Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ బర్త్ డే అని చెప్పి నేటి ఎపిసోడ్ అంతా వినోదాన్ని పంచే విధంగా ప్లాన్ చేశారు. ఇందులో కూడ గీతూ గీతూ ఓవర్ కాన్ఫిడెన్స్, యాటిట్యూట్ చిరాకు తెప్పించాయి. ఈ యాటిట్యూడ్‌తో ఆమె విన్నర్ అయితే అంత కన్నా చిరాకు విషయం మరొకటి ఉండదు. 


ఎపిసోడ్‌లో ఏమైందంటే బిగ్‌బాస్ తన పుట్టినరోజు సందర్భంగా తనని ఎంటర్టైన్ చేసి కేకు ముక్కని తినవచ్చని చెప్పారు. దీంతో సూర్య కాసేపు మిమిక్రీ చేశాడు. రేవంత్ పాట పాడాడు. సుదీప డ్యాన్సు చేసింది. అలాగే శ్రీహాన్ - అర్జున్ కలిసి డ్యాన్సు చేశారు. ఇలా మూడు నాలుగు పెర్ఫార్మెన్స్ లు ఇచ్చి కేకును తినేశారు. 


అర్జున్ బాధ...
శ్రీహాన్ తో కలిసి శ్రీ సత్య డ్యాన్సు చేస్తున్నంతసేపు అర్జున్ ముఖం మాడిపోయి కనిపించింది. దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా సెట్ కావడం లేదు. ఈ విషయపై సుదీప దగ్గర మాట్లాడుతూ ‘ఆమె నాతో కావాలనే డ్యాన్సు చేయలేదని, ఆ విషయం తనకు చెప్పిందని’ అన్నాడు. తనతో డ్యాన్సు చేయకుండా, శ్రీహాన్ తో ఎందుకు చేశావని శ్రీ సత్యను అడిగేశానని కూడా చెప్పాడు అర్జున్. ఇతని బాధేంటో ఆయనకే తెలియాలి. బిగ్‌బాస్ ఇంటికి వచ్చి ఆడకుండా శ్రీ సత్య చుట్టూ తిరుగుతుంటే బయట ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా అర్జున్‌కు లేదు. ఈ విషయంలో అందరికన్నా ఇతనే అమాయకుడిలా కనిపిస్తున్నాడు. 


ఫైమా ఇరగదీసింది...
కాసేపటికి ఫైమా స్కిట్ మొదలుపెట్టింది. పెళ్లిచూపులు స్కిట్ అదిరిపోయింది. ఇందులో లవర్‌గా అర్జున్ కళ్యాణ్, పెళ్లి కొడుకుగా రాజ్ నటించాడు. ఇందులో ఫైమా ఇరగదీసింది. చివర్లో అందరూ కలిసి ఈ వర్షం సాక్షిగా అనే పాటకు డ్యాన్సు చేశారు. ఇక సుదీపకి తొమ్మిదో ఎక్కాన్ని చెప్పమని అడిగారు. 


గాసిప్ క్వీన్ 
ఇక గీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. గాసిప్పులు చెబితే చికెన్ తినవచ్చని ఆఫర్ ఇచ్చారు.  ఆమెను నోరు విప్పితే చెప్పే విషయాలకు అంతు ఉండదు. ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఈరోజు కూడా గీతూ ప్రవర్తన కాస్త విసుగ్గా అనిపించింది. సూర్య - ఇనయా మధ్య ఏదో అవుతోందని, బాలాదిత్య పదే పదే దీపూ దీపూ అంటుంటే మండుతోందంటూ మొదలుపెట్టింది. చివరికి చికెన్ తినే అవకాశాన్ని ఇచ్చారు. కానీ తింటున్నప్పుడు ఆ బిల్డప్ చూడడం చాలా కష్టంగా అనిపించింది.


‘వస‘పత్ర సాయికి...
బిగ్ బాస్ అయిదుగురి ఇంటి సభ్యులను నెత్తిమీద స్టీలు ప్లేటు, గిన్నె పెట్టుకోమన్నాడు. తాను నిద్రపోతానని ఆ సమయంలో ప్లేటు కిందపడకుండా చూసుకోమని చెప్పాడు. రాజ్ ప్లేటు కిందపడి సౌండు రావడంతో అతనిని లాలా పాట పాడమన్నాడు బిగ్బాస్. తెలుగువారి ఫేవరేట్ లాలి పాట పాడాడు. ‘వసపత్రసాయికి’ అంటూ పాట పాడాడు. వటపత్రసాయికి అన్న విషయం కూడా అతనికి తెలియకపోవడం విచిత్రం. 


ఫైమాకు సీక్రెట్ టాస్కు
ఫైమాను పిలిచి సీక్రెట్ టాస్కు ఇచ్చారు బిగ్‌బాస్. రాత్రి అందరూ నిద్రపోయాక వారి నిద్దరని మూడు సార్లు భంగం చేయాలని ఇచ్చారు. అయితే వారి నిద్రని చెడగొట్టేంది తానే అని మాత్రం ఇంటి సభ్యులకు తెలియకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. బయటికి వచ్చాక ఫైమా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఇచ్చింది. 


మనం గేమర్లం
గీతూ దగ్గరకెళ్లి ముచ్చట్లు పెట్టింది ఫైమా. మనం గేమర్లం కాబట్టే మనల్ని లోపలికి పిలిచి టాస్కులిచ్చారు అంటూ గొప్పలు పోయింది. నాకు చికెన్ పెట్టారు, నీకు పిజ్జా పెట్టారు అంటూ గొప్పలు పోయింది. 


Also read: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు


Also read: శ్రీసత్యను శ్రీహాన్ ఎత్తుకోగానే అర్జున్ కళ్లల్లో అసూయ చూడాల్సిందే