బిగ్ బాస్ షో నుంచి ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని ముందే ఊహించేస్తున్నారు జనాలు. సీజన్ 5 ఎలిమినేషన్ మొత్తం కూడా ఊహించినట్లుగానే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈసారి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. అందులో ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఆ తరువాత రవి హోస్ట్ చేస్తోన్న షోలో కనిపించింది ముమైత్. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే ఆమె ఆలోచించకుండా శ్రీరాపాక పేరు చెప్పింది.
ఆమె చెప్పినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. నిజానికి హౌస్ లో ఉన్న వాళ్లతో పోలిస్తే.. టాస్క్ ల పరంగా శ్రీరాపాక పర్వాలేదనిపించింది. కానీ ఆమె సరైన ఫాలోయింగ్ లేకపోవడంతో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ.. రవికి ఇంటర్వ్యూ ఇచ్చింది శ్రీరాపాక. ఇందులో వచ్చే వారం బిందు మాధవి ఎలిమినేట్ అవుతుందని చెప్పింది 'నగ్నం' బ్యూటీ. హౌస్ లో ఉన్న పరిస్థితి చూస్తుంటే.. వచ్చే వారం బిందు డేంజర్ లో పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
దానికి వివరణ ఇస్తూ.. హౌస్ లో ఆల్రెడీ పులిహోర బ్యాచ్ లు రెడీ అయ్యాయని.. వారు బిందు మాధవిని టార్గెట్ చేసి వచ్చేవారం నామినేట్ చేస్తారని చెప్పింది. అఖిల్, తేజస్వి, నటరాజ్ మాస్టర్, అజయ్ ఇలా కొంతమంది బిందుని నామినేట్ చేస్తారని.. సో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది శ్రీరాపాక. సరయు, బిందు మాధవిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని.. వీరిద్దరిలో బిందు ఎలిమినేట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పింది.
శ్రీరాపాక అలా చెప్పిందో లేదో.. ఈ వారం నామినేషన్ ప్రోమో విడుదలైంది. అందులో అఖిల్ అండ్ కో.. బిందుని టార్గెట్ చేసి ఆమెని నామినేట్ చేస్తున్నారు. కానీ ఆమె హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఎంతమంది నామినేట్ చేసినా.. బిందు ఇప్పట్లో హౌస్ ని వెళ్లే ఛాన్స్ లేదనే విషయం స్పష్టమవుతోంది. గేమ్ విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది బిందు. తనకు ఏమనిపిస్తే అది చేస్తూ.. తన బిహేవియర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.