బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. 

 

ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో పలు టాస్క్ లు ఆడించి డేంజర్ జోన్ లో మిత్రా, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ లను పెట్టారు. వారు ముగ్గురికి ఎగ్స్ టాస్క్ ఇచ్చి గేమ్ ఆడించగా.. మిత్రా సేఫ్ అని వచ్చింది. ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. అందరూ ఊహించినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. కానీ ఆమె ఎంతమాత్రం బాధ పడకుండా నవ్వుతూ హౌస్ నుంచి బయటకు వెళ్లింది. 

 

స్టేజ్ పైకి వెళ్లిన శ్రీరాపాకతో గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ లో ఎవరిని నమ్మొచ్చో, నమ్మకూడదో చెప్పాలని అడిగారు. అషురెడ్డి, తేజస్వి, బిందు, అఖిల్, ఆర్జే చైతులను నమ్మొచ్చని చెప్పింది. స్రవంతి, మిత్రా, అజయ్ లకు అన్ ట్రస్ట్ ఇచ్చింది. అరియనా కాన్ఫిడెంట్ గా ఉంటుందని.. నటరాజ్ మాస్టర్ చాలా ఎమోషనల్ అని, సరయు హానెస్ట్ గా ఉంటుందని చెప్పింది.