్రశాంత్ తనకు తాను చాలా తక్కువ మార్కులు ఇచ్చుకున్నాడు. ఆడియన్స్ కూడా తను గెస్ట్ చేసినట్టుగా 74 మార్కులే ఇచ్చారు. టేస్టీ తేజ తనకు తాను చాలా కాన్ఫిడెంట్‌గా 100 మార్కులు వేసుకున్నాడు. ఆడియన్స్ మాత్రం తనకు 77 మార్కులు మాత్రమే ఇచ్చారు. కిరణ్ రాథోడ్ కూడా కాన్ఫిడెన్స్‌తో తనకు తాను 100 మార్కులు వేసుకుంది. కానీ ఆడియన్స్ మాత్రం అందులో కరెక్ట్‌గా సగం.. అంటే 50 మాత్రమే ఇచ్చారు. అమర్‌దీప్ తనకు తాను 97 మార్కులు వేసుకున్నాడు. ఆడియన్స్ మాత్రం 60 మార్కులు మాత్రమే ఇచ్చారు. శుభశ్రీ తనకు తాను 98 వేసుకోగా.. ఆడియన్స్ మాత్రం 65 ఇచ్చారు. ఈ మార్కులను బట్టి చూస్తే.. కిరణ్ రాథోడ్.. ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో అందరి కంటెస్టెంట్స్ కంటే లాస్ట్‌లో ఉందని తెలుస్తోంది.