‘బిగ్ బాస్’ సీజన్-6 రసవత్తరంగా సాగుతోంది. మొన్నటి వరకు కంటెస్టెంట్ల పోట్లాటలతో వేడెక్కిన బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. ఇందుకు కారణం.. ‘బిగ్ బాస్’ బర్త్ డే. ‘బిగ్ బాస్’ బర్త్ డే సందర్భంగా కొన్ని సరదా టాస్కులతో కంటెస్టెంట్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ‘బిగ్ బాస్’ ఫైమాకు సీక్రెట్ టాస్కు ఇచ్చాడు. రాత్రి అందరూ నిద్రపోయాక వారిని మూడు సార్లు డిస్ట్రబ్ చేయాలని బిగ్ బాస్ తెలిపాడు. అయితే వారి నిద్రని చెడగొట్టేంది తానే అని మాత్రం ఇంటి సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. దీంతో ఫైమా ఆ పనిలో పడింది.


బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కూడా కామెడీగా సాగనుంది. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి కేక్‌తో ఓ జోకర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో హౌస్ మేట్స్ అంతా కేక్ కోసం ఎగబడ్డారు. ఇంతలో బిగ్ బాస్ ఫ్రీజ్ చెప్పాడు. దీంతో ఆ జోకర్ కేకును తీసుకెళ్లి సత్య ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు అంతా షాకయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్.. శ్రీహన్, చంటీలకు చుక్కలు చూపించే టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులంతా చంటీ, శ్రీహన్ కాళ్లకు వ్యాక్స్ పెట్టాలన్నాడు. దీంతో సత్య, గీతూ, ఇయనా ఆ పనిలో పడ్డాడు. ఆ సమయంలో శ్రీహన్ కాస్త గట్టిగానే కేకలు పెట్టాడు. చంటి మాత్రం సైలెంట్‌గా, తనకు అలవాటే అన్నట్లుగా వ్యాక్స్ చేయించుకున్నాడు. శ్రీహన్ అరుస్తుండటంతో బిగ్ బాస్ నిద్రకు భంగం కలిగింది. శ్రీహన్ నిశబ్దంగా ఉండాలని, అతడి వాయిస్‌ను ఇయనా వినిపించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ఇయనా దీన్ని రివేంజ్‌గా ఉపయోగించుకుంది. శ్రీహన్ ఇంకా గట్టిగా కాళ్ల వెంటుకలు పీకమంటున్నాడని చెప్పింది. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా ‘జంబ లకడి పంబ’లోని రెండో స్టేజ్‌కు వెళ్లారు. స్కూల్ పిల్లల్లా మారి అల్లరి చేశారు. బాలాదిత్య వారికి టీజర్‌గా మారాడు. ఆ ఫన్ చూడాలంటే.. ఈ రోజు ప్రసారమయ్యే బిగ్ బాస్‌ ఎపిసోడ్‌ను చూడాల్సిందే. 



‘బిగ్ బాస్’ 30వ రోజు హైలెట్స్: బిగ్‌బాస్ బర్త్ డే అని చెప్పి 30వ రోజు అంతా వినోదాన్ని పంచే విధంగా ప్లాన్ చేశారు. ఇందులో కూడ గీతూ గీతూ ఓవర్ కాన్ఫిడెన్స్, యాటిట్యూట్ చిరాకు తెప్పించాయి. ఈ యాటిట్యూడ్‌తో ఆమె విన్నర్ అయితే అంత కన్నా చిరాకు విషయం మరొకటి ఉండదు. 


ఎపిసోడ్‌లో ఏమైందంటే బిగ్‌బాస్ తన పుట్టినరోజు సందర్భంగా తనని ఎంటర్టైన్ చేసి కేకు ముక్కని తినవచ్చని చెప్పారు. దీంతో సూర్య కాసేపు మిమిక్రీ చేశాడు. రేవంత్ పాట పాడాడు. సుదీప డ్యాన్సు చేసింది. అలాగే శ్రీహాన్ - అర్జున్ కలిసి డ్యాన్సు చేశారు. ఇలా మూడు నాలుగు పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి కేకును తినేశారు. 


అర్జున్ బాధ...
శ్రీహాన్ తో కలిసి శ్రీ సత్య డ్యాన్సు చేస్తున్నంతసేపు అర్జున్ ముఖం మాడిపోయి కనిపించింది. దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా సెట్ కావడం లేదు. ఈ విషయపై సుదీప దగ్గర మాట్లాడుతూ ‘ఆమె నాతో కావాలనే డ్యాన్సు చేయలేదని, ఆ విషయం తనకు చెప్పిందని’ అన్నాడు. తనతో డ్యాన్సు చేయకుండా, శ్రీహాన్ తో ఎందుకు చేశావని శ్రీ సత్యను అడిగేశానని కూడా చెప్పాడు అర్జున్. ఇతని బాధేంటో ఆయనకే తెలియాలి. బిగ్‌బాస్ ఇంటికి వచ్చి ఆడకుండా శ్రీ సత్య చుట్టూ తిరుగుతుంటే బయట ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా అర్జున్‌కు లేదు. ఈ విషయంలో అందరికన్నా ఇతనే అమాయకుడిలా కనిపిస్తున్నాడు. 


ఫైమా ఇరగదీసింది...
కాసేపటికి ఫైమా స్కిట్ మొదలుపెట్టింది. పెళ్లిచూపులు స్కిట్ అదిరిపోయింది. ఇందులో లవర్‌గా అర్జున్ కళ్యాణ్, పెళ్లి కొడుకుగా రాజ్ నటించాడు. ఇందులో ఫైమా ఇరగదీసింది. చివర్లో అందరూ కలిసి ఈ వర్షం సాక్షిగా అనే పాటకు డ్యాన్సు చేశారు. ఇక సుదీపకి తొమ్మిదో ఎక్కాన్ని చెప్పమని అడిగారు. 


గాసిప్ క్వీన్ 
ఇక గీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. గాసిప్పులు చెబితే చికెన్ తినవచ్చని ఆఫర్ ఇచ్చారు.  ఆమెను నోరు విప్పితే చెప్పే విషయాలకు అంతు ఉండదు. ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఈరోజు కూడా గీతూ ప్రవర్తన కాస్త విసుగ్గా అనిపించింది. సూర్య - ఇనయా మధ్య ఏదో అవుతోందని, బాలాదిత్య పదే పదే దీపూ దీపూ అంటుంటే మండుతోందంటూ మొదలుపెట్టింది. చివరికి చికెన్ తినే అవకాశాన్ని ఇచ్చారు. కానీ తింటున్నప్పుడు ఆ బిల్డప్ చూడడం చాలా కష్టంగా అనిపించింది.


‘వస‘పత్ర సాయికి...
బిగ్ బాస్ అయిదుగురి ఇంటి సభ్యులను నెత్తిమీద స్టీలు ప్లేటు, గిన్నె పెట్టుకోమన్నాడు. తాను నిద్రపోతానని ఆ సమయంలో ప్లేటు కిందపడకుండా చూసుకోమని చెప్పాడు. రాజ్ ప్లేటు కిందపడి సౌండు రావడంతో అతనిని లాలా పాట పాడమన్నాడు బిగ్బాస్. తెలుగువారి ఫేవరేట్ లాలి పాట పాడాడు. ‘వసపత్రసాయికి’ అంటూ పాట పాడాడు. వటపత్రసాయికి అన్న విషయం కూడా అతనికి తెలియకపోవడం విచిత్రం.